మీకు నిరంతరం పొట్ట నొప్పిగా అనిపిస్తుందా? ఈ 11 హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ విస్మరించకండి!

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

పొట్ట నొప్పి ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి అనారోగ్యకరమైన ఆహరం తినడం. ఇది కాకుండా, ఒత్తిడి, ఎక్కువ మందులు వేసుకోవడం అనేవి కూడా పొట్ట నొప్పికి దారితీస్తాయి.

పై కారణాల వల్ల పొట్ట నొప్పి వస్తే, కొన్ని రోజులు బానే ఉంటుంది, లక్షణాలు నిదానంగా బైటపడతాయి.

కానీ, ఈ నొప్పి సమస్య ఎక్కువ రోజులు ఉంటె, అది ఆందోళనకు కారణమయి, ఇతర ప్రమాదకర ఆరోగ్య పరిస్ధితులకు సూచన కావొచ్చు.

కడుపు నొప్పి వల్ల ప్రధానంగా అంతర్గతంగా, బాహ్యంగా కడుపులో నొప్పి వస్తుంది. ప్రేగులలో అదనపు జీర్ణ ఆమ్లాలు స్రవించడం వల్ల ఇది సంభవిస్తుంది, పొట్టలో గ్యాస్ అదనంగా పెరుకోవడం వల్ల కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.

పొట్ట నొప్పి ఉన్నపుడు మీరు ఎక్కువ సమయం అసౌకర్యంగా, ఆహరం తీసుకున్నపుడు సమస్య అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా, మీరు వేసుకునే దుస్తులు కూడా సమస్యగా అనిపిస్తాయి.

కడుపు నిండుగా ఉంది అనే భావనతో పాటు, చికాకు కలిగించే శబ్దాలు కూడా వస్తాయి. తీవ్రంగా గమనిస్తే, కడుపు నొప్పి వల్ల థైరాయిడ్ పనిచేయకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, గుండెల్లో మంట, ప్రేగులో సిండ్రోమ్ వంటి కొన్ని వైద్య పరిస్ధితులకు కూడా కారణం కావొచ్చు.

కాబట్టి, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటె, హెచ్చరిక సూచనల పట్ల జాగ్రత్త వహించాలి. మీరు పరిశీలించాల్సిన కొన్ని హెచ్చరిక సూచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. చూడండి...

1.జీర్ణ సమస్యలు:

1.జీర్ణ సమస్యలు:

కబుపు నొప్పి అనేది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు అనే లక్షణాలకు మొదటి సంకేతం. జీర్ణ రుగ్మత, కడుపులో పుండు, ఉదరకుహర వ్యాధి, ప్రేగు సిండ్రోమ్ లో ప్రకోపం మొదలైనవి కొన్ని ప్రధాన జీర్ణ సమస్యలు.

2.ద్రవాల నిలుపుదల (ఎడిమా):

2.ద్రవాల నిలుపుదల (ఎడిమా):

మన శరీరంలోని ఉదరం, కటి ప్రాంతం సాధారణంగా ద్రవాలను కలిగి ఉంటుంది. ఉదరంలో, కటి భాగంలో ద్రవాలు అధికంగా చేరినపుడు, పొట్ట నొప్పికి దారితీస్తుంది. ఈ పరిస్దితినే ఒడేమ అని అంటారు. మరోవైపు, కాలేయ వ్యాధితో బాధపడే వ్యక్తీ కూడా కటి భాగంలో ద్రవాలు నిలిచిపోయి పొట్ట ఉబ్బరానికి దారితీసే ప్రమాదం ఉంది.

3.పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్:

3.పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్:

జ్వరంతో పాటు, కటి భాగంలో నొప్పి, చాలాకాలంగా పొట్ట నొప్పి వంటి ప్రధాన ;కారణాలు పెల్విక్ ఇంఫ్లమేటరీ డిసీజ్ కి కారణం కావొచ్చు. ఈ జబ్బు లైంగిక సంపర్కం వల్ల లేదా పునరుత్పత్తి అవయవాలు ఇన్ఫెక్షన్ కి గురయినపుడు సంభవిస్తుంది.

4.క్రోన్స్ డిసీజ్:

4.క్రోన్స్ డిసీజ్:

విపరీతమైన పొట్ట నొప్పి, వికారం, వాంతులు, ప్రేగు కదలికలతో సమస్య వంటి కొన్ని ప్రధాన సంకేతాలు మీ కొలోన్, చిన్న ప్రేగులపై ప్రభావాన్ని చూపోతాయి.

