For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : సెక్స్ మీద ఆసక్తి..కోరికలు తగ్గించే ప్రమాదకర ఆహారాలు.!

|

ఈమద్య కాలంలో స్ట్రెస్ లైఫ్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ వల్ల జంటలు, లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇలా దాంపత్య జీవితంలో లైంగిక సమస్యలు కొరవడుట వల్ల అనేక సమస్యలు, ఇద్దరి మద్య మనస్పర్థాలు, దూరాలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో నాకు ఆసక్తి లేదా సామర్థ్యం తగ్గిపోయిందని తన పార్టనర్ కు ఎవరూ చెప్పుకోలేరు. అది వారి అహాన్ని దెబ్బతీస్తుంది. కాని కోరిక తగ్గిపోవటం అనే సమస్య తీవ్ర శారీరక మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది. మనకు తెలియకుండానే ఎన్నో ఆహారాలు ఇంటిలో తినేస్తూ వుంటాం. వాటిలో కొన్ని మనలోని కోరిక తగ్గించేవిగా వుంటాయి. ఆ ఆహారాలు మీ పార్టనర్ తో సంభోగం చేయాలనే వాంఛను తగ్గించేస్తాయి. కనుక వాటిని మీరు తినటం తగ్గించాలి. అంటే, మీ ఆహారంనుండి వాటిని పూర్తిగా తొలగించేయమని కాదు. మీకు తినాలనుంటే, కొద్ది మొత్తాలలో తినండి.

 Foods That Will Mess With Your Sex Drive

డార్క్ చాక్లెట్ మరియు బాదం రెండు కూడా కామోదదీపన చేయగల గొప్ప ఆహారాలని మనకు తెలిసిన విషయమే. అయితే, మీ మానసిక స్థితి మీద వ్యతి రేక ప్రభావం చూపే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అయితే మీ లైంగిక జీవితాన్ని నాశనం చేసి, పునరుత్పత్తి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మీకు మంచి మూడ్ ఉండాలంటే మీ రెగ్యలర్ డైట్ లేదా మీ రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మెను నుండి కొన్నింటి పూర్తిగా నివారించాలి. మీ లైంగిక వాంచకు హాని కలిగించే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి.!

ప్రొసెస్డ్ ఫుడ్స్ :

ప్రొసెస్డ్ ఫుడ్స్ :

ప్రొసెస్డ్ మీట్(తాజాగా కానీ మాంసాహారం). తాజాగా లేని మాంసాహరం అంటే రాత్రి వండినది, లేదా ఒక రోజు లేదా రెండు రోజుల ముందు వండిన మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిని బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది. అందుకోసం మాంసాహారాలతో తయారయ్యే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ను బయట తినడం మానేయండి.

సోడ(కార్బోనేటెడ్ డ్రింక్స్):

సోడ(కార్బోనేటెడ్ డ్రింక్స్):

రెగ్యులర్ సోడాలు మరియు రుచికరమైన పానీయాలు మీ బరువు హెచ్చుతగ్గులు మరియు మీ మానసిక స్థితి ఒడిదుడులకులకు కారణం కావచ్చు. ఇటువంటి పానీయాలు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం కావచ్చు. ఉదా: ఊబకాయం, దంతక్షయ సమస్యలు, మధుమేహం, మరియు మరొకన్ని ఇతరములు..ఈ లక్షణాలతో మీరు కనుక బాధపడుతున్నట్లైతే ఇప్పటికి మీరు మీ లైంగి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రహించాలి.

పాప్ కార్న్ :

పాప్ కార్న్ :

కార్న్ ఫ్లేక్స్ లేదా మొక్క జొన్న పొత్తులు రెగ్యులర్ గా తింటూ వుంటే కూడా మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు పడిపోతాయి. మొదటగా జొన్న పొత్తులను ఆహారంలో ప్రవేశ పెట్టేటపుడే, ఈ విషయాన్ని అది కనిపెట్టిన జాన్ హార్వే కెల్లాగ్ ప్రచారం చేశారు. ఈ ఆహారాన్ని కామ వాంఛ తగ్గించేందుకే ప్రవేశ పెట్టారు. అతని మేరకు, తమ కామవాంఛలు అధికంగా వుండి, మానసిక, శారీరక సమస్యలు తగ్గాలని కోరే వారికి ఈ ఆహారం ఎంతో సహకరిస్తుంది.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్:

ఫ్రైడ్ ఫుడ్ ఉదా: ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్ వంటివి చాలా తీవ్రంగా లైంగికసామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వీటిలో ఉండే హైడ్రోజెనేటడ్ ఫ్యాట్స్ టెస్టోస్టెరాన్ లెవల్స్ ను తగ్గించేస్తాయి. మరియు పురుషుల్లో తక్కువ నాణ్యత గల స్పెర్మ్ మరియు జీవం లేని స్పెర్మ్ ప్రొడక్షన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీ పాట్నర్ తో బయట డిన్నర్ చేసి వారి ఇంప్రెస్ చేయాలనుకుంటే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ జాయిట్స్ కు దూరంగా ఉండాలి. ముక్యంగా మీరు లైంగిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.

కాఫీ:

కాఫీ:

ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

కృత్రిమ స్వీటెనర్లు అస్పర్టమే కలిగి ఉంటాయి , శరీరం, మనస్సు సంతోషంగా ఉండేలా చేసే హార్మోన్ (సెరోటోనిన్)కు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ పదార్థం మీ మానసిక స్థితి నానశనం చేయడానికి దోహదం చేస్తుంది. మీ మానసిక స్థితి మరియు లిబిడో గురవుతాయి .ఇది ఒకటి మాత్రమే కాదు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఉదా: తలనొప్పి, ఇరిటేషన్, ఆత్రుత, నిద్రలేమి వీటన్నింటికి కారణం అవుతుంది. కాబట్టి మీరు బయట కొనే వస్తువుల్లో నేచురల్ స్వీట్నర్స్ కు తేనె, లేదా బెల్లం, వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి, మీ ఆరోగ్యంతో పాటు లైంగిక జీవితానికి కూడా చాలా మంచిది.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్లో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మీరు విశ్రాంతి పొందవచ్చు అనుకుంటారు. కానీ మద్యం తీసుకోవడం వల్ల మీరు మగత ఉండటానికి కారణం అవుతుంది. అంతే కాదు ఆల్కహాల్లో ఉండే కెమికల్స్ టెస్టోస్ట్రెరాన్ ఉప్పత్తిని తగ్గిస్తుంది . కాబట్టి మీ పార్ట్నర్ తో సంతోషంగా గడపదులుచుకుంటే మద్యం సేవించడం వెంటనే మానివేయాలి.

సోపు విత్తనాలు -

సోపు విత్తనాలు -

ప్రతివారికి భోజనం తర్వాత నోటి రుచి మారాలంటూ సోపు వేయటం అలవాటుగా వుంటుంది. ఈ సోపు విత్తనాలు కనుక అధికం అయితే, ఎంతో హాని. అవి మీ కామ వాంఛను కుదించేస్తాయి. ఇవి మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయి తగ్గిస్తాయి.

English summary

Foods That Will Mess With Your Sex Drive

If you ever find you and your partner not in the right mood, then it is the food that you have eaten that is to be blamed.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more