For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు గురించి కొన్ని వాస్తవాలు, పెరుగు తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోండి..

By Mallikarjuna
|

చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు.

రోజూ పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు.

<strong>వివిధ రకాల చర్మ సమస్యలకు పెరుగుతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడం చాలా సులభం!</strong>వివిధ రకాల చర్మ సమస్యలకు పెరుగుతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవడం చాలా సులభం!

విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి.

పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.

నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. రోజూ 300 మిల్లీలీటర్ల పెరుగు తాగితే ఆస్టియో పోరోసిస్, క్యాన్సర్లు, ఉదర సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. రోజూ 300 మిల్లీలీటర్ల పెరుగు తాగితే ఆస్టియో పోరోసిస్, క్యాన్సర్లు, ఉదర సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.

<strong>పెరుగుతో జుట్టుకు మెరుపులు...వలపులు...!!</strong>పెరుగుతో జుట్టుకు మెరుపులు...వలపులు...!!

పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు.పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. వీటితో పాటు పెరుగు గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం..

వాస్తవం #1: గేద పాలు కంటే ఆవు పాల మంచిదా?

వాస్తవం #1: గేద పాలు కంటే ఆవు పాల మంచిదా?

ఆవు పాలతో పోల్చినప్పుడు గేద పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అందుకే గేద పాలతో తయారుచేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాలేదని చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా వయస్సైనవారు. అందువల్ల, ఆయుర్వేదం గేద పాలతో తయారుచేసిన పెరుగు కంటే ఆవు పాలతో తయారుచేసిన పెరుగును తినమని సూచిస్తోంది.

వాస్తవం #2: తాజా పెరుగు మాత్రమే తినాలి?

వాస్తవం #2: తాజా పెరుగు మాత్రమే తినాలి?

పెరుగును కొన్ని రోజుల నిల్వ చేసి తర్వాత తినడం అంత మంచిది కాదు, అలాంటి పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి, పెరుగు తినాలనుకుంటే, పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటలలోపు తినేసేయాలి.

వాస్తవం #3: ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ లోపం ఉన్న వారు పెరుగు తినవచ్చు.

వాస్తవం #3: ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ లోపం ఉన్న వారు పెరుగు తినవచ్చు.

ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ తో బాదపడే వారు డయోరియా, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి, మంచి క్వాలిటీ ఉన్న పాలను మరియు పెరుగును తీసుకోవడం మంచిది, ఇది పొట్టలో యాసిడ్స్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తుంది. జీర్ణశక్తికి అవసరం అయ్యే ప్రోటీన్స్ ను అందిస్తుంది. దాంతో జీర్ణం అవుతుంది.

వాస్తవం #4: జీర్ణ శక్తిని పెంచుతుంది.

వాస్తవం #4: జీర్ణ శక్తిని పెంచుతుంది.

ముందు పాయిట్ లో సూచించిన విధంగా, పాలలోని బ్యాక్టీరియాతో పెరుగు తయారవుతుంది. అదే ల్యాక్టోబాసిల్లస్, అయితే ఈ బ్యాక్టీరియా హానికరమైనది కాదు. దీన్నే ప్రొబయోటిక్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియా అని అర్థం. ఇది శరీరంలో ముఖ్యంగా పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ను తొలగిస్తుంది. పెరుగు నుండి అందే విటమిన్ కె , మనం తినే ఆహారం ప్రేగుల్లో సులభం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

వాస్తవం #5: రోజూ పెరుగు తినడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

వాస్తవం #5: రోజూ పెరుగు తినడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

పెరుగు మన శరీరానికి కావల్సిన విటమిన్ కె అందివ్వడంతో పాటు, అందులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో బి మరియు టి వంటి లింపోసైట్స్ ను (తెల్ల రక్తకణాలను) పెంచుతుంది. వాస్తవానికి రెండు కప్పుల పెరుగును నాలుగు నెలల పాటు తింటే వ్యాధినిరోధకత 5 రెట్లు పెరుగుతుంది.

వాస్తవం #6: సెక్సువల్ హెల్త్ మెరుగుపరుస్తుంది.

వాస్తవం #6: సెక్సువల్ హెల్త్ మెరుగుపరుస్తుంది.

సెక్స్ సామర్థ్యంను పెంచడంలో పెరుగు ఒక న్యాచురల్ పదార్థం, వాస్తవానికి వంద్యత్వాన్ని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్యం యొక్క నాణ్యత పెంచుతుంది. వీర్యం ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతుంది.

వాస్తవం #7: చర్మ రంగును మెరుగుపరుస్తుంది.

వాస్తవం #7: చర్మ రంగును మెరుగుపరుస్తుంది.

