దీపావళి స్వీట్ల గురించి మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు !

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హిందూ పండగ దీపావళి అంటే స్వీట్లు, తీపి వంటకాలు, బాణసంచా మరియు అందరినీ కలవటం. అందరిని కలవటం అంటే నోరూరించే పిండి వంటకాలను మిత్రులు, కుటుంబంతో కలిసి పంచుకుని తినటం. దీపావళి సమయంలో క్యాలరీలను లెక్కపెట్టుకోవటం కష్టమే. కానీ ఇది పండగ సమయం కాబట్టి నచ్చినవి తినకుండా ఉండలేరు. అందుకని మీకు నచ్చినవి తినాలనిపిస్తే కొంచెం కొంచెం తింటూ ఇతర ఆహారం తగ్గించండి.

గత దశాబ్దంలో పెరిగిన డయాబెటిస్ కారణంగా చాలామంది తమకిష్టమైన స్వీట్లను ఈ తియ్యని నిబంధన కారణంగా తినలేకపోతున్నారు. కానీ ఈ మధ్య ఇలాంటి వారికి కూడా స్వీట్లను ప్రత్యేకంగా తయారుచేసే షాపులు వెలిసాయి. దీపావళిలో ఆరోగ్యకర స్వీట్లంటే కొవ్వుపదార్థాలు, పంచదార, ఎక్కువ ప్రిజర్వేటివ్లు మరియు ఆహార రంగులు ఎక్కువగా వేయని పదార్థాలు...

షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్

దీపావళి స్వీట్లలో ఎక్కువ తెల్ల పంచదారను వాడటం వలన

దీపావళి స్వీట్లలో ఎక్కువ తెల్ల పంచదారను వాడటం వలన

1.దీపావళి స్వీట్లలో ఎక్కువ తెల్ల పంచదారను వాడటం వలన మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చి, ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తపోటు,చక్కెర స్థాయిలు,బరువు పెరుగుతుంది.

ఈ స్వీట్లలో వస్తున్న అనుమతి లేని రంగులు క్యాన్సర్ కారకం

ఈ స్వీట్లలో వస్తున్న అనుమతి లేని రంగులు క్యాన్సర్ కారకం

2.ఈ స్వీట్లలో వస్తున్న అనుమతి లేని రంగులను వాడి చర్మం లేదా ఊపిరితిత్తులకి అలర్జీని కలుగచేస్తాయి.ఈ రంగులు కూడా భవిష్యత్తులో క్యాన్సర్ కారకంగా మారతాయి.

గది ఉష్ణోగ్రత దగ్గర రెండుగంటల కన్నా ఎక్కువ ఉంచితే

గది ఉష్ణోగ్రత దగ్గర రెండుగంటల కన్నా ఎక్కువ ఉంచితే

3.ఈ స్వీట్లను ఒక కుటుంబం వారు మరొకరికి ఇచ్చుకుంటారు. కార్లలో పెట్టిన స్వీట్లు గంటలు గంటలు అక్కడే ఉండి, రాత్రంతా ఉండి వచ్చేరోజుకి పాడవుతాయి.గది ఉష్ణోగ్రత దగ్గర రెండుగంటల కన్నా ఎక్కువ ఉంచితే స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదు.

స్వీట్లకి వాడే దినుసులలో కల్తీ వలన

స్వీట్లకి వాడే దినుసులలో కల్తీ వలన

4.స్వీట్లకి వాడే దినుసులలో కల్తీ వలన ఆరోగ్యంపై చెడు ప్రభావాలు పడవచ్చు.

అన్ని స్వీట్లు పూర్తయ్యేవరకూ అతిగా తింటుంటారు

అన్ని స్వీట్లు పూర్తయ్యేవరకూ అతిగా తింటుంటారు

5.అన్ని స్వీట్లు పూర్తయ్యేవరకూ అతిగా తింటుంటారు. అన్నకూటు రోజున తీపి రుచిని చేదు కూరలతో సమం చేస్తారు కానీ తరచుగా అది కూడా చేయరు.

