మామిడి పండ్లు రంగు చూసి ఎంపిక చేసుకుంటే రోగాలు తప్పవు..?

Posted By:
Subscribe to Boldsky

సూర్యుడిని చూడనివారు మామిడి రుచి చూడనివారు ఉంటారా? ఆ పండు వాసనే మధురం, తింటే మరింత తీపి. ఒకవైపు మల్లెల గుబాళింపు, మరోవైపు మామిడి నిగారింపు వేసవి వేడిని కూడా మరిపిస్తాయి.

వేసవి సీజన్ అంటేనే భరించలేని వేడి. ఇంతటి ఉక్కపోతలోనూ అందరి ద్రుష్టి మామిడి పండ్లపైనే...ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా..! ఎండాకాలం వచ్చిందంటే చాలు..మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్ మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో..ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి.

పసుపు రంగులో మెరిసిపోయే వాటనిి చూడగానే..ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా..!

Best Tips On Selecting A Ripe Mango

అయితే ఈ మద్యకాలంలో మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. అందుకు కారణం వాటిని తర్వగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్ (కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది.

అందుకే సహజం సిద్దంగా పండిని వాటిని మాత్రమే తినాలి.మరి మార్కెట్లో ఉండే అమ్మకానికి సిద్దంగా ఉంచిన వాటిలో ఏవి సహజసిద్దంగా పండినవో ..దేన్ని రసాయనాలు ఉపయోగించి పండించారో తెలుసుకోవాలంటే ఈ క్రింది విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలి.

Best Tips On Selecting A Ripe Mango

సాధారణంగా పండ్లన్నీ వాటిలో జరిగే రసాయనిక చర్యల కారణంగానే మగ్గుతాయి. ఇలా అవి పండటానికి దోహదం చేసేది ఇథిలీన్. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత వాటిలో సహజంగానే ఉండే ఈ రసాయనం వల్ల అవి వాటంతట అవే పండుతాయి. అయితే రైతులు, వ్యాపారులు కాయలు పూర్తిగా పక్వానికి రాక ముందే వాటిని కోసి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి క్యాల్సియం కార్బైడ్ ను ఉపయోగిస్తున్నారు.

ఇవి ఆరోగ్యాన్నికి ప్రమాదకరమైనవి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటిలో ఇలా క్యాల్షియం కార్బైడ్ ఉపయోగించిన వాటితో పాటు సహజసిద్దంగా పండించినవీ దొరకుతాన్నాయి. మరి ఈ రెండింటి మద్య తేడాను గుర్తించి ఆరోగ్యానికి హాని కలిగించని మామిడిపండ్లను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం..

రంగుని బట్టి:

రంగుని బట్టి:

కృమంగా పండిన వాటనిి గుర్తించడానికి పరిశీలించాల్సిన అంశాల్లో మొదటిది మామిడి పండు రంగు రసాయనాలు ఉపయోగించి మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పూర్తి పసుపురంగులోనే ఉన్నా..వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లు గా కినబడుతుంటాయి. అలాగే మరి కొన్నింటిలో మాిమడి పండు సహజసిద్దంగా పండినప్పుడు వచ్చే రంగు కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సహజంగా పక్వానికి వచ్చిన పండైతే దాని రంగు అంతే ఒకే విధంగా ఉంటుంది.

వాసన ఆధారంగా :

వాసన ఆధారంగా :

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. వాటిలో సహజసిద్దమైనవి ఎంపిక చేసుకోవాలంటే ఉపయోగించుకోవాల్సిన మరో చిట్కా మామిడి పండ్లను వాసన చూడటం. సాధారణంగా సహజమైన రీతిలో పండిన మామిడి నుండి వచ్చే వాసన మధురంగా అనిపిస్తుంది.

