కాళ్ళకు టైట్ గా సాక్సులు ధరించడం ప్రమాదకమా?

By Ashwini Pappireddy
Subscribe to Boldsky

టైట్ గా వున్న సాక్స్ ని ధరించడం మంచిది కాదా? మీరు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన వెంటనే, మొదట మీరు సాక్స్లతో పాటు మీ పాదరక్షలను తొలగించడం. మీ కాళ్ళకు వున్న పాదరక్షలు, సాక్స్ లను తీసేయడంతో వెంటనే మీరు రిలాక్స్ అయినట్లు అనుభూతిని పొందుతారు.మీ పాదాల యొక్క మీ చర్మం గాలిని పీల్చుకుంటుంది మరియు మంచి గా అనిపిస్తుంది.

వైట్ సాక్సులను కాంతివంతంగా శుభ్రం చేయడం ఎలా

ఒకవేళ మీరు చాలా బిగుతుగా వున్న సాక్స్ లను వాడుతున్నట్లైతే, మీరు సాక్స్ ని కవర్ చేసిన భాగం మొత్తం చర్మంపై వాపును మీరు గమనించవచ్చు.

ఎందుకు బిగుతుగా వున్నసాక్స్ ప్రమాదకరమైనది?

ఎందుకు బిగుతుగా వున్నసాక్స్ ప్రమాదకరమైనది?

వదులైన సాక్స్ లను ధరించడం అస్సలు బాగుండదు. అలాగని చాలా బిగుతుగా వున్న సాక్స్ లను ధరించడం కూడా చాలా అనారోగ్యకరమైనది. ఇక్కడ బిగుతైన సాక్స్ లను ధరించడం వలన కలిగే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి.

టైట్ సాక్స్ లను ధరించడం వలన కలిగే ప్రభావాలు

టైట్ సాక్స్ లను ధరించడం వలన కలిగే ప్రభావాలు

టైట్ గా వున్న సాక్స్ మీ రక్త ప్రసరణ మీద తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాళ్ళలో సర్క్యులేషన్ ప్రభావితమైతే, మీరు అసౌకర్యాన్ని అనుభవిస్తారు.అలాంటప్పుడు మీరు ప్రాంతంలో వాపు ఏర్పడి బాధ ను కలిగించవచ్చు.టైట్ సాక్స్ యొక్క మొదటి ప్రభావాలలో ఇది ఒకటి.

ఇది వారికోస్ వెయిన్స్ కి కారణమవుతుందా?

ఇది వారికోస్ వెయిన్స్ కి కారణమవుతుందా?

ఇది అనారోగ్య సిరలు ప్రమాదాన్ని పెంచుతుంది. అప్పటికే అనారోగ్య సిరలతో బాధపడుతున్న వారికి, టైట్స్ సాక్స్ లను ధరించడం వలన పరిస్థితిని మరింత దిగదారుస్తుంది.

వాపు ఏర్పడే ప్రమాదం వుందా?

వాపు ఏర్పడే ప్రమాదం వుందా?

ఇది వినడానికి చాలా కఠినంగా ఉన్నప్పటికీ, టైట్ సాక్స్ వలన వాపు ఎక్కువ అవుతుంది. ఆ ప్రదేశాలలో నీరు చేరడం వలన వాపు ఏర్పడుతుంది. దీనివలన కాళ్ళు మరియు పాదాలు వాపులు ఏర్పడటానికి కారణమవచ్చు.

ఇది మొద్దుబారడానికి కారణమవుతుందా?

ఇది మొద్దుబారడానికి కారణమవుతుందా?

టైట్ సాక్స్ లను ధరించడం వలన మీ కాళ్ళు మరియు పాదాలు మొద్దు బారడం లేదా తిమ్మిరి ని కలిగించవచ్చు. మీ ఉద్యోగం కొన్ని గంటల పాటు కూర్చొని చేసేది అయితే, ఇది మిమల్ని మరింత అధ్వాన్నంగా చేస్తుంది.

మేజోళ్ళ నిర్వహణలో మెళుకువలు!

ఇది అథ్లెట్స్ ఫుట్ కారణం కావచ్చు

ఇది అథ్లెట్స్ ఫుట్ కారణం కావచ్చు

టైట్ సాక్స్ లేదా బూట్ల ను ధరించడం వలన అథ్లెట్ల ఫూట్ గా మారడానికి కారణం కావచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా?అయితే, మీ పాదం తడిగా వున్నట్లైతే అథ్లెట్ ఫూట్ కి కారణమైన ఫంగస్ బాగా పుట్టుకొస్తుంది. టైట్ బూట్లు మరియు సాక్స్ చెమటను బంధించడం వలన ఫంగస్ వృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులను అందిస్తాయి.

స్కిన్ మీద లైన్స్

స్కిన్ మీద లైన్స్

టైట్ సాక్స్ చర్మం మీద చెడు గీతలని సృష్టిస్తాయి. ఆ గీతలు టైట్ సాక్స్ లను ధరించిన ప్రాంతంలో ఏర్పడతాయి. టైట్ సాక్స్ లను దరించడం వలన చర్మం ఎరుపు గా మారి మరియు చికాకు కలిగించవచ్చు.

ఏమి ధరించాలి?

ఏమి ధరించాలి?

100% పత్తి తో తయారు సాక్స్ ఉపయోగించండి. సింథటిక్ పదార్థాల వాడకాన్ని నివారించండి. సరిగ్గా సరిపోయే సాక్స్లను మాత్రమే ఉపయోగించండి. ఒకవేళ అవి చాలా గట్టిగా ఉంటే, అవి చర్మంపై ఎరుపు రంగు రేఖలను ఏర్పరుస్తాయి. మీరు ఆ లైన్స్ ని గమనించినట్లయితే, మీ సాక్స్ లూస్ అవడానికి వాటిని లాంగండి. అలా చేయడం వలన వాటి టైట్ తగ్గుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why Tight Socks Is Dangerous

    And if you have been using a pair of very tight socks, then you may also notice swelling on your skin where the socks end.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more