Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎట్టిపరిస్థితిలో పరగడుపున ఈ పనులు చేయడం తగదు..
మనం ఏం తింటాము, వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.ముఖ్యంగా ఉదయం అల్ఫాహారం, మద్యహ్నాం భోజనం సమయంలో మనం తీసుకునే ఆహారాలు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రోజంత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండలాంటే ఉదయం తీసుకునే ఆహారానికి చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి.
చాలా మంది ఈ రోజుల్లో ఉదయం అల్ఫాహారం తీసుకోకుండా ఉంటారు. కాఫీ తాగేద్దాం, లేదా మార్నింగ్ రన్నింగ్ వల్ల సమయం లేదు, ఇంకా ఉద్యోగస్తులైతే సమయం లేదు అని ఇలా ఏదో ఒక వంకతో అల్ఫాహారం తీసుకోకుండా ఉంటారు. ఇలాంటి విషయాలను పూర్తిగా నివారించాలి. పరగడుపుతో ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

వెల్లుల్లిని పరగడుపుతోనే ఎందుకు తినాలి? ఆరోగ్య రహస్యాలేంటి...
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి రోజూ ఉదయం తనకోసమంటూ కొద్ది సమయం కేటాయించాలి. అలాగే పరగడుపున కొన్ని పనులను ఖచ్చితంగా చేయకూడదు..అవేంటో తెలుసుకుందాం...

1. యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తీసుకోవడం:
యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పరగడుపున తీసుకోకూడదు, ఇది ప్రమాధకర స్థితిని తెలుపుతుంది. ఇది గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ కు దారితీస్తుంది. మరియ మందుల యొక్క తీవ్రతను పెంచుతుంది.

2. కాఫీ తాగడం:
పరగడుపున కాఫీ తాగడం వల్ల యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. చాతీలో మంట, జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ఉదయం పరగడుపున కాఫీ తాగడం నివారించాలి.

3. ఆల్కహాల్ తాగడం:
ఆహారం ఏమి తీసుకోకుండా ఆల్కహాల్ తీసుకుంటే, శరీరంలో ఆల్కహాల్ గ్రహించే శక్తి 2 శాతం పెరుగుతంది. తర్వాత తిన్న ఆహారం జీర్ణం కాకుండా , హ్యాంగోవర్ కు గురిచేస్తుంది. కాబట్టి, పరగడుపు ఈ పనిచేయకూడదు.

4. చూయింగ్ గమ్ తినడం:
పరగడుపున చూయింగ్ గమ్ తినడం వల్ల పొట్టలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల పొట్ట లైనింగ్ తొలగిస్తుంది. దాంతో గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది. మరో వరెస్ట్ పని ఇది.

5. నిద్రపోవడం:
ఆకలి, తక్కువ గ్లూకోజ్ లెవల్స్ నిద్రకు కారణమవుతుంది. ఐరన్ కోల్పోవడం వల్ల నిద్రలేమి సమస్య పెరిగి ఆకలికి కారణమయ్యే హార్మోన్స్ పెంచుతుంది.



Click it and Unblock the Notifications