For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం నీళ్ళు తాగేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యానికి మరింత మంచిది

By Ashwini Pappireddy
|

ఒక ప్రసిద్ధ కోట్ "నీరు భూమి యొక్క ఆత్మ" అని చెబుతుంది. మనందరం దీనిని అంగీకరించాల్సిన విషయం ఎందుకంటే, జీవి ఉనికికి అత్యంత ముఖ్యమైన వాటిలో నీరు కూడా ఒకటి.

సూక్ష్మజీవుల నుండి అన్ని జీవులకు అత్యంత ఉన్నతమైనది, అనగా మనుషులు, ఈ భూమిపై ఉన్న అన్ని జీవులూ జీవించడానికి నీరు అవసరం.

<strong>రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు</strong>రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

నీరు లేకపోతే, చావు వస్తుంది మరియు అది మరింత త్వరగా అవుతుంది! అవును, ఇది నిజం మనం ఆహారం లేకుండా కొన్ని రోజులు మన మనుగడ ని సాగించవచ్చు, కానీ నీరు లేకపోతే కొన్ని గంటలలోనే మన అవయవాలలో ఏదో ఒకటి ఫెయిల్ అయే అవకాశముంది.

మనందరికీ బాగా తెలుసు, మానవ శరీరం 78% నీటి తోనే తయారు చేయబడింది. కనుక మన ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి ఎప్పటికప్పుడు నీటిని పునరుద్ధరించడం ఎంత ముఖ్యమైనది అని దీనిని బట్టి మీరు ఊహించవచ్చు.

చాలా చిన్న వయస్సు నుండి,పాఠశాల లో మరియు మన ఇళ్లలో ఎల్లప్పుడూ ఒక రోజులో తగినంత నీరు త్రాగాలి అని మనకి భోదిస్తూనే వుంటారు.

ఇప్పుడు, మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి నీరు అవసరం, సగటున ఒక వ్యక్తి రోజుకు 2 లీటర్లు మరియు ఒకవేళ మీరు ఏవైనా రోగాల బారినపడినట్లయితే లేదా మీరు తీవ్రమైన వ్యాయామంలో మునిగి పోతే, రోజుకు 3 లీటర్ల నీరు అవసరమవుతుంది.

<strong>రోజులో ఏ సమయంలో వాటర్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూడండి..!!</strong>రోజులో ఏ సమయంలో వాటర్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూడండి..!!

ఒకవేళ మీరు తగినంత నీరు తాగకపోతే,అది డిహైడ్రాషన్ కి కారణమవుతుంది మరియు ఈ డిహైడ్రాషన్ అనేక ప్రధాన మరియు చిన్నవైన రుగ్మతలకి మూల కారణం అని తెలుస్తుంది.ఒక చిన్న తలనొప్పి నుండి గుండె జబ్బుల వరకు, (నిర్జలీకరణం) డిహైడ్రాషన్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది!

అందువల్ల, తగినంత నీటిని త్రాగడం మరియు ఎల్లప్పుడూ మీ శరీరాన్ని హైడ్రాటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఆయుర్వేద ప్రకారం, ఔషధం యొక్క పురాతన వ్యవస్థ, సరైన మార్గంలో నీరు త్రాగటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి;అవేంటో ఇక్కడ చూడండి.

కూర్చుని నీరు త్రాగండి

కూర్చుని నీరు త్రాగండి

ఎల్లప్పుడూ కూర్చొని నీటిని త్రాగటం మంచిది, ఎందుకంటే మీ మూత్రపిండాలు ఫిల్ట్రేషన్ ప్రక్రియను కూర్చొని త్రాగినప్పుడు మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తాయి.

కొంచం కొంచం గా నీటిని త్రాగడం

కొంచం కొంచం గా నీటిని త్రాగడం

తక్కువ తక్కువగా నీటిని త్రాగటం మరియు నీటిని తొందరగా త్రాగడానికి బదులుగా, నీటిని త్రాగుతున్నప్పుడు శ్వాసని ని తీసుకోవడం మంచిది. ఈ ప్రవర్తన మీ ప్రేగులును ఆరోగ్యకరమైన జీర్ణ రసాలను స్రవిస్తాయి.

గోరువెచ్చని నీరు తాగండి

గోరువెచ్చని నీరు తాగండి

వీలైనతవరకు గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి.ఎందుకంటే చల్లటి నీరు శరీరం యొక్క కొన్ని భాగాలకు రక్తం సరఫరాను తగ్గిస్తుంది, ఇంకా ఇది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

డిహైడ్రాషన్ సంకేతాల ను గుర్తించండి

డిహైడ్రాషన్ సంకేతాల ను గుర్తించండి

డిహైడ్రాషన్ సంకేతాలను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు పగిలిన పెదవులు, పొడి చర్మం, అలసట, మొదలైనవి వంటి నిర్జలీకరణ కు సంకేతంగా చెప్పవచ్చు. మీకు మరింత నీరు అవసరమని మీ శరీరం మీకు ఇస్తున్నటువంటి సందేశం.

నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని త్రాగండి

నిద్రలేవగానే గోరువెచ్చని నీటిని త్రాగండి

ప్రతి ఉదయం మీరు నిద్రలేవగానే ఏదీ సేవించకముందే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని త్రాగడం సిఫార్సు చేయబడింది, ఇది మీ సిస్టమ్ నుండి విషాన్ని మరియు వ్యర్థాలను మరింత సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది.

సిల్వర్ , రాగి వెస్సల్స్ లో నీరు నిల్వ చేయండి

సిల్వర్ , రాగి వెస్సల్స్ లో నీరు నిల్వ చేయండి

వెండి లేదా రాగి పాత్రలలో త్రాగునీటిని నిల్వ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాగి మరియు వెండి ఖనిజాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మరియు అనామ్లజనకాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు అదే లక్షణాలతో నిల్వ చేయబడిన నీటి మీద ప్రభావితం చేస్తాయి, చివరకు మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

English summary

Ayurveda Suggests Tips While Drinking Water

Did you know that there are certain ways in which you must drink water? Well, find out here.
Story first published:Monday, September 18, 2017, 15:00 [IST]
Desktop Bottom Promotion