For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్యాంక్రియాటిక్(క్లోమ గ్రంధి) క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు!

|

శరీరంలోని ముఖ్యమైన గ్రంధుల్లో క్లోమం (పాన్‌క్రియాస్‌) ఒకటి. జీర్ణ వ్యవస్థ కు ఇది ప్రధానంగా దోహదపడుతుంది. శరీరంలో జీర్ణాశయం దిగువ బాగంలో దీన్ని గమనించవచ్చు. ప్యాంక్రియాస్‌ చాలా కీలకమైన విధులు నిర్వహిస్తుంది. అందులో ప్రధానమైనది ఆహారం జీర్ణమయ్యేలా చేయడం. ఇందుకోసం అది తన ప్యాక్రియాటిక్‌ స్రావాలను విడుదల చేస్తుంది. ఈ క్లోమ రసాన్ని స్రవించే కణాల్ని రెండు రకాలుగా చెబుతారు. డక్టల్‌ కణాలు, ఎసినార్‌ కణాలు అని చెప్పవచ్చు. ఇందులో డక్టల్‌ కణాల నుంచి విడుదల అయ్యే బైకార్బనేట్‌ పదార్థాలు.. పాక్షికంగా జీర్ణమైన ఆహారంలోని ఆమ్లత్వాన్ని అదుపు చేయగలుగుతుంది. ఎసినార్‌ కణాలు ముఖ్యంగా క్లోమరసం లోని ఎంజైముల చైతన్యానికి దోహద పడుతాయి. ఇక క్లోమరసంలోని ఎంజైములు వాటి పని తీరు...

క్లోమరసంలో ఉండే ట్రిప్సినోజిన్‌ అనే ఎంజైమ్‌ చైతన్య రూపం పొంది ట్రిప్సిన్‌ గా మారుతుంది. అప్పుడు అది మాంసక్రత్తులపై పనిచేసి అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. కైమో ట్రిప్సినోజిన్‌ కూడా చైతన్యవంతం అయినప్పుడు మాంసక్రత్తుల్ని జీర్ణం చేసేందుకు ఉపకరిస్తుంది. ఆహారంలోని ఎలాస్టిన్‌ లను జీర్ణం చేసే ఎలాస్టియేజ్‌, కేంద్ర కామ్లాలను జీర్ణం చేసే న్యూక్లియేజ్‌ లను క్లోమం స్రవిస్తుంది. ఇక్కడ స్రావితం అయ్యే అమైలేజ్‌.. పిండి పదార్థాల్ని జీర్ణం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక కొవ్వుల్ని సరళ రూపంలోకి మార్చే లైపేజ్‌ అనేది ప్రధానమైన ఎంజైమ్‌ గా చెప్పవచ్చు. అంతే కాకుండా కొవ్వుల్ని ప్రధానంగా జీర్ణం చేసేది క్లోమరసం మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

ప్యాంక్రియాటిక్(క్లోమ గ్రంధి) క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు!

సాధారణంగా 45- 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్వసాధారణం. అయితే చిన్న వయస్సులో వారికి కూడా రావచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకిన వారు వెంటనే ప్రాంతీయ శోషగ్రంధులు, కాలేయం, ఊపిరితిత్తుల, పెరిటోనియం, అడ్రినల్ గ్రంథులు, ముకలు మరియు ఇతర అవయవాలకు క్యాన్సర్ వస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది క్లోమగ్రంథిలో జరిగే అనూహ్య పరిణామాల (మలిగ్నంట్ నియో ప్లాస్మ్) వల్ల వస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వారిలో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత 5 ఏళ్ల వరకు బతికే వారు కేవలం 5శాతం మందే ఉంటున్నారు. పూర్తిగా కోలుకోవడం అనేది ఇప్పటికీ చాలా అరుదు.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణకు 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణకు 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్...

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను కొన్నిసార్లు సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. తర్వాత కూడా ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు బయటపడవు. రకరకాల సమస్యలు మాత్రం కనిపిస్తాయి. అందుకే వ్యాధి తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కానీ ఇది బయటపడదు. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

1. లోయర్ బ్యాక్ , పొత్తి కడుపు పైభాగంలో నొప్పి:

1. లోయర్ బ్యాక్ , పొత్తి కడుపు పైభాగంలో నొప్పి:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు ఒక ముఖ్యమైన లక్షణం. పొత్తి కడుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. అది వెన్నువైపునకు కూడా వస్తుంది. సహజంగా పొట్ట ఉదరం పైభాగంలో నొప్పిని గ్రహిస్తారు. అది క్రమంగా వెన్నువైపు వస్తుంది.

