కాలేయాన్ని (లివర్ ని) ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తీసుకోవలసిన 12 బెస్ట్ ఫుడ్స్!

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలోని ముఖ్య అవయవాల పనితీరు సవ్యంగా ఉండాలి. అటువంటి ముఖ్య అవయవాలలో ఒకటి కాలేయం. కాలేయానికి ఏవైనా సమస్యలు వస్తే మొత్తం శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.

అందుకే, కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలేయానికి సంబంధించిన వ్యాధులను మొదటి దశలోనే గుర్తించాలి. లేదంటే, కాలేయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక దశలో, కాలేయం పనిచేయలేని స్థితికి కూడా చేరే ప్రమాదం ఉంది.

కాబట్టి, మానవ శరీరంలోని ఈ కాలేయం పనితీరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేయం, ఉదరంలో కుడిభాగాన ఉండే ఈ అవయవం యొక్క ప్రధాన పని జీర్ణాశయం నుండి వచ్చే రక్తాన్ని వడకట్టి మిగతా శరీర భాగాలకు పంపించడం. అదే విధంగా, శరీరంలోంచి కెమికల్స్ ని అలాగే వ్యర్థపదార్థాలను నిర్విషీకరణ చేయడం కూడా కాలేయం బాధ్యతే.

foods good for your liver

కాలేయానికి మంచి చేసే ఆహారాలు

రక్తము గడ్డ కట్టటం కోసం అలాగే శరీరంలోని కొన్ని మిగతా ముఖ్యవిధుల కోసం అవసరమైన ప్రోటీన్లను కూడా కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యవస్థ పనితీరులో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది.

మీరు తీసుకునే ఆహారం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, కాలేయానికి ఏవైతే మంచిదో వాటిని అవసరమైన మోతాదులో తీసుకోవడం వలన కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

కాబట్టి, ఈ ఆర్టికల్ లో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడే కొన్ని ఆహారపదార్థాల జాబితాను మీ కోసం సిద్ధం చేసాము. ఈ ఆర్టికల్ ని చదివి కాలేయానికి మంచి చేసే ఆహారపదార్థాల గురించి తెలుసుకోండి.

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు సమృద్ధిగా లభిస్తాయి. వెల్లుల్లిలో లభించే అలిసిన్ అనే పదార్ధం యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలకు నిలయమని చెప్పుకోవచ్చు. ఈ పదార్థం, శరీరాన్ని ఆక్సిడేటివ్ డేమేజ్ నుంచి రక్షిస్తుంది. అలాగే శరీరానికి హానీ చేసే వ్యర్థపదార్థాలను బయటకు పంపడానికి అవసరమయ్యే ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేసేలా కాలేయాన్ని ప్రేరేపిస్తుంది.

2. పసుపు:

2. పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం కలదు. ఈ పదార్థంలో యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు. అందువలన, టర్మరిక్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే ఇన్ఫ్లేమేషన్ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా కాలేయాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.

3. కేరట్:

3. కేరట్:

కేరట్లలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీలు పుష్కలంగా కలవు. అలాగే, శరీరానికి ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ తో పాటు డైటరీ ఫైబర్ కూడా లభిస్తుంది. ఒక గ్లాసుడు కేరట్ జ్యూస్ ని తీసుకోవడం ద్వారా కాలేయంలోనున్న ఫ్యాటీ ఆసిడ్స్ ని అలాగే వ్యర్థ పదార్థాలను తగ్గించుకోవచ్చు.

4. గ్రీన్ టీ:

4. గ్రీన్ టీ:

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, కాటెచిన్స్ అనే ముఖ్యమైన పోలీఫెనాల్స్ ఇందులో లభిస్తాయి. ఇవి కాలేయంలోంచి వ్యర్థపదార్థాలు తొలగించేందుకు ఉపయోగపడతాయి. తద్వారా, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ ని తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

5. అవొకాడో:

5. అవొకాడో:

అవొకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే, అవొకాడోలో యాంటీ ఇంఫ్లేమేటరీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే, 3 నుంచి నాలుగు అవొకాడో స్లైసెస్ ని తరచూ తినడం ద్వారా కాలేయ వ్యాధులను నిర్మూలించవచ్చు.

