ఈ ఆహారాలను కలిపి తీసుకుంటే చాలా ప్రమాదకరం

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనం ఏమి తింటున్నాము అనేదాని పై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందువల్ల మనం తింటున్న ఆహరం రుచిగా ఉందా అనే విషయమే కాకుండా అది ఆరోగ్యవంతమైనది అవునా కాదా అని తెలుసుకొని తినడం మంచిది.

కొన్ని సార్లు కొన్ని రకాలైన ఆహారాలను తీసుకోవడం వల్ల అవి మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆయా ఆహారాల కలయిక వల్ల చెడు జరుగుతుంది. ఆ ఆహారం విషంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో అది మరణానికి కూడా దారి తీయవచ్చు.

గ్యాస్ర్టిక్ ట్రబుల్ కి కారణమయ్యే ఫుడ్ కాంబినేషన్స్

మనలో చాలా మంది వివిధ ఆహారాలను కలిపి ఒకటేసారి భుజించడాన్ని ఇష్టపడతారు. ఉదాహరణకు మాంసంలో చీజ్ ని కలుపుకొని తినడం, సలాడ్స్ లో పండ్లను వేసుకోవడం, పాలతో పండ్లను తీసుకోవడం మొదలైనవి.

ఆయుర్వేద శాస్త్రం లోని కొన్ని సిద్ధాంతాలు మరియు సూత్రాలు కొన్ని ఆహారాలను కలిపి భుజించడం చాలా ప్రమాదకరం అని చెబుతున్నాయి అనే విషయం మీకు తెలుసా ?

ఈ విధమైన ఆహార కలయికలో భుజిస్తే గనుక మీ శరీరం ఉబ్బిపోయినట్లవుతుంది, బరువెక్కినట్లు మరియు నీరసంగా ఉంటుంది. అవి మీ యొక్క జీర్ణ ప్రక్రియ పై కూడా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల మీకు కడుపు నొప్పి, వికారంగా మరియు అలసటగా ఉంటుంది. అంతే కాకుండా మలవిసర్జన సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

వీటిని విడివిడిగా తినడం కంటే కలిపి తింటేనే రెట్టింపు లాభం..!

ఈ క్రింద అత్యంత ప్రమాదకరమైన ఆహార కలయికల గురించి చెప్పడం జరిగింది. కావున ఈ క్రింద చెప్పబడిన విషయాలన్నింటిని శ్రద్ధగా చదివి, ఆయా ఆహారాలను కలిపి తీసుకోవడం పూర్తిగా నిషేధించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

1. పాలతో కోకో గింజలతో తయారు చేసే పానీయాన్ని కలిపి సేవించడం :

1. పాలతో కోకో గింజలతో తయారు చేసే పానీయాన్ని కలిపి సేవించడం :

కోకో లో ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరం క్యాల్షియం పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే కోకోతో పాలను కలుపుతారో, అందులో ఉన్న ఆమ్లా ప్రభావం వల్ల ఆక్సలేట్ స్పటికాలు ఏర్పడతాయి. ఇవి గనుక ఎక్కువైతే మూత్రపిండాల పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కలయికలో గనుక ఆహారాన్ని సేవిస్తే మీరు అనారోగ్యం పాలవుతారు.

2. సలాడ్ పైన నిమ్మ రసం లేదా వెనిగర్ ని వాడటం :

2. సలాడ్ పైన నిమ్మ రసం లేదా వెనిగర్ ని వాడటం :

ఆకుకూరలు మరియు కూరగాయల్లో ఎన్నో రకాలైన విటమిన్లు మరియు కెరోటినాయిడ్స్ వంటి అమూల్యమైన పోషకాలు ఉంటాయి. వీటన్నింటిని మన శరీరం గ్రహించాలంటే కొవ్వు అనేది అవసరం. అందుచేత మీరు తరాజుచేసుకునే సలాడ్ లో అవొకాడో, ఆలివ్స్ లేదా కొన్ని నట్స్ ఇలా అధిక కొవ్వు కలిగిన పదార్ధాలను అందులో కలుపుకోవాలి. నిమ్మరసం లేదా వెనిగర్ మాత్రమే మీ సలాడ్ లో కలుపుకున్నట్లైతే అవి మీకు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.