ఈరోజుల్లో చక్కెరవాడకం ఎక్కువగా ఉంటుంది అది కూడా మంచికే

ఈరోజుల్లో చక్కెరవాడకం ఎక్కువగా ఉంటుంది అది కూడా మంచికే

6.ఈరోజుల్లో చక్కెరవాడకం ఎక్కువగా ఉంటుంది అది కూడా మంచికే. అనేక సంవత్సరాలు జరిగిన పరిశోధనలలో చక్కెర, తక్కువ మొత్తాలలో అయినా అనేక అనారోగ్యాలకు కారణమని తేలింది. స్వీట్లు ఎక్కువగా తినేవారికి స్థూలకాయం, డయాబెటిస్ తప్పనిసరి అయిపోయాయి. కానీ చక్కెరతో తక్కువ సంబంధం ఉన్న లేదా మనకి సంబంధం తెలియని ఇతర అనారోగ్యాల లిస్టు కూడా పెద్దగానే ఉంది ;అధిక రక్తపోటు, హైపోగ్లైసీమియా, డిప్రెషన్, మొటిమలు, తలనొప్పులు, రక్తనాళాలు గట్టిపడటం, అలసట, హింసాత్మకంగా ప్రవర్తించడం, హైపర్ యాక్టివిటీ, ఒళ్ళునొప్పులు, పళ్ళు పాడవటం వంటివి.

 స్వీట్లంటే ఇష్టమున్నవారు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది

స్వీట్లంటే ఇష్టమున్నవారు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది

7. స్వీట్లంటే ఇష్టమున్నవారు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అధికంగా చక్కెర తింటూ అనారోగ్యం పాలవటమే కాదు, అందులో పోషకవిలువలు అస్సలు ఉండవు. విటమిన్లు, ఖనిజలవణాలు, ఎంజైములు, ఫైబర్ ఏదీ లేదు.

 మనుషులకి తమ డిఎన్ ఎ స్థాయి నుంచే చక్కెరంటే ప్రాణం.

మనుషులకి తమ డిఎన్ ఎ స్థాయి నుంచే చక్కెరంటే ప్రాణం.

8. పంచదార రుచికరంగా ఉంటుంది. మనుషులకి తమ డిఎన్ ఎ స్థాయి నుంచే చక్కెరంటే ప్రాణం.హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎవల్యూషనరీ బయాలజిస్ట్ డేనియల్ లీబర్ మాన్ మాట్లాడుతూ ‘చక్కెరపై ఇష్టం చాలా ప్రాచీనమైనది.' అని అన్నారు. ఆది మానవులు తియ్యని పళ్ళు, కూరలకోసం వెతికేవారు. అందులో సహజ చక్కెరలు శక్తిని అందిస్తాయని. కానీ ఆది మానవులు రింగ్ డింగ్స్ లేదా స్నికర్స్ బార్లకోసం ఏం తపించలేదులేండి.

 అమెరికన్లు ప్రతి ఐదు రోజులకి సరాసరి 765 గ్రాముల చక్కెర తింటారు

అమెరికన్లు ప్రతి ఐదు రోజులకి సరాసరి 765 గ్రాముల చక్కెర తింటారు

9. అమెరికన్లు ప్రతి ఐదు రోజులకి సరాసరి 765 గ్రాముల చక్కెర తింటారు. 1822లో మనం ప్రతి ఐదు రోజులకి కేవలం 45 గ్రాముల చక్కెరే తినేవాళ్ళం. అది ఒక సోడా క్యాన్ కి సమానం. ఇప్పుడు దానికి 17 రెట్లు అంటే 17 సోడా కాన్లకి సమానంగా తింటున్నాం.

 అమెరికన్లు ఏడాదికి 130 పౌన్ల చక్కెర తింటారు.

అమెరికన్లు ఏడాదికి 130 పౌన్ల చక్కెర తింటారు.

10. అమెరికన్లు ఏడాదికి 130 పౌన్ల చక్కెర తింటారు. మన 1822 పూర్వీకులు ఏడాదికి 10 పౌన్ల కంటే తక్కువ చక్కెరే తినేవారు. ఏడాదికి 130 పౌండ్లంటే వారానికి 3 పౌండ్లని. అది జీవితకాలానికి 3550 పౌండ్లతో సమానం - అంటే రెండు టన్నుల చక్కెర!

