ఇలాంటి సాధారణమైన ఆహారం తినడం ద్వారా భవిష్యత్తులో గుండెపోటు రాకుండా అరికట్టవచ్చు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక ప్రసిద్ధి చెందిన నానుడి ఏమిటంటే " ఆరోగ్యవంతమైన గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. "

ఈ నానుడిని మరింత దగ్గరగా విశ్లేషిస్తే మరియు దాని వెనుక ఉన్న నిఘాడ అర్ధాన్ని అర్ధం చేసుకోగలిగితే, అందులో ఉన్న అర్థం ఏమిటంటే ఒక వ్యక్తికి ఆరోగ్యవంతమైన గుండె గనుక ఉంటే, అతని యొక్క జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కనీసం ఆరోగ్యం విషయంలోనైనా ఇలా జరుగుతుంది అని అర్ధం చేసుకోవచ్చు.

ఈ విషయాన్ని మనలో చాలా మంది ఒప్పుకొని తీరాల్సిందే కదా ? ఎప్పుడైనా గుండెపోటు రాకుండా ఉండాలి లేదా అరికట్టాలి అంటే, ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.

tips to prevent heart attacks

మంచి ఆరోగ్యం లేకుండా జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించలేరు. జీవితంలో మిగతా విషయాల్లో ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ అది జరగదు. ఉదాహరణకు మీరు గనుక నయం కాని మధుమేహం వంటి జబ్బులతో గనుక బాధపడుతుంటే, మీకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా వీటితో పాటు మీకు ఎంతో ఇష్టమైన సాహస క్రీడలకు కూడా మీరు దూరంగా ఉండవలసి వస్తుంది. అందుకు కారణం మీ దగ్గర శక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉండటమే.

కొన్ని జబ్బులు చాలా చిన్నవిగా ఉండవచ్చు మరియు అవి కొద్దీ రోజుల్లోనే నయం అవ్వవచ్చు అంతే కాకుండా మీ దైనందిక జీవితాలకు ఎక్కువ ఆటంకాలు కలిగించకపోవచ్చు. అయితే మరికొన్ని వ్యాధులు మాత్రం మీ యొక్క నాణ్యమైన జీవితాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు.

మనిషి శరీరం ఎన్నో అవయవాలు మరియు కణజాలంతో రూపొందించబడింది అనే విషయం మనకందరికీ తెలుసు. శరీరంలో ఉన్న ఈ ఒక్క ముఖ్యమైన అవయవం పనిచేయలేకపోయినా వ్యక్తులు భయంకరమైన వ్యాధుల భారినపడే అవకాశం ఉంది.

గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు మరియు మెదడు మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు. వీటిల్లో ఏ ఒక్క దానికి అయినా చిన్నగా నష్టం కలిగినా లేదా బాగా శక్తిహీనం అయిపోయినా చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండెపోటు వంటి విపరీతమైన సమస్యలు తలెత్తవచ్చు.

మనం తీసుకొనే ఆహారమే మన ఆరోగ్యవిషయములో కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు.

సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు..!

ఈ మద్యే ఒక నూతన అధ్యయనం చెబుతున్న విషయం ఏమిటంటే, క్రమం తప్పకుండా ప్రతిరోజూ గింజలు తినడం ద్వారా గుండెపోటు రాకుండా అరికట్టవచ్చు.

ఎలా మరియు ఎందుకు అలా జరుగుతుంది ? గుండెపోటును ఎలా అరికట్టవచ్చు అనే విషయానికి సంబంధించిన చిట్కాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

tips to prevent heart attacks

గింజలు మరియు గుండెపోటుని అరికట్టడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి :

గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి మరియు ఎంతో రుచికరంగాను ఉంటాయి. మిగతా ఆరోగ్యవంతమైన ఆహారాల్లో కంటే కూడా పోషకతత్వాలు గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది నిజమే కదా. ఈ విషయం మనందరికీ తెలుసు.

గింజలను మాములుగా వివిధరకాల కూరల్లో మరియు రుచికి ప్రధానం అయినా వంటల్లో వీటిని విరివిగా వాడుతుంటారు. అంతే కాకుండా వేయించిన వాటిని లేదా పచ్చిగా అలానే తినవచ్చు.

బాదం పప్పు, జీడీ పప్పు, వేరుశెనగ పప్పు , పిస్తా, వాల్ నట్స్ మొదలగు గింజలు బాగా ప్రసిద్ధి గాంచాయి.

హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ లక్షణాలివే

వివిధ రకాల గింజల్లో వివిధ రకాలైన ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయి. అంతే కాకుండా అన్ని గింజల్లో కొన్ని సమానమైన లాభాలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు బాదం పప్పు తినడం వల్ల కండలు బాగా పెరుగుతాయి. పిస్తా తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.

అయితే పిస్తా మరియు బాదం పప్పు రెండు రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులు రాకుండా కాపాడతాయి.

గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల అక్కడి కండరాలల్లో ఎదో అడ్డు పడటం వల్ల, గుండెపోటు వంటి విపరీతమైన పరిస్థితులు తలెత్తుతాయనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే గుండెకు ప్రాణవాయువు మరియు రక్తం సరఫరా ఆగిపోతుందో అప్పుడు గుండె పనిచేయడం ఆగిపోతుంది.

tips to prevent heart attacks

గుండెపోటుని అరికట్టడానికి చిట్కాలు :

చాలా సందర్భాల్లో గుండెపోటు వల్ల వ్యక్తులు అప్పటికప్పుడు మరణించిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

విపరీతమైన కొవ్వు లేదా రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు పదార్ధాల వల్ల అక్కడి కండరాల్లో అడ్డంకులు మొదలవుతాయి మరియు ప్రాణవాయువుతో కూడిన రక్తం గుండెకు అందకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది.

ఈ మధ్యనే ఒక అమెరికన్ పత్రికలో ఆసక్తికరమైన అంశం ప్రచురితమైంది. పిడికెడు గింజలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులను అరికట్టవచ్చు అని అందులో చెప్పబడి ఉంది.

హార్ట్ ఎటాక్ రావడానికి నెల ముందు కనిపించే 7 డేంజర్ సంకేతాలు

ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ ఈ వంటి ఎన్నో పోషక విలువలు గింజల్లో అధికముగా లభ్యమవుతాయట. వాటి యొక్క తత్వం వల్ల శరీరంలో ఉన్న కొవ్వుని సాధారణంగానే తగ్గిస్తాయట. అంతే కాకుండా కండరాల్లో పేరుకుపోయి ఉన్న కొవ్వు కూడా మెల్లగా తగ్గుతుంది. ఇలా చేయడం ద్వారా సరిపడిన అంత రక్తం గుండెకు సులభంగా అందుతుంది.

పైన చెప్పబడిన విధంగా చెప్పడం ద్వారా గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.

అందుచేత ప్రతి రోజు పిడికెడు గింజలను క్రమం తప్పకుండా తినడం ద్వారా మీ గుండెను ఆరోగ్యవంతమగా ఉంచుకోవచ్చు.

English summary

Common Food To Prevent Heart Attacks

The heart is a vital organ and if it does not function properly, the consequences could be fatal. Our diet plays a key role when it comes to heart health. One common type of food can prevent heart attacks. Check out what they are, here.
Story first published: Monday, December 4, 2017, 15:00 [IST]
Subscribe Newsletter