శక్తినిచ్చే పానీయాలు ఈ అనారోగ్యాల రిస్క్ పెరగటానికి కారణం అవుతున్నాయి!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జిమ్ లో కష్టమైన వర్కవుట్ చేసాక లేదా ఉద్యోగం నుంచి అలసిపోయి ఇంటికి వస్తున్నప్పుడు ఏదన్నా వెంటనే శక్తి వచ్చే డ్రింక్ తీసేసుకుని తాగాలనిపిస్తుంది. ఇది మీ దాహం తీర్చడమే కాదు ,వెనువెంటనే శక్తిని కూడా అందిస్తుంది.

కానీ దానికి భిన్నంగా, ఈ ఎనర్జీ డ్రింక్స్ కి కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. ప్రస్తుతం శక్తినిచ్చే పానీయాలపై జరిగిన కొత్త విశ్లేషణలో తేలిందేమిటంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ మానసిక ఆరోగ్యసమస్యలను పెంచే రిస్క్ తో ఉంటాయి. ఇవి రక్తపోటును, స్థూలకాయాన్ని, కిడ్నీలు పాడవటానికి, పెరగటానికి కారణమవుతుంది.

ఈ అధ్యయనంలో ఇంకా ఎనర్జీ డ్రింక్స్ ను ఆల్కాహాల్ తో కలిపి తాగటం వలన మరింత తీవ్ర ఇతర అనారోగ్యాలు కూడా వస్తాయి.

Energy Drink Increases Risk Of These Diseases

ఈ శక్తినిచ్చే పానీయాలలో నీరు, చక్కెర, కెఫీన్, కొన్ని విటమిన్లు, ఖనిజలవణాలు మరియు కొన్ని పోషకాలు అందించని పదార్థాలైన గురానా, టౌరిన్ మరియు గిన్సెగ్. కొన్నిటిలో ఒక ఔన్సు పానీయానికి కూడా 100మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.ఇది మామూలు కాఫీలో ఉండే 12మిల్లీగ్రాముల కన్నా 8రెట్లు ఎక్కువ ఉంటుంది.

ఈ శక్తినిచ్చే పానీయాల రిస్క్ లు చాలావరకు వాటిల్లో ఉండే అధిక చక్కెర, కెఫీన్ స్థాయిల వల్ల వస్తాయి. ఇవి చిరాకు, కోపం, మోతాదు మించి రిస్క్ లు తీసుకునే స్వభావం,మానసిక ఆందోళన, వత్తిడి, అధిక రక్తపోటు, వంటి మానసిక సమస్యలకి మరియు స్థూలకాయం,కిడ్నీలు పాడవటం, అలసట, కడుపునొప్పి వంటి వాటికి కారణమవుతాయి.

ఇప్పటికిప్పుడు మీకు శక్తిని అందించే పవర్ ఫుల్ హోంమేడ్ డ్రింక్..!

ఈ అధ్యయనం ఇటీవల ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైంది.

అదలా ఉంటే ఈ డ్రింక్స్ తాగటం వలన వచ్చే పెద్ద సైడ్ ఎఫెక్ట్ లు ఏంటో చూద్దాం...

1.పళ్ళు పాడవటం

1.పళ్ళు పాడవటం

అధిక మొత్తాలలో చక్కెర, కెఫీన్ వలన ఈ ఎనర్జీ డ్రింక్స్ పళ్లపై ఉండే ఎనామెల్ కి మాత్రమే కాదు కావిటీలను కూడా కలిగిస్తాయి. తరచుగా వీటిని తాగటం వలన మీ పళ్ళపై తీవ్రప్రభావం పడి, తొందరగా పుచ్చిపోతాయి.

2.మధుమేహ రిస్క్

2.మధుమేహ రిస్క్

చక్కెర, కెఫీన్ లు అధిక మధుమేహ రిస్క్ కి కారణమవుతాయి. అనేక పరిశోధనల ప్రకారం ఈ డ్రింక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచటమే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్ ను కూడా కలిగిస్తాయి. ఇదే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను పెంచుతుంది.

3. తీవ్ర అలసట

3. తీవ్ర అలసట

కెఫీన్ ను తీసుకోవటం వలన అలసట కొంచెం తగ్గుతుంది. కానీ ఎనర్జీ డ్రింక్ తాగిన తర్వాత కూడా అలసటగా ఉన్నట్లయితే మీకు ఉన్నది అడ్రినల్ ఫేటిగ్ అన్నమాట. ఇది తరచూ అధికంగా కెఫీన్ ను తీసుకోవటం వలన మీ శరీర అడ్రినలిన్ వ్యవస్థ అలసిపోతే వచ్చేది.

ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇన్ స్టాంట్ ఎనర్జీనిచ్చే 10 హెల్తీ అండ్ ఎనర్జీ డ్రింక్స్

4. కడుపులో చికాకు

4. కడుపులో చికాకు

ఎనర్జీ డ్రింక్స్ లో ఉన్న అధిక మొత్తం కెఫీన్ వలన, అది కూడా ఎక్కువ తాగినప్పుడు కడుపు వాస్తుంది మరియు చికాకుగా ఉంటుంది. అధిక మొత్తాలలో ఎనర్జీ డ్రింక్స్ తాగటం వలన కడుపు లోపలిపొరలు పగిలిపోయి వాస్తుంది, నొప్పి కూడా కలిగిస్తుంది. సరైన సమయంలో సమస్య గుర్తించి దాన్ని నివారించే అవసరమైన విధానాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది.

5. తలనొప్పి

5. తలనొప్పి

శక్తినిచ్చే పానీయాలలో కృత్రిమ తీపిపదార్థాలు ఉంటాయి. ఎక్కువ ఎనర్జీ డ్రింక్స్ తాగితే వీటివల్ల మీకు తలనొప్పి రావటమో, కొన్నిసార్లు మైగ్రేన్ కూడా వస్తుంది.

(ఏజెన్సీ వార్తాకథనం)

English summary

Energy Drink Increases Risk Of These Diseases

Energy Drink Increases Risk Of These Diseases,A new study has found that energy drinks can increase the risk of mental health problems, increased blood pressure, obesity and kidney damage as well.
Story first published: Monday, November 27, 2017, 17:00 [IST]
Subscribe Newsletter