అన్నిటికన్నా మించినది ;

అన్నిటికన్నా మించినది ;

11. అన్నిటికన్నా మించినది ; 130 పౌండ్ల చక్కెర 1,767,900 స్కిటెల్స్ చాక్లెట్లతో సమానం. లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీ చెత్తకుండీని స్కిటెల్స్ తో నింపినంత.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మనం రోజుకి 10 చెంచాల లోపు చక్కరనే తీసుకోవాలి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మనం రోజుకి 10 చెంచాల లోపు చక్కరనే తీసుకోవాలి.

12. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మనం రోజుకి 10 చెంచాల లోపు చక్కరనే తీసుకోవాలి. సగటు అమెరికన్ ఆ మార్కును ఊరికే దాటేస్తారు. 12 చెంచాలకి పైగా తీసుకుంటారేమో అనుకుంటున్నారా? సగటు అమెరికన్ రోజుకి 22 చెంచాల చక్కెరను తింటున్నాడు. మరి పిల్లల సంగతి? 32 చెంచాలు. ఏ మందులు లోపలకి వెళ్ళటానికి కూడా మనకంత చక్కెర అవసరం లేదు. మేరి పాపిన్స్ కి మాత్రం కావాలి.

మనం నేరుగా, మనకి తెలియకుండానే తీసుకునే చక్కెర అనూహ్య ప్రదేశాల నుంచి వస్తుంది.

మనం నేరుగా, మనకి తెలియకుండానే తీసుకునే చక్కెర అనూహ్య ప్రదేశాల నుంచి వస్తుంది.

13.మనం నేరుగా, మనకి తెలియకుండానే తీసుకునే చక్కెర అనూహ్య ప్రదేశాల నుంచి వస్తుంది. కుకీలలోని చక్కెర సంగతి తెలిసిందే. బంగాళదుంప చిప్స్ లో పెద్దగా ఉండదు. కెచప్, టివి డిన్నర్లు, సూప్, క్రాకర్స్ అన్నిటిలో అంతా చక్కెరమయమే.

ఒక కోక్ క్యాన్, 12 ఔన్సులు, 10 చెంచాల చక్కెరను కలిగివుంటాయి

ఒక కోక్ క్యాన్, 12 ఔన్సులు, 10 చెంచాల చక్కెరను కలిగివుంటాయి

14. ఒక కోక్ క్యాన్, 12 ఔన్సులు, 10 చెంచాల చక్కెరను కలిగివుంటాయి. అది రెండు ఫ్రాస్టెడ్ పాప్ టార్ట్'స్ లో ట్వింకీతో సహా ఉండే చక్కెర కన్నా చాలా ఎక్కువ.

 సగటు అమెరికన్ ఏడాదికి 53 గ్యాలన్ల సోడా తాగుతారు

సగటు అమెరికన్ ఏడాదికి 53 గ్యాలన్ల సోడా తాగుతారు

15. సగటు అమెరికన్ ఏడాదికి 53 గ్యాలన్ల సోడా తాగుతారు. మనం లెక్క వేద్దాం. ఒక గ్యాలన్ లో 128 ఔన్సులకి 53 రెట్లు. అది 6784 ఔన్సులు. సులభంగా చెప్పాలంటే ఏడాదికి 565 క్యాన్ల సోడా.

అమెరికన్ డైట్ లోంచి చక్కెరను మొత్తం తీసేస్తే

అమెరికన్ డైట్ లోంచి చక్కెరను మొత్తం తీసేస్తే

16. అమెరికన్ డైట్ లోంచి చక్కెరను మొత్తం తీసేస్తే, రోజుకి 500 క్యాలరీలు తీసేయెచ్చు. మనం తీసేయం కాబట్టి, రోజూ మనం 500 క్యాలరీలను మన ఆహారంకి, పొట్టకి జతచేస్తున్నాం. అంటే రోజుకి 10 స్ట్రిప్పుల బేకన్ తిన్నట్టు. బేకన్ అంటే నచ్చే అమెరికన్లు కూడా అది చూసి ఆపేస్తారు.