3. చీస్ పాస్తా లో టమోటా కలిపి తినడం :

3. చీస్ పాస్తా లో టమోటా కలిపి తినడం :

పాస్తాలో కార్బోహైడ్రేట్స్ తో కూడిన గంజి పదార్ధాన్ని జీర్ణించుకోవడానికి మీ లాలాజలములో ఉండే పిండిని చక్కెరగా మార్చు లాలాజలము ఎంతగానో ఉపయోగపడుతుంది. టమోటాలలో మాలిక్, ఆక్సాలిక్ మరియు సిట్రిక్ ఆమ్లం కొద్ది కొద్ది మోతాదులో ఉండటంతో అది పులియబెట్టే ప్రక్రియను అస్థిరపరుస్తాయి. అందుచేత పాస్తాలో ఉండే ఆ గంజి పదార్థాన్ని జీర్ణించుకునే ప్రక్రియకు అవి విఘాతం కలిగిస్తాయి.

4. గుడ్లతో పంది మాంసం తినడం :

4. గుడ్లతో పంది మాంసం తినడం :

ఈ రెండింటిలో ఎంతో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అందుచేత ఈ రెండింటిని కలిపి తినడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ పదార్ధాలన్నింటిని కలిపి తింటే వాటిని జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అత్యంత ప్రమాదకరమైన ఆహారాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి, ఈ రెండింటిని కలిపి తినడాన్ని నిషేధించడం మంచిది.

5. పాలల్లో తవుడు కలుపుకొని త్రాగడం :

5. పాలల్లో తవుడు కలుపుకొని త్రాగడం :

తవుడులో పైటిక్ ఆమ్లం ఉండటం వల్ల ఇది క్యాల్షియం లేదా మెగ్నీషియం తో కలిసినప్పుడు కరగని సమ్మేళనాలు ఏర్పడతాయి. అందువల్ల వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందవు. ఎందుకంటే అవి అందకుండా చేస్తాయి. ఈ రెండిటి కలయిక చాలా చెడ్డది. కాబట్టి అలా సేవించడాన్ని పూర్తిగా నిషేధించండి.

6. నారింజ పళ్ళరసంతో తృణధాన్యాలు తీసుకోవడం :

6. నారింజ పళ్ళరసంతో తృణధాన్యాలు తీసుకోవడం :

నారింజ పళ్ళ రసంతో పాటు తృణధాన్యాలు ను ఉదయాన్నే తింటే మీకు కావాల్సినంత శక్తి లభించదు. మీకు అసౌకర్యం కలుగుతుంది మరియు మీ పొట్ట చాలా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. నారింజ పళ్ళ రసంలో ఉండే ఆమ్లం కడుపులో ఉన్న సూక్ష్మ జీవులు చేసే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. అందువల్ల కార్బోహైడ్రాట్స్ త్వరగా విడిపోవు. దీంతో మనకు కావాల్సినంత శక్తి అందదు.

7. పిజ్జా తో సోడా త్రాగటం :

7. పిజ్జా తో సోడా త్రాగటం :

ప్రోటీన్లు, కార్బోహైడ్రాట్లు మరియు గంజి ఈ మూడింటి కలయికను జీర్ణించుకోవాలంటే విపరీతమైన శక్తి అవసరమవుతుంది. సోడాలో ఉండే చక్కర, కడుపులో జరిగే ఈ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. అందుచేత మీ కడుపు ఉబ్బిపోయినట్లు మరియు బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

8. గోధుమ బ్రెడ్ తో జామ్ను కలిపి తినడం :

8. గోధుమ బ్రెడ్ తో జామ్ను కలిపి తినడం :

శుద్ధి చేసిన గోధుమ పిండిని చక్కర పదార్ధాలతో కలిపి తిన్నప్పుడు రెండింతలు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుచేత మీ కడుపు తీవ్రంగా ఉప్పొంగినట్లు అనిపిస్తుంది. పులియబెట్టిన పిండిలో ఈస్ట్ కలవడంతో పాటు, చక్కర పదార్ధాలు కూడా ఉండటం వల్ల ఇవి మీ ప్రేగుల్లో కొద్దిగా అలజడి సృష్టిస్తాయి. ఇది మన భారత దేశంలో తీసుకునే ఆహారాల్లో అత్యంత హానికర ఆహారపదార్ధాల కలయిక.

English summary

Avoid These Common Food Combinations That Are Far Too Dangerous!

In this article, we have listed some of the top dangerous food combinations. So, read further to know more about the bad food combinations that you must avoid at any cost.