For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొన్ని ప్రాణాంతక వ్యాధులను నివారించే మునగాకు, అల్లం కాంబినేషన్

|

జీవితం ఆరోగ్యంగా సాగాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంటారు. మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లోనే ఔషధగుణాలెన్నో దాగుంటాయి. వీటిని మనం తినడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతాయి.

కొన్ని ఆహారపదార్థాలు ఒకటిగా తీసుకోవడం కంటే, ఇతర ఆహారాలతో కలిపి కాంబినేషన్ ఫుడ్స్ గా తీసుకున్నప్పుడు ఉపయోగాలు లేదా ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. అలాంటి ఫుడ్ కాంబినేషన్ లో మునగాకు మరియు అల్లం. ఈ రెండింటిలో ఉండే పవర్ ఫుల్ ఔషధ గుణాల వల్ల పురాతన కాలం నుండి వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

మునగాకు, అల్లం విడివిడిగా వంటల్లో ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతామన్న విషయం మనం ఇది వరకే తెలుసుకున్నాము. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఏవిధంగా ఉపయోగపడుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 కొన్ని ప్రాణాంతక వ్యాధులను నివారించే మునగాకు, అల్లం కాంబినేషన్

మునగాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగాకులో న్యూట్రీషియన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఈ మునగాకును వేడి నీటిలో వేసి ఉడికించడం వల్ల న్యూట్రీషియన్స్ గా పిలవబడే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా విడుదల అవుతాయి. మునగాకు ఉడికించిన నీటిలో పుష్కలమైన న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఆరోగ్య పరంగా మంచిది. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

క్యాన్సర్, డయాబెటిస్ ని అరికట్టే అమేజింగ్ డ్రింక్..!! క్యాన్సర్, డయాబెటిస్ ని అరికట్టే అమేజింగ్ డ్రింక్..!!

మునగాకు లేదా మునగాకు రసంలో కొద్దిగా అల్లం చేర్చి తీసుకోవడం వల్ల ఒబేసిటి, డయాబెటిస్, హార్ట్ సమస్యలను తగ్గుతాయి. ఇంకా జీర్ణసమస్యలు, వికారం, ఆకలి, మోషన్ సిక్ నెస్, నొప్పులను తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని టాప్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ రిసిపిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

1. ఆర్థ్రైటిస్ ను తగ్గిస్తుంది :

1. ఆర్థ్రైటిస్ ను తగ్గిస్తుంది :

మునగాకులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారిస్తుంది. ఇంకా విటమిన్స్, మినిరల్స్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, పొటాషియంలు కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. అల్లంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మునగాకుతో కలవడం వల్ల ఆర్థ్రైటిస్ ను మరింత ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

2. క్యాన్సర్ నివారిణి:

2. క్యాన్సర్ నివారిణి:

మునగాకులో ఉండే బెంజాల్ ఐసోథయోసైనేట్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించబడినది. అందువల్ల దీన్ని కీమోథెరఫీ తీసుకునే వారికి సూచిస్తుంటారు. ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తికి రేడియోప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ను పొందడానికి అల్లం కాంబినేషన్ సహాయపడుతుంది. పేషంట్స్ లో క్యాన్సర్ కు కారణమయ్యే టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

3. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

3. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

మునగాకును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. అల్లం ఇన్ఫ్లమేషన్ తగ్గించి, హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఈ రెండింటి కాంబినేషన్ రిసిపి ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

గర్భిణీ మహిళలు మునగకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు ..!గర్భిణీ మహిళలు మునగకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు ..!

4. తలనొప్పి తగ్గిస్తుంది :

4. తలనొప్పి తగ్గిస్తుంది :

పురాతన కాలం నుండి మునగాకును నొప్పుల నివారిణిగా ఉపయోగిస్తున్నారు. ఇది క్రోనిక్ తలనొప్పిని, మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. ఇది తలనొప్పిని తగ్గించే అనాల్జిక్ గా పనిచేస్తుంది. ఇక అల్లం మైగ్రేన్ తలనొప్పి, వికారం తగ్గించడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది.

5. హైపర్ టెన్షన్ తగ్గుతుంది:

5. హైపర్ టెన్షన్ తగ్గుతుంది:

మునగాకులో ఉండే థయోకార్బమోట్ మరియు ఐసోథియోసైనేట్ లు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. మునగాకుతో పాటు అల్లం కూడా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంను పల్చగా మార్చుతుంది.

6. పొట్టనొప్పి తగ్గిస్తుంది:

6. పొట్టనొప్పి తగ్గిస్తుంది:

మునగాకులో హైయాంటీ అల్సర్ లక్షణాలున్నాయి. ఇవి గౌట్, పొట్ట సమస్యలను నివారిస్తాయి.అలాగే అల్లం కూడా మార్నింగ్ సిక్ నెస్, పొట్ట సమస్యలను నివారిస్తుంది.

7. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

7. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

మునగాకు కాలేయ వ్యాధులను దూరం చేసి, కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్, ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లను నివారిస్తుంది.

8. రక్తహీనత తగ్గించడానికి సహాయపడుతుంది :

8. రక్తహీనత తగ్గించడానికి సహాయపడుతుంది :

మునగాకులో ఉండే గ్రేట్ న్యూట్రీషియన్ వల్ల రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మునగాకులో మనిరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగురుస్తుంది. అల్లంతో కలిపి మునగాకు రసం తాగడం వల్ల అనీమియా సమస్య నుండి బయటపడవచ్చు.

మునగాకు మరియు అల్లం రిసిపి :

మునగాకు మరియు అల్లం రిసిపి :

కావల్సిన పదార్థాలు:

85 g ఫ్రెష్ జింజర్

కొద్దిగా మునగాకు

తేనె ఒక స్పూన్

4 కప్పులు వాటర్

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

అల్లం రూట్ ను వాష్ చేసి, స్లైస్ గా కట్ చేయాలి.. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి మరిగించాలి. అందలో శుభ్రం చేసుకున్న మునగాకు, అల్లం ముక్కలు వేసి ఉడికించాలి. రుచికి సరిపడా తేనె కలపాలి. ఈ రెమెడీని ప్రతి రోజూ ఉదయం పరగడపున, రాత్రి నిద్రించడానికి ముందు ఒక కప్పు తీసుకోవాలి.

English summary

Combination Of Moringa & Ginger To Fight Several Deadly Diseases

Moringa and ginger combination can be used to fight several diseases like arthritis, cholesterol, cancer, etc. Read to know the top health benefits of moringa and ginger recipe.
Story first published:Monday, July 24, 2017, 13:12 [IST]
Desktop Bottom Promotion