రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ వ్యాధిని గుర్తించవచ్చు.. అది ఎలా అంటే

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

క్యాన్సర్ అనేది ఈ ప్రపంచం లోని అతి భయంకరమైన వ్యాధులలో ఒకటి. ఆ వ్యాధి ఉందని నిర్ధారించడమే చాలా కష్టమైన విషయం. అలాంటి క్లిష్టమైన సమస్యకు సులభమైన పరిష్కారాన్ని కనుగొన్నారు స్టాన్ ఫోర్డ్ శాస్త్రవేత్తలు. వీళ్ళు చాలా తక్కువ ఖర్చుతో రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే పరిజ్ఞాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా కాన్సర్ శరీరంలో ఏ స్థాయి లో పెరుగుతుంది, ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది అనే విషయం సులువుగా తెలుసుకోవచ్చు అని చెబుతున్నారు .

ఈ పరీక్షను " సింగల్ కలర్ డిజిటల్ పీసీఆర్ " అని పిలుస్తారు. వంశపార పర్యంగా వచ్చే పరివర్తనలో భాగంగా, జన్యుపరంగా మన శరీరంలోని రక్తం లోకి క్యాన్సర్ కణాలు విడుదలైన కొద్దీ నిమిషాల్లోనే క్యాన్సర్ వ్యాధిని ఈ పరీక్షా ద్వారా గుర్తించొచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవల్సిన భయంకరమైన నిజాలు..!

how to detect cancer

ఈ అత్యంత సున్నితమైన పరీక్షకు చాలా తక్కువ రక్తం సరిపోతుంది. మరియు మూడు పరివర్తనలను భరించే అణువులను ఒకటే ప్రతిస్పందన ద్వారా గుర్తించ వచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్ష ఎంతో శక్తివంతమైనదన, ఎందుకంటే శరీరం లో జరిగే ప్రతి యొక్క ఏకైక పరివర్తనను గుర్తించి అది ఏ రకమైన క్యాన్సర్ అనేది తెలియజేస్తుందని చెబుతున్నారు.

వ్యాధిగ్రస్థుల్లోని కణుతులను పర్యావేక్షించడానికి, ఎన్నో రకాలైన క్యాన్సర్లను గుర్తించడానికి చాలా తక్కువ రక్త పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

దాదాపు కాన్సర్ వ్యాధిగ్రస్థులందరిని పర్యవేక్షించడానికి సంపూర్ణ శరీర ప్రతిబింబం అనే పద్దతి అందుబాటులో ఉంది. కానీ ఈ పద్దతి చాల చాలా ఖరీదైనది, సంక్లిష్టమైనది మరియు ఎక్కువ సమయాన్ని వృధా చేస్తుంది. ఇందుకు పూర్తి భిన్నంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అణువులును ఉపయోగించి పరీక్షలు చేసే విధానం చాలా సులువైన పద్దతి అని, ఇది ఆయా వ్యాధిగ్రస్థులు వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, పర్యవేక్షించడానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా వ్యాధిగ్రస్థుల్లో వ్యాధి లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, శరీరం లో అది ఎంతలా వ్యాప్తి చెందుతోంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సులువుగా తెలుసుకోవచ్చు అని వెల్లడించారు పరిశోధకులు.

భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతున్న జన్యు పరంపర విధానం కంటే , ఈ రక్త పరీక్ష విధానం చాలా తక్కువ ఖర్చు తో కూడుకున్నదని చెబుతున్నారు. అందువల్ల వ్యాధి గ్రస్తులు ఎక్కువ మంది, ఎక్కువ సార్లు పరీక్షలు చేయించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ పరీక్ష ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వస్తుంది. అది ఏమిటంటే విశ్వ వ్యాప్తం గా ఉన్న మరింత మంది వ్యాధిగ్రస్తులను ఒకటే సారి పర్యవేక్షించడానికి వీలవుతుంది.

how to detect cancer

ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యంచేయకూడాని క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాలు

ఈ పరీక్ష ద్వారా పరిశోధకులు మొదట ఓ ఆరు మంది రోగుల దగ్గర నుండి నమూనాలను విశ్లేషించడానికి సేకరించారు. వీరి లో ఐదుగురికి ఇంతక మునుపే పెద్ద ప్రేగు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది మరియు ఇంకొక వ్యక్తి పిత్తవాహిక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. వంశపారంపర్యంగా అనుకూలీకరించిన అనుకరణ ద్వారా గుర్తించిన విషయం ఏమిటంటే, పరిశోధకులు ఆరుగురిలో ముగ్గురికి కణితి ద్వారా జన్యుపరంగా ఈ వ్యాధి సంక్రమించినట్లు గుర్తించారు.

ఒక రోగిని పరీక్షించినప్పుడు అతనిలో మూడు విభిన్న రకాలైన పరివర్తనను గుర్తించారు. ముగ్గురు రోగుల నుండి సేకరించిన నమూనాలలో కృత్రిమ క్యాన్సర్ జన్యువు ఏవి కనపడలేదు. ఈ నమూనాలు సేకరించినప్పుడు వీళ్ళు క్రియాశీల చికత్సను అందుకుంటున్నారు.

కణితి ద్వారా వ్యాపించు జన్యుపరమైన విశ్లేషణ, ఎంతో అత్యాధునిక విధానం అని భావించే "టార్గెటెడ్ సీక్వెన్సింగ్" మరియు "ఫ్లోరోసెంట్ ప్రోబ్ బేస్డ్ డిజిటల్ పీసీఆర్ " వంటి పరీక్షలతో పోల్చినప్పుడు, " సింగల్ కలర్ డిజిటల్ పీసీఆర్ " అనే పరీక్షా విధానం ఎన్నో రకాలైన ప్రయోజనాలను రోగులకు చేకూరుస్తుంది. అతిముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఈ కొత్త పద్దతి ద్వారా ఇంతక ముందు ఆ వ్యాధిగ్రస్థుడికి జరిగిన వ్యాధికారక విశ్లేషణల పై ఆధారపడనవసరం లేదు. అలాగనుక ఆధారపడితే కొన్ని తప్పులతో పాటు కొన్ని నిజాలు బయటపడకపోవచ్చు.

ఈ పరీక్షను అవసరమయ్యే మొత్తం వ్యవస్థను చాలా సులభం గా ఏర్పాటు చేసుకోవచ్చు మరియు విశ్లేషణకు మరీ ఎక్కువ శిక్షణ తీసుకొనవసరం లేదు. అందుకే దీనిని ఎవరైనా చాలా సులువుగా అమలు చేయొచ్చు. అందు మూలంగా ఇది ఎన్నో ప్రయోగశాలలకు చాలా సులువుగా దగ్గరవుతుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Blood Test Can Detect Cancer; Here Is How

    Scientists have developed a new blood test that helps to detect cancer. Know about the details here on Boldsky.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more