రోజుకు ఒక కప్పు టీ తాగితే మతిమరుపు దూరం!

Posted By:
Subscribe to Boldsky

మీరు మీ జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా? జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా? మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే!

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని సువాసనను ఘుభాళిస్తూ..గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్‌ టీ కానీ, గ్రీన్‌ టీ లేదా సాధారణ చాయ్‌ కానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు.

రోజుకు ఒక కప్పు టీ తాగితే మతిమరుపు దూరం!

టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌ తగ్గుతాయని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌నకు చెందిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ పేర్కొంటున్నారు. సదరు యూనివర్సిటీ అధ్యయన ఫలితాలను ఇటీవలే 'ద జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, హెల్త్‌ అండ్‌ ఏజింగ్‌' అనే ఆరోగ్య పత్రికలో ప్రచురించారు.

'లెమన్ టీ' లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

రోజుకు ఒక కప్పు టీ తాగితే మతిమరుపు దూరం!

అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును 'ఛేయ్‌' అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధనలు జరిపిన నిపుణులు! కాకపోతే ఒక షరత్.... ఈ చాయ్‌ జాయ్‌ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదు. టీ తాగడం వల్ల ఒక్క మతిమరుపు మాత్రమే కాదు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

1. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది:

1. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది:

ఒక కప్ప టీ త్రాగడం వల్ల మీ శరీరం ఉత్తేజం పరుస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఉండే కెఫిన్. అయితే కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువ. అయితే కూడా ఇది మన శరీరం మీద సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది.

బ్లాక్ టీతో ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన లాభాలు

2. ఎముకలను బలంగా ఉంచుతుంది:

2. ఎముకలను బలంగా ఉంచుతుంది:

కాఫీ కాకుండా, టీ త్రాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కాఫీలోని కెఫిన్ మీ ఎముకల్లోని క్యాల్షియం బయటకు పంపించేస్తుంది. దాంతో బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే కొన్ని పరిశోధన ప్రకారం చాలా సంవత్సరాల నుండి రెగ్యులర్ గా టీ త్రాగడం వల్ల వారికి ఎముకలు చాలా బలంగా ఉంటాయని కనుగొనబడింది.

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

టీ త్రాగడం వల్ల స్ట్రోక్ కలిగించే ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. టీ త్రాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు సాగే గుణం కలిగి ఉంటుంది మరియు రక్త కణాల్లో క్రొవ్వు కణాలు లేకుండా చేస్తుంది. టీ త్రాగడం వల్ల గుండె మరియు రక్తనాళాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది.

క్యాన్సర్ నిరోధిస్తుంది:

క్యాన్సర్ నిరోధిస్తుంది:

టీ, ముఖ్యంగా గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

జీవక్రియలకు బూస్ట్ వంటింది:

జీవక్రియలకు బూస్ట్ వంటింది:

టీ కూడీ మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీతీసుకోవడం వల్ల కేలరీలను(అధిక క్రొవ్వు) కరిగించడానికి సహాపడుతుంది. కాబట్టి మీరు తీసుకొనే గ్రీన్ టీలో తక్కువ పంచదార వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్‌ టీ కాని, లెమన్‌ టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.

జీర్ణాశయం :

జీర్ణాశయం :

అన్నవాహిక సంబంధ వ్యాధులు, గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.

అలసటను తగ్గిస్తుంది:

అలసటను తగ్గిస్తుంది:

శారీరకంగా, మానసికంగా అలసిపోయినపుడు దాని ప్రభావం ముఖంపై ఉంటుంది. రెండు, మూడు గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లుకుంటే అలసట తగ్గుతుంది.

English summary

Drinking A Cup Of Tea Every Day Can Keep Dementia Away in Telugu

Drinking a cup of tea daily can reduce the risk of dementia, especially in those who are genetically predisposed to the debilitating disease, a new study has claimed.
Story first published: Saturday, July 8, 2017, 19:00 [IST]
Subscribe Newsletter