For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చిన చెక్క-తేనె మిశ్రమంలో దిమ్మ తిరిగే ఆరోగ్య లాభాలు

By Mallikarjuna
|

రోజుకి ఒక్క టీ స్పూన్ చెక్క, తేనె తీసుకోవడం వల్ల మీరు ఊహించలేని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చట. చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు.. అలాగే.. శారరీకంగా అనేక మార్పులు మీలో కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ ని చైనీస్ అనేక సంవత్సరాలుగా ఆయుర్వేదంలోనూ, మెడిసిన్స్ లోనూ ఉపయోగిస్తున్నారు.

చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. ఇక చాలా సహజసిద్ధంగా లభించే తేనెలోనూ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి కదా.

త్వరగా బరువు తగ్గించే దాల్చిన చెక్క-తేనె డైట్ త్వరగా బరువు తగ్గించే దాల్చిన చెక్క-తేనె డైట్

తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అలాగే అనేక పోషకాలు, ఎమినో యాసిడ్ ఉంటుంది. దాల్చిన చెక్కలో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచే సత్తా ఉంటాయి. అనేక వ్యాధులు నివారించడానికి ఈ రెండూ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకునేవాళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒక టీ స్పూన్ చెక్క, తేనె రెండు న్యాచురల్ రెమిడీస్. ఈ రెండిటినీ మిశ్రమంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటి మిశ్రమ యొక్క లాభాలను పొందడం ఈనాటిది కాదు, పురాతన కాలం నుండి బాగా పాపులర్ అయ్యింది. ఈ రెండింటి కాంబినేషన్ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోగలుగుతున్నారు. మరి.. ఈ రెండింటి మిశ్రమంతో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో మీరు కూడా తెలుసుకుని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేయండి. ..

#1 అన్ని రకాల మసాలా దినుసులతో పోల్చితే ఇందులో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి:

#1 అన్ని రకాల మసాలా దినుసులతో పోల్చితే ఇందులో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి:

దాల్చిన చెక్క మీద జరిపిన పరిశోధనల్లో సినామిన్ యాసిడ్,సినామల్ డీహైడ్, మరియు సినామనేట్ లతో పాటు 41 డిఫరెంట్ మెడికల్ కాంపౌండ్స్ ఉన్నట్లు కనుగొన్నారు.

అన్ని రకాల హెర్బ్స్ , మసాలాలతో పోల్చినప్పుడు ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.

ఈ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిడేషన్ ఫ్యాట్స్ అన్ని కూడా ఏజింగ్ కు కారణం అవుతాయి. హార్ట్ కు, బ్రెయిన్, మరియు ఇతర సమస్యలకు కారణమయ్య వీటిని శరీరం నుండి తొలగించడంలో దాల్చిన చెక్క, తేనె కాంబినేషన్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

#2 ఇది శక్తివంతంమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్

#2 ఇది శక్తివంతంమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్

దాల్చిన చెక్కలో విస్త్రుత ఫెవనాయిడ్స్, మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, అరటీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ లో రెండు టీస్పూన్ల తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కండరాల వాపులు, కండరాల నొప్పులు, అలర్జీలు తగ్గుతాయి. మరియు నొప్పులను తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మెనుష్ట్రువల్ క్రాంప్స్ తగ్గిస్తుంది.

#3 హార్ట్ సమస్యలను నివారిస్తుంది

#3 హార్ట్ సమస్యలను నివారిస్తుంది

దాల్చిన చెక్కలో వివిధ రకాల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొత్త అధ్యయనంలో కనుగొన్నారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిర్ధారించారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ అయిన ట్రైగ్లిజరైడ్స్ ను నివారిస్తాయి. దాంతో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులు దానికి సంబంధించిన ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు. వాస్తవానికి హైపర్ టెన్సివ్ పేషంట్స్ లో బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించే దాల్చిన చెక్క-తేనె ఫేస్ మాస్క్ బ్లాక్ హెడ్స్ తొలగించే దాల్చిన చెక్క-తేనె ఫేస్ మాస్క్

#4 డయాబెటిస్ కు వ్యతిరేఖంగా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది

#4 డయాబెటిస్ కు వ్యతిరేఖంగా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది

దాల్చిన చెక్కలో ఉండే కాంపౌండ్స్, అనలైన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది, ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది.

