నొప్పి లేకుండా చెవిలో హెయిర్ ను తొలగించడానికి సింపుల్ టిప్స్

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

అనవసర చెవి జుట్టును తొలగించటానికి కొన్ని పద్ధతులలో బ్యాటరీ వాడే తేలికైన ట్రిమ్మర్ మరియు లేసర్ హెయిర్ రిమూవల్ ముఖ్యమైనవి.

చెవిలో అవాంఛిత జుట్టు చాలామందికి చిరాకుగా అన్పిస్తూనే ఉంటాయి. చాలా సాధారణంగా పెరిగే చెవి జుట్టు చెవి రంధ్రం చివర్ల నుంచి బయటకి పెరిగేది.ఇది ఎక్కువైతే అక్కడ జుట్టు మూలంలో ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది అందుకని అవాంఛిత జుట్టును తెలివిగా తీసేయాలి.

బాంబే స్కిన్ క్లినిక్ కి చెందిన చర్మవైద్యులు, మెడికల్ డైరక్టర్ బతుల్ పటేల్ మరియు నియో స్కిన్ క్లినిక్ కి చెందిన చర్మవైద్యురాలు నర్మద మతంగ్ ఈ అవాంఛిత జుట్టును ఎలా వదిలించుకోవాలో విధానాలు సూచించారు.

Ear hair: How to trim and remove it with least pain

*ట్రిమ్మింగ్ ; బ్యాటరీతో పనిచేసే తేలికపాటి ట్రిమ్మర్ ను అక్కడ జుట్టు పెరుగుదలను బట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు వాడవచ్చు.పదునైన కత్తెరలు వాడకండి ఎందుకంటే ఏమన్నా చర్మం కోసుకుంటే ఆ గుర్తులు శాశ్వతంగా ఉండిపోతాయి.

*హెయిర్ రిమూవల్ క్రీములు ; ఈ అవాంఛిత జుట్టును తొలగించే క్రీములు వాడటం సులభంగా అన్పించినా అది దురదకి దారితీసి ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా మార్చేయవచ్చు. పైగా క్రీము మీ చెవిలోపలికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది.అక్కడ అసలే సున్నితమైన చర్మాన్ని పాడుచేస్తే మరింత కష్టం.

Ear hair: How to trim and remove it with least pain

*పట్టకార్ల వంటి ట్వీజర్లు ; ఈ పద్ధతిలో చాలా సమయం పడుతుంది పైగా చాలా నొప్పిగా కూడా ఉండవచ్చు. జుట్టు కుదురు దగ్గర పాడైతే అక్కడ ఇన్ఫెక్షన్ కి కూడా దారితీయవచ్చు.

Ear hair: How to trim and remove it with least pain

*లేజర్ హెయిర్ రిమూవల్ ; లేజర్ హెయిర్ రిమూవల్ పద్ధతిలో చర్మం పాడవకుండా వెంట్రుక కుదురుతో సహా నాశనం చేసేస్తుంది. ఈ పద్ధతి మొదలుపెట్టేముందు, రేజర్ తో షేవ్ చేసి, చల్లనిజెల్ రాస్తారు. తర్వాత చెవిపై నేరుగా లేజర్ హ్యాండ్ పీస్ పెట్టి లేజర్ కాంతి షాట్ ను లేజర్ రకాన్ని బట్టి ప్రయోగిస్తారు.ఇది ఇలా నెలకొకసారి, మొత్తం జుట్టు పోవడానికి 6 నుంచి 8సార్లు చేయాల్సి వుంటుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం నల్ల జుట్టుపై మాత్రమే పనిచేస్తుంది. మీకు నెరిసిన జుట్టు కానీ ఉంటే లేజర్ పనిచేయదు. ఇది చాలా త్వరగా కేవలం 15 నిమిషాల్లో అయిపోయే విధానం. లేజర్ తర్వాత సూర్యకాంతినుంచి రక్షణ కోసం క్రీముని వాడండి.

English summary

Ear hair: How to trim and remove it with least pain

Ear hair: How to trim and remove it with least pain, Unwanted hair on ears has been an annoyance for many. The most common type of ear hair is the one that grows out from the edge of the ear canal and excess of it can result in infection of the hair follicle which can be painful so get rid of all these unwant
Subscribe Newsletter