For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక : యాంటీడిప్రజెంట్స్ వాడటం వల్ల మీరు మరణించే ప్రమాదం ఉంది

By R Vishnu Vardhan Reddy
|

మనోవ్యాకులతను పోగొట్టు మందులు - సాధారణంగా కొంత మంది వ్యక్తుల్లో ఉన్న ఒత్తిడిని మరియు ఆతురతను తగ్గించుకోవడానికి ఈ మందులను వాడుతారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల చావు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. అది ఎలాగంటే, మన శరీరంలో ఉన్న వివిధ అవయవాల పై ఎంతో దుష్ప్రభావాన్ని చూపించి వాటిని పనిచేయనీకుండా చేస్తాయని, అందువల్ల మరణించే అవకాశాలు పెరుగుతాయి అని వీటి పై అధ్యయనాలు చేసిన కొంత మంది హెచ్చరిస్తున్నారు.

మన మెదడు లో ఉండే సెరోటోనిన్ అనే పదార్ధం మన యొక్క ఆలోచనల పై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ, ఎప్పుడైతే మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధములను చికిత్సలో భాగంగా వాడుతారో, అటువంటి వ్యక్తల మెదడులో ఉండే నాడీకణాలు ఈ సెరోటోనిన్ అనే పదార్ధాన్ని పీల్చుకోనివ్వకుండా ఆ మందులు అడ్డుపడతాయి.

antidepressants names

అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే, మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాలైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇవన్నీ రక్తంలో ఉండే సెరోటోనిన్ ని ఉపయోగించుకుంటాయి.

డిప్రెషన్ కు కారణాలు...నివారణోపాయాలు....!

మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు, వివిధ అవయవాలను కూడా సెరోటోనిన్ ని పీల్చుకోనివ్వకుండా అడ్డుపడతాయి. దీని వల్ల శరీరంలో ఉండే అవయవాల పనితీరు పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి వాటిని పనిచేయకుండా చేరే స్థితికి ఈ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు తీసుకెళ్తాయి. కాబట్టి వీటిని వాడటం వల్ల మృత్యువు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిశోధనలో భాగంగా వేల మందిని అధ్యయనం చేసినప్పుడు, ఏ వ్యక్తులైతే మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు వాడుతున్నారో, అలాంటి పదార్ధాలను వాడని వారికంటే వీరిలో 33% అధికంగా, త్వరగా మరణించే అవకాశం ఉందని గుర్తించారు.

ఈ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు వాడే వ్యక్తుల్లో 14% మందికి పైగా గుండె సంబంధిత వ్యాదులైన గుండె పోటు మరియు గుండె అనూహ్యంగా ఆగిపోవడం వంటి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది అని తెలిపారు.

antidepressants names

" ఈ అధ్యయనంలో వచ్చిన ఫలితాలు చూసి మేము చాలా విస్తుపోయాము మరియు కలత చెందాము. వీటి వల్ల తెలిసిన విషయం ఏమిటంటే మనం మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలను వాడినప్పుడు అవి మన శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. అవి ఎలా మన శరీరం లోపల వ్యవహరిస్తాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత వాటిని వాడటం మంచిది. " అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు తెలిపిన అభిప్రాయం.

అమెరికాలో ప్రతి 8 మంది పెద్దలలో ఒకరు తరచూ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలను వాడుతున్నారు. ఆయా వ్యక్తులలో ఎటువంటి మానసిక ఆందోళనను గుర్తించకపోయినా, ఆయా వైద్యులు ఈ పదార్ధాలను వాడమని ఇస్తున్నారు. ఎందుచేతనంటే, అవి హానికరమైనవి కావి అని వారు భావిస్తున్నారు.

ఒత్తిడి అనేది చాలా తీవ్రమైనది - ఏ వ్యక్తులు అయితే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారో, అటువంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడతారు లేదా వారిలో గుండెపోటు మరియు గుండె ఆగిపోయే స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. చాలా మంది వైద్యులు మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలను వాడటం వల్ల ఈ ఒత్తిడి లక్షణాలు తగ్గిపోయి ఆయా వ్యక్తులు ప్రాణాలతో బయట పడతారని భావిస్తారు.

" ఈ మందులు వారి యొక్క మెదడు పైనే కాకుండా, మెదడు బయట కూడా ప్రభావం చూపిస్తోంది అనే విషయం తెలిస్తే ప్రజలు వీటిని స్వీకరించడానికి దూరంగా ఉంటారు మరియు వీటిని వాడటం వల్ల మృత్యువాతపడే ప్రమాదం ఉంది అనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి " అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక పరిశోధకుడు తెలిపాడు.

డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించే అమేజింగ్ ఫుడ్స్...!

ఈ అధ్యయనంలో గుర్తించిన విషయాలు ఆధారంగా, మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు అసలు ఒక శరీరం పైన ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఏ వ్యక్తులైతే గుండె సంబంధిత వ్యాధులతో మరియు మధుమేహం తో బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధాలు వాడటం వల్ల వారికి ఎటువంటి హాని జరగదని గుర్తించారు. ఇది వినడానికి కొద్దిగా నిజం అనిపించేలా ఉంది. ఎందుకంటే, ఈ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధములు రక్తాన్ని కొద్దిగా పలుచన చేస్తాయి. అంతేకాకుండా అటువంటి అనారోగ్య స్థితులను చికిత్స చేయడానికి కూడా ఇవి సహకరిస్తాయి.

దురదృష్టవశాత్తు ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు లేకుండా, అటువంటి వ్యక్తులు ఈ మనోవ్యాకులతను పోగొట్టు పదార్ధములు వాడటం వల్ల వారికి చాలా హాని కలిగే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఈ విషయాలన్నింటిని ఓ ప్రముఖ పత్రికలో ప్రచురించారు.

English summary

Warning: Antidepressants May Up Death Risk

Antidepressants block the absorption of serotonin in these organs as well, and the researchers warn that antidepressants could increase the risk of death by preventing multiple organs from functioning properly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more