2. కామెర్లు:

2. కామెర్లు:

ప్యాంక్రియాస్ నుంచి విడుదలయ్యే క్లోమరసాన్ని క్యాన్సర్ కణాలు అడ్డుకున్నప్పుడు (60శాతం మందిలో ఇలా జరుగుతుంది) బాధలేని జాండిస్ (చర్మం/ కళ్లు పసుపురంగులోకి మారడం, మూత్రం రంగు మారడం జరుగుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవల్సిన భయంకరమైన నిజాలు..! ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవల్సిన భయంకరమైన నిజాలు..!

3. సెడెన్ గా, ఊహించని రీతిలో బరువు తగ్గుతారు:

3. సెడెన్ గా, ఊహించని రీతిలో బరువు తగ్గుతారు:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు మరో గుర్తించదగిన లక్షణం, బరువు తగ్గడం. క్యాన్సర్ కణుతులు శరీరంలోని ఇతర భాగాలకు చేరినప్పుడు, వాటి పనితీరును అంతరాయం కలిగిస్తాయి. శరీరంలో ముఖ్యమైన అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల అజీర్తి , న్యూట్రీషియన్ లోపం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాల వల్ల అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ప్యాంక్రియాటిక్ లక్షణాల్లో ఇది కూడా ఒకటి.

4. వికారం మరియు వాంతులు

4. వికారం మరియు వాంతులు

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు ఒక ముఖ్య లక్షణం ఆహారం రుచించకపోవడం మరియు వికారం, వాంతులు. ఎప్పుడైతే ట్యూమర్స్ పెరుగుతాయో, అప్పడు జీర్ణవాహికలలో అడ్డంకులు ఏర్పడుతాయి. దాంతో జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో వికారం వాంతులు ఇబ్బంది పెడుతాయి.

5. యూరిన్ కలర్ మారుతుంది:

5. యూరిన్ కలర్ మారుతుంది:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధ పడే వారిలో, యూరిన్ కలర్ ఆరెంజ్, బ్రౌన్, లేదా ఇతర కలర్లోకి మారుతుంది. ట్యూమర్స్ పెరగడం వల్ల ప్రేగునాళాలను బ్లాక్ చేస్తుంది. దాంతో శరీరంలో ఎక్సెస్ బిలిరుబిన్ యూరిన్ లోనికి చేరడం వల్ల యూరిన్ డార్క్ కలర్లో కనబడుతుంది.

6. స్టూల్ గ్రీజిగా మరియు లైట్ కలర్లో ఉంటుంది:

6. స్టూల్ గ్రీజిగా మరియు లైట్ కలర్లో ఉంటుంది:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడే వారిలో స్టూల్ (మలం) బంకగా, పేల్ కలర్లో, వాసవస్తుంటుంది. అందుకు కారణం ప్యాంక్రియాసిస్ లో ట్యూమర్స్ పెరిగి జీర్ణ, క్లోమరసాలను ఉత్పత్తిని అడ్డుకోవడం వల్ల ఇలా జరుగుతుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడం ఎలా..?ప్రొస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను నివారించడం ఎలా..?

7. కడుపుబ్బరం:

7. కడుపుబ్బరం:

ప్యాంక్రియాటిక్స్ లో కణతులున్నప్పుడు గ్యాస్ట్రో ఇంటెన్షినల్ లక్షణాలు అంటే కడుపుబ్బరం, గ్యాస్, ఇన్ఫ్లమేషన్ వంటి లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలు ప్యాంక్రియాసస్ లోని కణతులు విస్తరిస్తూ పెరగడం వల్ల కడుపు ఉబ్బుకుని, ఉబ్బరంగా ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు కడుపుబ్బరం కూడా ఒకటి.

8. ఆకలి లేకపోవడం:

8. ఆకలి లేకపోవడం:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడే వారు, పొట్టలో నొప్పితో బాధపడుతారు. ఏం తిన్నా, కడుపునొప్పిగా భావిస్తారు. కడుపులో కణతులు పెరుగినప్పుడు, అది చిన్న ప్రేగుల వరకూ ప్రాకుతుంది. దాంతో ప్రేగులు బ్లాక్ అవుతాయి. దాంతో ఆకలి పెరుగుతుంది.

9. మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం జరగవచ్చు

9. మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం జరగవచ్చు

మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం జరగవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న చాలా మందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి కొన్ని నెలల ముందే, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల ముందే మధుమేహం వస్తుంది. పెద్దవారిలో మధుమేహం వచ్చిందంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి అదో హెచ్చరికగా పరిగణించవచ్చు.

English summary

Early Symptoms Of Pancreatic Cancer

There are certain symptoms that can contribute to pancreatic cancer. These symptoms are usually non-specific and hence people fail to recognize these symptoms.
Story first published:Monday, June 26, 2017, 13:10 [IST]
Desktop Bottom Promotion