కాళ్ళ గోళ్ళు మీద నల్ల మచ్చలు ఏర్పడుటకు డేంజరస్ రీజన్స్!

Posted By: Staff
Subscribe to Boldsky

కాళ్ళ గోళ్ళు డార్క్ గా మారుతున్నట్లు లేదా నల్లగా ఉన్నట్లు గమనిస్తున్నారా?అయితే ఈ లక్షణాలను ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యం చేయకండి. ఇటువంటి లక్షణాలు కొన్ని ప్రమాధకరమైన వ్యాధులను సూచిస్తాయి.

మీరు ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు ఇష్టమైన, డ్రెస్, షూలను ధరించాల్సి వచ్చినప్పుడు, అందమైన కాలిగోళ్ళ మీద ఒక నల్ల మచ్చ కనబడినప్పుడు మీకు నచ్చిన షూలు ధరించాల వద్దా అన్న ఆలోచన మీకు వస్తుంది!

ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఇబ్బందికరమే. కాలి గోళ్ళు డార్క్ గా లేదా నల్లగా మారడం వల్ల కాళ్ళు చూడటానికి అందంగా అనిపించుకోవు. అంతే కాదు ఈ లక్షణాలు ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయి.

ఈ లక్షణాలు ఆరోగ్యానికి ముందు జాగ్రత్త సంకేతాలుగా సూచించడం వల్ల, వెంటనే వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలను నివారించుకోవచ్చు. కాబట్టి, కాళ్ళగోళ్ళు నల్లగా మారితే ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడని కొన్ని రీజన్స్..

1. ట్రూమ:

1. ట్రూమ:

రిపిటీటివ్ ట్యూమా అనేది స్పోర్ట్ ఆడే వ్యక్తులు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ఎక్కువ ప్రెజర్ ను కాళ్ళ వేళ్ళ మీద ఒత్తిడి పెంచడం వల్ల , గోళ్ళ ల్లో రక్త గడ్డ కడుతుంది. గోళ్ళు డార్క్ గా కనబడుతాయి.

2. సుబుంగల్ హెమటోమా:

2. సుబుంగల్ హెమటోమా:

కాళ్ల మీద లేదా కాలి వేళ్ళు, గోళ్ళ మీద ఏదైనా బలమైన వస్తువు పడినప్పుడు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, దాంతో ఆ ప్రదేశంలో నెయిల్స్ బ్లాక్ గా మారడం జరుగుతుంది.

3.ఫంగల్ ఇన్ఫెక్షన్:

3.ఫంగల్ ఇన్ఫెక్షన్:

గోళ్ళ లోపల ఏదైనా ఫంగస్ పెరుగుతున్నట్లైతే, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా కాలి గోళ్ళు నల్లగా మారుతాయి.

4. స్కిన్ క్యాన్సర్ :

4. స్కిన్ క్యాన్సర్ :

కాళ్ళగోళ్ళు లోపల కొన్ని రకాల క్యాన్సర్ స్కిన్ సెల్స్ పెరుగుతాయి, ఈ కారణం వల్ల కూడా కాళ్ళగోళ్ళు డార్క్ గా మారుతాయి.

5. హార్మోనుల అసమతుల్యతలు:

5. హార్మోనుల అసమతుల్యతలు:

హార్మోనుల అసమతుల్యతల వల్ల, శరీరంలో కొన్ని ప్రదేశాల్లో మెలనిన్ పిగ్మెంటేషన్ పెరుగుతుంది, ఇది కాళ్ళగోళ్ళు చర్మంలో కూడా కావచ్చు. అందుకే ఆ ప్రదేశంలో డార్క్ గా మారవచ్చు.

6. ఊపిరితిత్తుల వ్యాధులు :

6. ఊపిరితిత్తుల వ్యాధులు :

కాళ్ళగోళ్ళు నల్లగా మారడానికి ఊపిరితిత్తుల వ్యాధులను కూడా సూచిస్తుంది, ముఖ్యంగా ఈ సమస్య దీర్ఘకాలికంగా ధూమపానం చేసే వారిలో ఈ సమస్య కనబడుతుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

English summary

Dangerous Reasons Why Your Toe Nails Are Getting Darker!

Here are a few reasons why your toe nails could be turning dark.
Subscribe Newsletter