చాక్లెట్స్ తింటే గుండెజబ్బులు రావన్న విషయం మీకు తెలుసా?

By: Mallikarjuna
Subscribe to Boldsky

చాక్లెట్‌ అనగానే పిల్లలు ఇష్టపడటంలో వింతేమీ లేదు. కానీ కొందరు పెద్దలు కూడా ఆ సమయానికి చిన్నవాళ్ళు అయిపోతారు. ఏమైనా అదో మధురమైన అలవాటు కూడా. అయితే, బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలామంది చాక్లెట్‌ జోలికి పోవాలంటే కొంచెం జంకుతారు. చాక్లెట్‌ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజూ చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒక్క వారంలో 6 చాక్లెట్ బార్స్ తినేవారిలస్ గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ చాక్లెట్ తింటే హార్ట్ కు మంచిది . బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. హార్ట్ అటాక్ నివారణతో పాటు హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. . క్రమం తప్ప కుండా రోజూ చాక్లెట్‌ తినేవారికి గుండె జబ్బుల ముప్పు 33 శాతం వరకు తగ్గుతుందనీ, 20 శాతం మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.

is chocolate good for your heart

రోజుకు ఒక్క చాక్లెట్ ను ఖచ్చితంగా తినడం ఎందుకు?సర్ ప్రైజింగ్ ఫ్యాక్ట్స్.!

ఈ మద్యనే జరిపిన పరిశోధనల్లో చాక్లెట్స్ తినే స్త్రీ, పురుషులకు నెలలో మూడు సార్లు చాక్లెట్స్ తినే వారిలో 10 శఆతం గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధకులు సూచించారు .

అలాగే ఒక వారంలో ఒక సర్వింగ్ చాక్లెట్స్ తినేవారిలో 17 శాతం గుండె జబ్బులు రేటు తగ్గిందని, అలాగే ఒక వారంలో 6 సర్వింగ్ చాక్లెట్స్ తిన్నవారిలో గుండె జబ్బులు రేటు 20 శాతం తగ్గిందని కనుగొన్నారు .

గర్భిణీ స్త్రీలు డార్క్ చాక్లెట్స్ తినడానికి ఖచ్చితమైన కారణాలు...

అంతే కాదు, యుఎస్ లోని హార్వార్డ్ స్కూల్ లో జరిపిన ఈ పరిశోధనల్లో చాక్లెట్ తినడం వల్ల కేవలం చాక్లెట్‌ గుండె ఆరో గ్యాన్ని పెంచడమే కాకుండా లోబ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమయ్యే శక్తిని వ్యాధి నిరోధకతను వెంటనే అందించే శక్తి చాక్లెట్‌కు ఉంది. ఇవి చాలావరకూ అన్ని రకాల బ్లడ్‌ ప్రజర్స్‌ను రెగ్యులేట్‌ చేస్తాయట. అందువల్ల చాక్లెట్‌ను కూడా రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

is chocolate good for your heart

"చాక్లెట్లు తినడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుంది. ఆలోచనాప్రక్రియ మెరుగు పడుతుందని అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. పిల్లల డైట్ లో కూడా చాక్లెట్స్ ను చేర్చడం వల్ల ఇది పిల్లలను మంచి ఇంటలిజెంట్స్ గా మార్చుతుంది. రెగ్యులర్ గా చాకెట్స్‌ తినేవారిలో జ్ఞాపకశక్తి, పరిశీలన, విశ్లేషణా సామర్థ్యం, సమన్వయం తదితర అంశాల్లో మంచి ప్రతిభ చూపుతారు.చాక్లెట్స్ లో ఉండే కోకా కంటెంట్ ఆరోగ్యం మీద పాజిటివ్ గా పనిచేస్తుందని దాంతో బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందని జోడించారు.

చాక్లెట్ ఫేషియల్ తో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్.!

మరో పరిశోధన ప్రకారం, జనరల్ హార్ట్ లో ప్రచురించిన విధంగా, ఒక టీమ్ లో 55,502 (26,400పురుషులు and 29,100 మహిళలు)పాల్గొన్నారు. వీరంతా 50 - 64 మద్య వయస్సున్న వారు.

is chocolate good for your heart

"వీరు ఎక్కువ చాక్లెట్స్ తినడానికి లేదు. ఎందుకంటే చాక్లెట్స్ లో ఉపయోగించే షుగర్ లో అధిక క్యాలరీలుండతటం వల్ల బరువు పెరగడానికి , ఇతర జీవక్రియలకు సంబంధించిన సమస్యలు వస్తాయని వీరికి చాక్లెట్స్ ను పరిమితంగా తినాలని సూచించారు . అయితే కోలా అధికంగా ఉండే చాక్లెట్స్ ను పరిమితంగా తీసుకోవడం మాత్రం ఆరోగ్యకరమైన ఎంపిక అని ’’మోస్టఫ్ స్కై సూచించారు.

With Inputs From IANS

English summary

Do You Know Why Chocolate Is Good For Your Heart?

Love to gorge on chocolates? According to a research, consuming up to six bars of chocolate a week may lower the risk of developing a common and dangerous type of irregular heartbeat linked with higher risk of stroke, heart failure, cognitive decline, dementia, and death by 20 per cent.
Story first published: Thursday, July 13, 2017, 8:00 [IST]
Subscribe Newsletter