ఈ చెత్త ప్రభావాలు అన్నీ అనగా ;

ఈ చెత్త ప్రభావాలు అన్నీ అనగా ;

17.ఈ చెత్త ప్రభావాలు అన్నీ అనగా ; రోగాలు, పళ్ళు పాడవటం, పొట్ట సైజు పెరగటం, పోషకాలు సున్నా ఇన్ని ఉన్నా మనం ఇంకా ఎందుకు చక్కెర పదార్థాలు తీసుకుంటాం? అదే డిఎన్ ఎ సంబంధం. మనకి శక్తి కావాలంటే చక్కెర పదార్థాలపైనే ఆధారపడుతూ వచ్చాం. కానీ పరిణామ క్రమం ఈ ప్రాసెస్ అయిన చక్కెరను లెక్కలోకి తీసుకోలేదు. స్వీట్ల పిచ్చివాళ్ళు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నారంటే వారు మరింత శక్తినిచ్చే పళ్ళు, కూరలు కూడా తిన్నారు కాబట్టి.

చక్కెర కొకైన్ లాగా వ్యసనం.

చక్కెర కొకైన్ లాగా వ్యసనం.

18. చక్కెర కొకైన్ లాగా వ్యసనం. మన మెదడు స్కాన్లు డ్రగ్స్ సమయంలో ఎలా వుంటాయో చక్కెర తిన్నాక కూడా అలానే ఉంటాయి. డోపమైన్ మెదడులోకి స్రవించి మనకి చాలా హాయిగా అన్పిస్తుంది. ముక్కుకి కూడా దాని వాసన చాలా మధురంగా ఉంటుంది కదా!

మనం తీసుకునే చక్కెరపై మనం ధ్యాస పెట్టడం అత్యవసరం.

మనం తీసుకునే చక్కెరపై మనం ధ్యాస పెట్టడం అత్యవసరం.

19. మనం తీసుకునే చక్కెరపై మనం ధ్యాస పెట్టడం అత్యవసరం. అది అనేక రూపాల్లో రావచ్చు. వస్తువుల్లో పీటర్ సెల్లర్ లాంటిది. పంచదార, చెరుకురసం, చెరుకు సిరప్, అధిక ఫ్రక్టోజ్ కల కార్న్ సిరప్, పళ్ళరసాల కాన్సన్ట్రేట్, తేనె, మొలాసిస్, మాల్ట్ సిరప్ ఇదిగో ఇలాంటి ఎన్నో ముసుగుల్లో చక్కెర వస్తుంది.

మన భారతీయులం అమెరికన్ల కన్నా ఎక్కువ స్వీట్లను చక్కెరను తింటాం.

మన భారతీయులం అమెరికన్ల కన్నా ఎక్కువ స్వీట్లను చక్కెరను తింటాం.

20. మన భారతీయులం అమెరికన్ల కన్నా ఎక్కువ స్వీట్లను చక్కెరను తింటాం. మనమేం తింటున్నామో కూడా మనకి చాలా చాలా తక్కువ అవగాహన ఉన్నది.మనకి పోరాడే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తీసుకోండి, సోడాను తగ్గించేయండి. లేబుల్స్ పైన అందులో వస్తువులేంటో చదవండి. చక్కెర లేని పదార్థాలను తీసుకోండి.అవగాహనే మొదటి మెట్టు. డేనియల్ లీబర్ మాన్ అన్నట్టు మన శరీరం గ్రహించలేని స్థాయిలో మనం చక్కెరను అందులో పోస్తున్నాం.

అందరూ తీయని దీపావళి జరుపుకోండి.

English summary

Diwali Alert: Know how artificial colored sweets are harmful to your health

During this Diwali,avoid purchasing coored sweets. Let's know how artificial colored sweets are harmful to your health.
Story first published: Thursday, October 19, 2017, 17:30 [IST]
Subscribe Newsletter