ఎట్టిపరిస్థితిలో పరగడుపున తినకూడని ఆహారాలు..

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం అన్న సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆహారపదార్ధాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవే ఆహారపదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్ కాదని ఎమ్టీ స్టమక్ అని వారు అంటున్నారు. మరి క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినా…. పరగడుపున తినకూడని ఆహారపదార్ధాలేంటో మనమూ తెలుసుకుందాం.

ఎట్టిపరిస్థితిలో పరగడుపున ఈ పనులు చేయడం తగదు..

1. కారంగా ఉండే ఆహారాలు:

1. కారంగా ఉండే ఆహారాలు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో, ముఖ్యంగా పరగడుపున కారంగా కారంగా ఉండే ఆహారాలు, మసాలాలతో వండిన ఆహారాలను ఎట్టిపరిస్థితిలో తీసుకోకూడదు. ఇవి ఎసిడిటి మరియు అల్సర్ ను క్రియేట్ చేస్తాయి.

2. సాఫ్ట్ డ్రింక్స్ :

2. సాఫ్ట్ డ్రింక్స్ :

సాఫ్ట్ డ్రింక్స్ ముఖ్యంగా చల్లగా ఉండే పానియాలు, పరగడుపున తీసుకోవడం అంత మంచిది కాదు, వీటిలో ఎక్కువగా కార్బొనేటెడ్ యాసిడ్స్ ఉండటం వల్ల స్టొమక్ యాసిడ్స్ కు కారణం అవుతుంది. ప్రమాధకర అనారోగ్యాలకు దారితీస్తుంది. అంతే కాదు గ్యాస్, వాంతి వచ్చినట్లు ఉండటం వంటి సమస్యలకు దారితీస్తుంది.

3. కోల్డ్ డ్రింక్స్:

3. కోల్డ్ డ్రింక్స్:

వీటికి ఏ రకమైన పోషక విలువలు వుండవు. కాని చల్లగా వుండటం చేత తాగేస్తాము. ఇవి బరువు పెంచుతాయి. తీపి డ్రింక్, షర్బత్, వంటివాటిలో షుగర్ అధికంగా వుండి కేలరీలు వుంటాయి. అవి బరువెక్కిస్తాయి. అలాగే కోల్డ్ కాఫీ, కోల్డ్ టీలు కూడా స్టొమక్ యాసిడ్స్ కు దారితీస్తాయి. కనుక కూల్ డ్రింక్ లకు బదులు, తాజా పండ్ల రసాలు తాగి శరీరానికి ఆరోగ్యం చేకూర్చండి.

4. సిట్రస్ పండ్లు:

4. సిట్రస్ పండ్లు:

ఆరెంజ్, లెమన్, జామ వంటి సిట్రస్ , బిట్టర్ పండ్లను ఉదయం పరగడపున తీసుకోవడం అంత మంచిది కాదు. ఇవి పొట్టలో గ్యాస్, యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థను పాడుచేస్తాయి. పరగడుపుతో ఎట్టి పరిస్థితిలో వీటిని తినకూడదు.

5. కాఫీ:

5. కాఫీ:

చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని, ఈ విధంగా తాగడం వల్ల హార్మోన్లు అన్ బ్యాలెన్స్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని తాగి తర్వాత కాఫీ, టీ లు తాగటం మంచిదంటున్నారు.ఇంకా పరగడుపున కాఫీ తాగితే ఎసిడిటికి కారణమవుతుంది.

6. పియర్స్ (బేరిపండ్లు):

6. పియర్స్ (బేరిపండ్లు):

బేరిపండ్లును పరగడుపున తినకూడదు, ఇది స్టొమక్ అప్ సెట్, కారణం అవుతుంది, గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ టిష్యులకు కారణం అవుతుంది. కాబట్టి పరగడుపున బేరిపండ్లు తినకపోవడమే మంచిది.

7. అరటి పండ్లు:

7. అరటి పండ్లు:

పరగడుపున అరటి పండ్లు తినడం వల్ల వాటిలో ఉండే మెగ్నీషియం లెవల్స్ రక్తంలో ప్రభావం చూపుతుంది. దాంతో కార్డియాక్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

8. టమోటోలు:

8. టమోటోలు:

టమోటోలలో టానిన్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ట్ లో యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టిష్యులను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, పరగడుపున ఇలాంటి ఆహారాలను ఎట్టిపరిస్థితిలో తీసుకోకూడదు.

English summary

Foods That You Must Never Eat On An Empty Stomach

In this article, we have listed the foods you shouldn't eat on an empty stomach. Read on to find out about the foods not to be eaten on an empty stomach.
Subscribe Newsletter