రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్స్ సూచించిన పండ్లు

By: Mallikarjuna
Subscribe to Boldsky

డేంగ్యూ ట్రీట్మెంట్: బ్లడ్ పెరగడానికి పండ్లు తినమని డాక్టర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. డేంగ్యూ ఫీవర్ 2నుండి 7 రోజుల వరకూ దీర్ఘకాలిక జ్వరంగా ఉంటుంది. దీన్ని బోన్ ఫీర్ అని కూడా పిలుస్తారు. డేంగ్యూ ఫీవర్ వచ్చిన వారిలో జాయింట్ మరియు మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది.

డేంగ్యూ ఫీవర్ వస్తే హై ఫీవర్, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.

డేంగ్యూ జ్వరంను రక్త పరీక్ష ద్వారా కనుగొంటారు. జ్వరం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్వగా ఉంటుంది. 65శాతం మందిలో థ్రోంబోసైటోపినియా లోప్లేట్ లెట్ గా పిలుస్తారు.

డేంగ్యూ వైరస్ రక్తంలో ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో హెమటోక్రైట్స్ ను పెంచుతుంది. అలాగే ప్లేట్ లెట్ కౌంటన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్స్ సూచించిన పండ్లు

రక్తంలో ఉత్పత్తి అయిన హెమటో క్రైట్ లెవల్స్ ప్రమాదకరమైన అంతర్గత హెమరేజెస్ కు దారితీస్తుంది. ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉండి, హెమటో క్రైట్ లెవల్స్ కాటస్ట్రోఫీగా మారవచ్చు. శరీరంలో రక్తం తగ్గడం వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉండి.

నార్మల్ ప్లేట్ లెట్ కౌంట్ 150,000నుండి 450,000మైక్రోలీటర్స్ అంటే 150-450 ఉంటాయి. అదే విధంగా 150 కంటే తక్కువగా 30కి చేరితే ప్రాణానికే ప్రమాదం.

డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారా?ఐతే ఇవి తినండి!

ఎప్పుడైతే పీరియడిక్ ఫీవర్ తో బాధపడుతారో, చర్మంలో దద్దుర్లు , వాంతులతో బాధపడుతారు. దాంతో డాక్టర్లు ప్లేట్ లెట్ కౌంట్ టెస్ట్ ను సూచిస్తారు.

లో ప్లేట్ లెట్ కౌంట్ బ్లీడింగ్ కు దారితీస్తుంది. ముక్కు నుండి రక్తస్రావం, ఎక్కువ తలనొప్పి, రెక్టమ్ నుండి రక్తస్రావం, కండరాల్లో నొప్పి, మలంలో రక్తం లక్షణాలు కనబడుతాయి. కొంత మంది మహిళల్లో పీరియడ్స్ లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది.

కాబట్టి, డేంగ్యూ ఫీవర్ లక్షణాలునివారించుకోవడానికి, బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్లు కొన్ని పండ్లను సూచించారు..

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో పాలీ ఫినోలిక్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీమైక్రోబయల్ యాక్టివిటి కలిగి ఉంటాయి. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్ ను ప్రతి రెండు గంటలకొకసారి తాగాలి. దానిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో వ్యాధినిరోధకత పెంచడానికి సహాయపడుతుంది. ఇది లో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుతుంది.

దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్ ను కాంబినేషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి ప్లేట్ లెట్ కౌంట్ ను పంెచి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి 300ఎంఎల్ జ్యూస్ తాగితే ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.

డెంగ్యూ మహమ్మారిని గుర్తించే 10 లక్షణాలు

కివి ఫ్రూట్ :

కివి ఫ్రూట్ :

కివి పండ్లలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫొల్లెట్, పొటాషియంలు అధికంగా ఉన్నాయి.ఈ పండులో యాంటీఆక్సిడెంట్, ఫైబర్ ఎక్కువ. కివి ఫ్రూట్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కివి పండ్లలో ఉండే పొటాషియం, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అదే విధంగా విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో ఉండే మైక్రోన్యూట్రీషియన్ప్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఫ్రూట్ లో విటమిన్స్ , ఫొల్లెట్, ఫైబర్, పొటాషియంలు ఎక్కువ. బొప్పాయిలో ఉండే న్యూట్రీషియన్ బెనిఫిట్స్ విటమిన్ సి ని పెంచుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. దాంతో డేంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బొప్పాయి గాయాలను మాన్పుతుంది. డేంగ్యూ ఫీవర్ ను తగ్గిస్తుంది. ప్లేట్ లెట్స్ పునరుత్పత్తి చేస్తుంది.వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది.

English summary

Doctors Recommend These Fruits To Increase Blood Platelets

There are few fruits that helps in increasing the blood platelet count. Know about these fruits here on Boldsky.
Please Wait while comments are loading...
Subscribe Newsletter