అందుకే దాల్చిన చెక్క వాటర్ డయాబెటిస్ పేషంట్స్ కు చాలా మంచిది, రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ను కండీషన్ ను మెరుగుపరిచి, ఇన్సులిన్ సెన్సిటివిటిని శరీరంలో మెరుగుపరుస్తుంది.

#5 మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది

#5 మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది

చాలా వరకూ మతిమరుపు, పార్కిన్సన్ వంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు ఫ్రీరాడికల్స్ కారణంగానే వస్తాయి. ఇవి క్యాన్సర్ లేదా మతిమరుపు, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు కారణం అవుతాయి. దాల్చిన చెక్క బ్రెయిన్ కు రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ నివారించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ ను శరీరంలో సర్క్యులేట్ కాకుండాఅడ్డుకుంటాయి.

#6 క్యాన్సర్ నివారిణి

#6 క్యాన్సర్ నివారిణి

దాల్చిన చెక్కలో పవర్ ఫుల్ సినామల్ డీహైడ్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల, ఇది శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను తొలగిస్తుంది. శరీరంలో హెల్తీ సెల్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు

#7 దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ మైక్రోబయల్ ఏజెంట్ ఉంది

#7 దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ మైక్రోబయల్ ఏజెంట్ ఉంది

వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ ను శరీరంలో తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ఎఫెక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది,. అందుకే చాలా రకాల నూనెల్లో దాల్చిన చెక్క ఎక్స్ ట్రాక్ట్ ను మిక్స్ చేస్తున్నారు. అలాగే ఫేస్ మాస్క్, స్ర్కబ్స్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ రెమెడీ.

సింపుల్ రెమిడీ: చెక్క, తేనె ప్యాక్ తో బ్లాక్ హెడ్స్ కి బైబైసింపుల్ రెమిడీ: చెక్క, తేనె ప్యాక్ తో బ్లాక్ హెడ్స్ కి బైబై

#8 బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది

#8 బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను ,నోటి పుండ్లను నివారించడంలో గొప్ప ఔషధం, ముఖ్యంగా నోటి దుర్వాసనను నివారించడంలో, నోటిని చల్లగా ఉంచడం సహాయపడుతుంది. అందుకే దీన్నిమౌత్ రిఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు .

#9 క్యాన్డిడల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది

#9 క్యాన్డిడల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది

క్యాన్డిడ అనేది అనేక శిలీంధ్ర జాతుల సమూహం. ఇది శరీరంలో ప్రవేశిస్తే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. మీ శరీరంలో పలు చోట్ల అలర్జీలు ఏర్పడతాయి. హెచ్ ఐవి లేదా స్టెరాయిడ్స్ తీసుకొన్నప్పుడుఅలర్జీలకు కారణం అవుతుంది. ఈ అలర్జీలను నివారణకు దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది. అందువల్ల వీలైనంత వరకు దాల్చిన చెక్కను అధికంగా ఉపయోగించండి.

#10 చర్మ సంరక్షణకు దాల్చిన చెక్క

#10 చర్మ సంరక్షణకు దాల్చిన చెక్క

దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం మాత్రమే కాదు, ఇది చర్మంను స్మూత్ గా, తేమగా, అందంగా మార్చుతుంది. చర్మంక్రింది కణాకలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

మరి ఇన్ని అద్భుత ప్రయోజనాలున్న దాల్చిన చెక్కను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలో వద్దా? మీరే నిర్ణయించుకోండి.

English summary

Benefits of Cinnamon and Honey That Will Blow Your Mind!

Benefits of Cinnamon and Honey That Will Blow Your Mind!, But if you think cinnamon's fame is a byproduct of the splash these incidents made on social media, then you would be wrong. Because in reality, cinnamon has been around for thousands of years in both Ancient Indian and Chinese medicine. Read more at
Desktop Bottom Promotion