మీరు డయాబెటిసా, అయితే ఈ టాప్ 5 ఫ్రూట్స్ తినాల్సిందే...

By: Mallikarjuna
Subscribe to Boldsky

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి రుచి లేకపోవడం ఒకరకంగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఆహారం విషయంలో షుగర్ పేషంట్స్ ఎప్పుడూ చాలా జాగ్రత్త వహించాల్సిందే. చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటూనే.. మీరు తీసుకునే ఆహారాలు అమోఘమైనవిగా ఉండేలా చేసుకోవాలి.

ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్స్ లో సాధారణంగా వినిపించే ప్రశ్న.. ఫ్రూట్స్ విషయంలో ఉంటుంది. ఏ పండు తినాలి, ఏ పండు తినకూడదు, ఎంత పరిమాణంలో తినాలి, ఎప్పుడు తినాలి అనే సందేహాలు వేధిస్తుంటాయి.

మీరు డయాబెటిసా, అయితే ఈ టాప్ 5 ఫ్రూట్స్ తినాల్సిందే...

అయితే మామిడి పండ్లు, కస్టర్డ్ యాపిల్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఖచ్చితంగా తీసుకోకూడదు. మీ షుగర్ లెవెల్స్ 200 ఎమ్ జీ కంటే ఎక్కువ ఉంది అంటే.. ఈ రెండు పండ్లను తీసుకోకపోవడమే మంచిది. అలాగే.. ఏ ఫ్రూట్ తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

1. బెర్రీస్ :

1. బెర్రీస్ :

డయాబెటిస్ పేషంట్స్ కు బెర్రీస్ సూపర్ గా పనిచేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్, లోగ్లిజమిక్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి, మధుమేహగ్రస్తులు సురక్షితంగా తినవచ్చు

2. చెర్రీస్:

2. చెర్రీస్:

చెర్రీ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపు, కీళ్ళనొప్పులు, కీళ్ళ వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజుకు రెండుసార్లు చెర్రీపండ్ల రసాన్ని తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు 12 చెర్రీ పండ్లను తీసుకోవచ్చు

3. పీచెస్:

3. పీచెస్:

ఇవి చూడటానికి వెల్ వెట్ కలర్ లో ఉంటాయి. అందులో వీటిలో విటమిన్ ఎ మరయు విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, తక్కువ. ఫైబర్, పొటాషియం అధికం.

4. ఆప్రికాట్ :

4. ఆప్రికాట్ :

ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ.ఈ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది. తీపిపదార్ధాలు తినాలనే కోఇకను తగ్గిస్తుంది. దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి. అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి, రోమాలకు, చర్మానికి, మేలుచేస్తుంది. ఒకటి, రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్‌ 'ఎ' సగం లభ్యమౌతుంది.

5. ఆపిల్స్

5. ఆపిల్స్

మీడియం సైజ్ లో ఉండే ఒక యాపిల్ ని రోజుకి ఒకటి డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా.. రెడ్ యాపిల్ కంటే.. గ్రీన్ యాపిల్ డయాబెటిక్స్ కి మంచిది. ఎందుకంటే.. గ్రీన్ యాపిల్స్ లో 20 గ్రాములు కార్బోహైడ్రేట్స్, గ్లిజమిక్ ఇండెక్స్ 39 ఉంటుంది.

English summary

If You're A Diabetic, Then You Need To Consume These Top 5 Fruits

The popular notion that fruits are not safe when you have diabetes is wrong. Many types are fruits are loaded with vitamins, minerals as well as fibre, which can help regulate blood sugar levels as well as decrease your risk of developing type 2 diabetes.
Story first published: Friday, September 29, 2017, 17:00 [IST]
Subscribe Newsletter