6. ఆలివ్ ఆయిల్:

6. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో మంచి క్రొవ్వులు కలవు. మిగతా వంటనూనెలలా కాకుండా ఆలివ్ ఆయిల్ లో కాలేయాన్ని సంరక్షించే గుణాలు అధికం. ఆలివ్ ఆయిల్ అనేది చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలను అలాగే సీరం ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తూ లిపిడ్ ఆక్సిడేషన్ తో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా, కాలేయం పనితీరు బాగుంటుంది.

7. ఆకుపచ్చ కూరగాయలు:

7. ఆకుపచ్చ కూరగాయలు:

స్పినాచ్, లెట్యూస్, మాస్టర్ గ్రీన్స్ వంటి ఆకుపచ్చని కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్ తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా, ఆకుపచ్చని కూరగాయలలో ఫైబర్ తో పాటు విటమిన్స్, కేల్షియం పుష్కలంగా లభిస్తాయి. రోజువారి ఆహారంలో భాగంగా ఒక కప్పుడు ఆకుపచ్చటి కూరగాయలను తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

8. నట్స్:

8. నట్స్:

వాల్నట్లు, బాదం వంటి నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే, రోజూ ఎనిమిది నుంచి 10 బాదం పప్పుల్ని అలాగే వాల్నట్స్ ని ఆహారంగా తీసుకుంటే కాలేయం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

9. బీట్ రూట్ జ్యూస్:

9. బీట్ రూట్ జ్యూస్:

బీట్ రూట్ లో బెటలైన్స్ అనే ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఈ పదార్ధం వలన, బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే కార్సినోజెన్స్ ద్వారా కలిగే డిఎన్ఏ డేమేజ్ నుంచి అలాగే కాలేయ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పుడు బీట్రూట్ జ్యూస్ ని తీసుకున్నా లేదా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఒక కప్పుడు బీట్రూట్ ని తీసుకున్నా కాలేయాన్ని సంరక్షించుకోవచ్చు.

10. గ్రేప్ ఫ్రూట్:

10. గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్ లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు కలవు. అందువలన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ ను తరచూ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పనితీరును మెరుగుపరచుకోవచ్చు. అదే విధంగా ఇన్ఫెక్షన్స్ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. కాలేయాన్ని నిర్విషీకరణ చేసి కాలేయం ఆరోగ్యాన్ని కాపాడటంలో గ్రేప్ ఫ్రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

11. తృణధాన్యాలు:

11. తృణధాన్యాలు:

బ్రౌన్ రైస్, క్వినోవా అలాగే బక్ వీట్ లనేవి ఉత్తమమైన తృణధాన్యాలు. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వలన వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువును అదుపులో ఉంచడంతో పాటు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాథి నుంచి రక్షణ లభిస్తుంది.

12. ఆపిల్స్:

12. ఆపిల్స్:

ప్రతి రోజూ ఆపిల్ ని తీసుకుంటే వైద్యుని వద్దకు వెళ్లే అవసరం ఉండదనే నానుడి మనందరికీ తెలిసినదే. ఆపిల్స్ లో ఉండే పోషక విలువలు కాలేయం ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉపయోగపడతాయి. ఆపిల్ లో ఉండే పోలీఫెనాల్స్ వలన కాలేయం వాపుకు గురయ్యే ప్రమాదం ఉండదు. ఆ విధంగా హెపటైటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

English summary

Best Foods To Keep Your Liver Healthy

Liver is one of the most important organs. Any damage to the liver can affect the entire functioning of the body. The health of your liver depends a lot on what you are eating. There are a few foods that help in keeping your liver healthy..
Story first published: Tuesday, December 19, 2017, 8:00 [IST]