5.అండాశయ క్యాన్సర్:

5.అండాశయ క్యాన్సర్:

నిరంతరం కటి భాగంలో నొప్పి తోపాటు కడుపు నొప్పి వంటివి అండాశయా క్యాన్సర్ కి కొన్ని హెచ్చరిక సూచనలు. అయితే, అండాశయ క్యాన్సర్ జన్యుపరంగా రావొచ్చు లేదా గర్భం దాల్చక పోయినా రావొచ్చు. స్త్రీలు, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటినవారిలో, అండాశయా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి.

6.గర్భాశయ క్యాన్సర్:

6.గర్భాశయ క్యాన్సర్:

కటి నొప్పి తోపాటు కడుపు నొప్పి ఉండడం, మూత్రానికి వెళ్ళేటపుడు, సంభోగం తో నొప్పి, వేజైనల్ డిశ్చార్జ్ వంటివి గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు. అంతేకాకుండా, మరోవైపు, జన్యుపరంగా, రేడియేషన్ థెరపీ, ఈస్త్రోజేన్ మందుల వాడకం వల్ల కూడా ఈ రకమైన క్యాన్సర్ కు దారితీయవచ్చు.

7.ఉదర క్యాన్సర్:

7.ఉదర క్యాన్సర్:

వికారం, వాంతులు, అజీర్ణం, బరువు తగ్గడం తోపాటు పొట్ట నొప్పి కూడా ఉంటె అవి ఉదర క్యాన్సర్ కి చెందిన కొన్ని ప్రధాన లక్షణాలు.

8.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:8.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:

8.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:8.ప్యాంక్రియాటిక్ క్యాన్సర్:

విపరీతమైన కడుపు నొప్పి, వెన్ను, పొత్తికడుపు లో నొప్పి, అరగకపోవడం, జాండీస్, బరువు తగ్గడం వంటివి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి ప్రధాన లక్షణాలు. వీటిపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం, చాలామంది ఇది చాలా సాధారణమైన నొప్పి గా భావించి తప్పు చేస్తారు.

9.కొలోన్ క్యాన్సర్:

9.కొలోన్ క్యాన్సర్:

కొలోన్ క్యాన్సర్ కడుపు నొప్పికి ప్రధాన కారణం కావొచ్చు, ఎందుకంటే ఇది పెద్దప్రేగును నిరోధించడానికి దారితీస్తుంది. కొలోన్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉండి, దానితోపాటు కడుపులో నొప్పి ఉంటే, రోగికి రక్తస్రావం, అజీర్ణం వంటివి కలుగుతాయి.

10.కాలేయ వ్యాధి:

10.కాలేయ వ్యాధి:

చర్మం, కళ్ళు పసుపు పచ్చగా మారడంతో పాటు కడుపులో నొప్పి ఉంటె, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది కాలేయ వ్యాధి, కాలేయ క్యాన్సర్ కి సంకేతం. సాధారణంగా మన కాలేయం ఎక్కువ తాగడ౦, ఓవర్ డోస్ మందులు, హెపటైటిస్ వల్ల ప్రభావితమవుతుంది. ఎవరైనా వెంటనే శ్రద్ధ తీసుకోవడం అవసరం, అలా తీసుకోకపోతే, అది కాలేయ క్యాన్సర్ కి దారితీస్తుంది.

11.బోవేల్ కి అడ్డంకి:

11.బోవేల్ కి అడ్డంకి:

సాధారణ శరీర పనితీరుకి క్లియర్ బోవేల్ అవసరం. మీరు మలబద్ధకం, వికారం, వంతుల తోపాటు కడుపు నొప్పితో కూడా బాధపడుతుంటే, అది బోవేల్ నిరోధానికి సంకేతం కావొచ్చు, దీనివల్ల ట్యూమర్ లేదా స్కార్ టిష్యూ ఏర్పడే ప్రమాదం ఉంది.

English summary

Bloated Stomach And Warning Signs That You Should Not Ignore

Why does a baby favour one breast over the other? Can feeding the baby with only one breast cause problems to the baby or the mother? Most mothers choose to feed their babies by alternating between the breasts. This way, the mothers make sure that one breast is emptied completely before feeding the other breast. But what can a mother
Subscribe Newsletter