రోజూ ఉదయం ఒక్క సూర్య నమస్కారంతో సర్వ రోగాలు నయం...!

Posted By:
Subscribe to Boldsky

సర్వరోగాలకు సూర్య నమస్కారం ఒక్కటి చాలు. జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది. భారతీయుల జీవనశైలిలో యోగాకు ప్రత్యేక స్థానముంది. అందులో సూర్యనమస్కారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. శరీర ఆరోగ్యానికి, మేధస్సుకు సూర్య నమస్కారం సహకరిస్తుందని భారతీయుల నమ్మకం. అంతేకాదు సూర్యుడిని శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ.. పూజించడం భారతీయులకు పురాతన కాలం నుంచే అలవాటుగా ఉంది.

ప్రాణాయామం, యోగా, ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు. వీటి వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల.. అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటూ.. ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి సూర్య నమస్కారం చక్కటి పరిష్కారం. శరీరాకృతి సక్రమంగా ఉండాలంటే.. సూర్య నమస్కార ఆసనాలు నిత్యం కంపల్సరీ చేయాలి.

Benefits Of Doing Surya Namaskar Every Morning

బరువు తగ్గాలనుకునే వాళ్లకు సూర్య నమస్కారం సరైన వ్యాయామం. రోజూ ఉదయాన్నే లేచి ఏమీ తినకుండా సూర్యనమస్కారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య కిరణాలు డైరెక్ట్ గా మనపై పడే ప్రదేశంలో సూర్య నమస్కారం చేయడం మంచిది. ఖాళీ నేలపై కాకుండా.. ఏదైనా మ్యాట్ వేసుకుని దానిపై సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలలో 12 ఆసనాలున్నాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా, ఫ్రెష్ మైండెడ్ ఫీలింగ్ రోజంతా ఉంటుంది. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల కలిగే.. ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

శక్తి పెరగడానికి

శక్తి పెరగడానికి

సూర్య నమస్కారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. రెగ్యులర్ గా ఈ వ్యాయామం చేస్తే.. శక్తితో పాటు, ఓర్పు పెరుగుతుంది. అలసట, ఆందోళనను కూడా తగ్గిస్తుంది సూర్య నమస్కారం.

ఫ్లెక్సిబుల్ బాడీ

ఫ్లెక్సిబుల్ బాడీ

రోజూ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం చాలా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అవయవాలు, వెన్నెముక చాలా స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.

ఫ్యాట్ తగ్గించడానికి

ఫ్యాట్ తగ్గించడానికి

మీకు సరైన శరీరాకృతి కావాలంటే.. నిత్యం సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఎక్స్ ట్రా ఫ్యాట్ కరిగి.. ఆరోగ్యంగా, స్లిమ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

యోగా సూర్య నమస్కారం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కండరంలో కదలికలుంటాయి . సూర్య నమస్కారం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. థైరాయిడ్ గ్రంథులు సక్రమంగా పనిచేస్తుంటే, బరువులో ఎటువంటి మార్పు ఉండదు.

బెల్లీ ఫ్యాట్

బెల్లీ ఫ్యాట్

బాన పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే.. సూర్య నమస్కారం డైలీ చేయడానికి ప్లాన్ చేసుకోండి. బెల్లీ ఫ్యాట్ కరగడమే కాదు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

చాలా సాధారంగా వచ్చే జీర్ణ సమస్యల్లో క్రోనిక్ జీర్ణ సమస్య ఒకటి. కాబట్టి రెగ్యులర్ గా సూర్య నమస్కారం చేయడం వల్ల జీర్ణక్రియ పవర్ పెరుగుతుంది. ఇది పొట్టలో నిల్వ ఉండే గ్యాస్ ను తేలికగా విడుదల చేయడానికి మరియు జీర్ణక్రియకు అవసరం అయ్యే ఎంజైమ్స్ ను విడుదల చేయడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి అనేది మన శరీరంలో ప్రతి కండరం మీద పడుతుంది. అదే సూర్య నమస్యారం చేయడం వల్ల లోతుగా శ్వాసతీసుకోవడం మరియు వదలడం (ఉశ్చ్వాస మరియు నిశ్చ్వాసలు)వల్ల చాలా వరకూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మరియు ఇది మనస్సును ప్రశాంత పరుస్తుంది.

ఎములను బలోపేతం చేస్తుంది:

ఎములను బలోపేతం చేస్తుంది:

సూర్య నమస్కారంకు ఒక అథ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ సూర్య నమస్కారంను ప్రతి రోజూ ఉదయం మాత్రమే చేస్తుంటారు. ఉదయం చేయడం వల్ల ఉదయం వచ్చే సూర్య రశ్మి వల్ల మన శరీరంలోని విటమిన్ డి షోషింపబడుతుంది. దాంతో ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను డి విటమిన్ మార్పు చేసుకుంటుంది.

రుతుచక్రాన్ని రెగ్యులేట్ చేస్తుంది:

రుతుచక్రాన్ని రెగ్యులేట్ చేస్తుంది:

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి సూర్య నమస్కారం గొప్పగా సహాయపడుతుంది. సూర్య నమస్కారం సహజంగా శ్వాస తీసుకొనేలా చేసి ఫీమేల్ హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది.

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది:

ఫోటో ఫీచర్ లో చూపించిన విధంగా ముందుకు బెండ్ అవ్వడం వల్ల మలబద్దక సమస్యలు మరియు పైల్స్ వంటి సమస్యను నివారించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బౌల్ మూమెంట్ రెగ్యులర్ గా ఉంటుంది.

జుట్టు ఆరోగ్యానికి

జుట్టు ఆరోగ్యానికి

నిత్యం సూర్య నమస్కారం చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి జుట్టు రాలుటను, చుండ్రును, జుట్టు నెరవడం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తుంది.

మెరిసే చర్మం

మెరిసే చర్మం

సూర్య నమస్కారం వల్ల పొందే ప్రయోజనాల్లో ఇది ప్రధానమైనది. నిత్యం సూర్యనమస్కారం చేయడం వల్ల మెరిసే చర్మంతో పాటు.. ముడతలు రాకుండా.. యంగ్ లుక్ సొంతం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న సూర్య నమస్కారం చేయడం మరవరు కదా.. రేపట్నుంచే మీ షెడ్యూల్ లో సూర్య నమస్కారాన్ని చేర్చుకోండి.

నిద్రకు

నిద్రకు

నిత్యం సూర్య నమస్కారం చేయడం కలిగే ప్రయోజనాల్లో ప్రశాంత నిద్ర ఒకటి. రోజూ ఈ వ్యాయామం చేస్తే.. మెదడు ప్రశాతంతంగా ఉండటంతో పాటు.. కంటినిండా నిద్రపడుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి.

English summary

Benefits Of Doing Surya Namaskar Every Morning

Eleven Benefits Of Doing Surya Namaskar Every Morning..Read on
Story first published: Wednesday, March 15, 2017, 8:00 [IST]
Subscribe Newsletter