ఇతర సౌందర్య ఉత్పత్తులు మర్చిపోండి. రోజూ పెరుగు తినడం వల్ల చౌకగా, సురక్షితంగా బ్యూటీని మెరుగుపరుచుకోవచ్చు.

ఎందుకంటే పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, మరియు ఇతర మైక్రో మినిరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను మచ్చలను తొలగిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. అంతే కాది చర్మంకు తేమను అందివ్వడంలో గ్రేట్ రెమెడీ.

వాస్తవం #8: సన్ బర్న్ నివారిస్తుంది.

వాస్తవం #8: సన్ బర్న్ నివారిస్తుంది.

సన్ బర్న్ నివారించడంలో కలబందకు మించిన రెమెడీ లేదు. అలాంటిది అయితే అది వెంటనే, ఎప్పుడూ అందుబాటులో ఉండదు. అయితే అదే సామర్థ్యం కలిగిన పెరుగు, చౌకగా మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీకి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్, నొప్పి తగ్గించి, చర్మానికి కూల్ నెస్ ను అందిస్తుంది. చర్మంలో ఎర్రగా కమిలిన దాన్ని తగ్గిస్తుంది.

వాస్తవానికి, త్వరగా నయం అవ్వాలంటే పెరుగును సన్ బర్ అయిన ప్రదేశంలో రోజుకు 4-5సార్లు అప్లై చేయాలి.

వాస్తవం #9: రోజూ పెరుగు తింటుంటే హార్ట్ సమస్యలుండవు

వాస్తవం #9: రోజూ పెరుగు తింటుంటే హార్ట్ సమస్యలుండవు

పెరుగులో ఎలాంటి ఫ్యాట్ లేకపోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, దాంతో ధమనుల్లో పాచ్చి గడ్డకట్టకుండా సహాయపడుతుంది.

వాస్తవానికి, హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ రెమెడీ. హైపర్ టెన్షన్ తో బాధపడే వారు పెరుగు తినడం మంచిది.

వాస్తవం #10: మైక్రోన్యూట్రీషియన్స్ అధికం

వాస్తవం #10: మైక్రోన్యూట్రీషియన్స్ అధికం

పెరుగులో విటమిన్స్, మినిరల్స్, విటమిన్ బి12 , క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మైక్రోన్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందువల్ల రోజు ఒక కప్పు పెరుగు తినడం వల్ల వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.

వాస్తవం #11: బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

వాస్తవం #11: బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్ లో పెరుగుచేర్చుకోవడం కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది . దాంతో ఫ్యాట్ విచ్ఛిన్నం చేసి, బ్లీ ఫ్యాట్ కరుగుతుందిజ అలాగే ఆకలి తగ్గించి, జీవక్రియలను చురుగ్గా మార్చుతుంది

వాస్తవం #12: బోన్స్ అండ్ టీత్ కు బలాన్నిస్తుంది

వాస్తవం #12: బోన్స్ అండ్ టీత్ కు బలాన్నిస్తుంది

పెరుగులో క్యాల్షియం మరియు ఫాస్పరస్ అంశాలు అధికంగా ఉంటాయి . కాబట్టి, ఈ రెండూ కూడా ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.అటువంటి సమస్యలను మీరు నివారించుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీరెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం ఉత్తమం.

వాస్తవం #13:స్ట్రెస్ బూస్టర్ !

వాస్తవం #13:స్ట్రెస్ బూస్టర్ !

ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది . పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది.

వాస్తవం #14: ఆకలి తగ్గిస్తుంది.

వాస్తవం #14: ఆకలి తగ్గిస్తుంది.

రెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం వల్ల ఇతర ఆహారాల మీద కోరికలు కలగకుండా, ఆకలి కానివ్వకుండా...అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది . పెరుగు తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది .

వాస్తవం #15: డయోరియా నివారిస్తుంది

వాస్తవం #15: డయోరియా నివారిస్తుంది

డయోరియాతో బాధపడుతున్నప్పుడు పెరుగు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది, శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది.

వాస్తవం #16: బ్లీడింగ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది

వాస్తవం #16: బ్లీడింగ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది

పెరుగులో ఉండే విటమిన్ కె కంటెంట్ రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. అలాగే లివర్ సిర్రోసిస్ వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ను నివారిస్తుంది.

English summary

16 Impressive Facts and Benefits of Eating Curd Every Day

what we are going to explore in more depth in today's episode of Fact vs. Fiction - the impressive benefits of eating curd every day. And if you missed our take on ginger and its health benefits in yesterday's episode, then don't worry. You can read it right here.
Story first published: Monday, November 6, 2017, 17:30 [IST]