కానీ కార్బైడ్ ఉపయోగించిన న పండ్లు నుంచి ఘాటైన వాస్తుంటుంది

కానీ కార్బైడ్ ఉపయోగించిన న పండ్లు నుంచి ఘాటైన వాస్తుంటుంది

కానీ కార్బైడ్ ఉపయోగించిన న పండ్లు నుంచి ఘాటైన వాస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వాటి నుంచి ఎలాంటి వాసన రాకపోవడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి, ఈ సారి మామిడి పండ్లను కొనడానికి మార్కెట్ కు వెళ్లినప్పుడు దీన్ని కూడా పరిశీలించాలి.

రుచి కూడా చెబుతుంది:

రుచి కూడా చెబుతుంది:

సహజంగా పండిందా లేదా అన్న విషయాన్ని దాని రుచి ఆధారంగా కనుక్కోవచ్చు. పండ్లను కొనే ముందు అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి శాంపుల్ ముక్కను తినడం సహజమే. దీని ద్వార కూడా అవి సహజమైనవా? కాదా అన్న విషయాన్ని గ్రహించవచ్చు. సాధారణంగా కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోట్లోలో గొంతులో మంట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి తిన్న కొంత సేపటి తర్వాత కొందరిలో కడుపు నొప్పి, డయేరియా, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

గుజ్జును పరిశీలిచాల్సిందే..

గుజ్జును పరిశీలిచాల్సిందే..

మామిడి పండు పైకి బాగానే కనిపించినప్పటికి అది సహజసిద్దమైనదేనని నిర్ధారించుకోవాలంటే దాని గుజ్జును పరిశీలించాల్సిందే. సహజసిద్దమైన రీతిలో పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు కలిసిన పసుపు రంగులో ఉంటుంది. పైగా గుజ్జంతా ఒకే విధంగా కనిపిస్తుంది. అదే కృత్రిమంగా మగ్గిన పండైతే గుజ్జు లేత లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇది పండు పూర్తిగా తయారవ్వడానికి నిదర్శనం

రసం కూడా ఎక్కువే..?

రసం కూడా ఎక్కువే..?

వేసవిలో మాత్రమే దొరికే మామిడిపండ్లను వివిధ రకాలుగా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. వాటిల జ్యూస్ కూడా ఒకటి. మామిడి పండ్లు జ్యూస్ తీస్తున్నప్పుడు రసం చాలా తక్కువ మోతాదులో వచ్చిందా? అయితే అది కృత్రిమంగా మగ్గబెట్టిన పండే. పూర్తిగా పక్వానికి వచ్చి సహజసిద్దమైన రీతిలో మగ్గిన మామిడి పండులోరసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా తియ్యగా కూడా ఉంటుంది. ఎందుకంటే మామిడి పండును సహజసిద్దంగా పండేలా చేసే ఎథిలీన్ వల్ల పండులో రసం ఎక్కువగా ఉంటుంది.

రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లతో

రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లతో

రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి హాని ఎక్కువ కాయలను మాగబెట్టేందుకు వాడే కాల్సియం కార్బైడ్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్‌ కాంపౌండ్‌లు ఉంటాయి. ఇవి వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఇది కాన్సర్‌ను కలుగజేసే

ఇది కాన్సర్‌ను కలుగజేసే

ఇది కాన్సర్‌ను కలుగజేసే ఎసిటాల్డిహైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు కాన్సరుకు గురయ్యే ప్రమాదం ఉంది

నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది

నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది

కాల్సియం కార్బైడ్‌ తేమతో కలిసినపుడు విడుదలయ్యే ఎసిటిలిన్‌ వాయువు వినియోగదారుల మెదడుకు ప్రాణవాయువు సరఫరాను తగ్గించి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Best Tips On Selecting A Ripe Mango

    Traders usually know how to select the ripe and juicy mangoes, so if you think that he is trustworthy enough to purchase mangoes from, it is your lucky day. But, to do it on your own at the store, there are certain ways to find out how to select a ripe mango.
    Story first published: Thursday, May 11, 2017, 17:16 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more