చిగుళ్ళ వ్యాధి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యకు కారణం కావొచ్చు, పరిశీలించండి!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఒక పిల్లడిగా మీ తల్లిదండ్రులు మీరు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకు౦టున్నారా లేదా అని అడుగుతూ ఉంటారు - ఉదయం ఒకసారి, పడుకునే ముందు. వీటన్నిటి వెనక కారణం ఉంది. ప్రతిరోజూ పళ్ళు తోముకోవడం వల్ల మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, చిగురు వ్యాధి, నోటిపూత, పన్ను నొప్పి వంటి పళ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా నివారించవచ్చు.

నోటి శుభ్రతను సరిగా పాటించకపోతే, ఇతర ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చిగురు వ్యాధికి దారితీసే కొన్ని బాక్టీరియాలను కొత్త అధ్యయనం గుర్తించింది, ఇది గొంతు నుండి పొట్టవరకు ఉండే గొట్టంపై ప్రభావం చూపించి ఎసోఫాగల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది కూడా.

ఈ అధ్యయన సమయంలో, ఓరల్ మైక్రోబయోటా తదనుగుణమైన ఎసోఫగల్ క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉందని పరిశోధకులు పరీక్షించారు.

పరిశోధకులు అధ్యయనం కోసం US లో 122,000 మందిని పరిగణనలోనికి తీసుకున్నారు. పాల్గొన్నవారి నోటి ఆరోగ్యం గురించి కొన్ని దశాబ్దాల పాటు గమనించారు.

సాధారణ చిగురు వ్యాధితో సంబంధం ఉన్న రెండు బాక్టీరియా స్పెసీస్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

gum disease health risk

ఎసోఫగల్ క్యాన్సర్ అంటే ఖచ్చితంగా ఏమిటి?

ఎసోఫగల్ క్యాన్సర్ అనేది ఒక ట్యూబ్ కి వచ్చే క్యాన్సర్ ఇది గొంతు నుండి పొట్ట వరకు ఉంటుంది (ఒసోఫాగస్).

ఎసోఫగల్ క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్ లలో ఎనిమిదోది, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణానికి ఆరవ ప్రధాన కారణమని న్యూ యార్క్ యూనివర్సిటీ (NYU) స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ జియాంగ్ ఆన్ చెప్పారు.

ఈ వ్యాధి గురించిన చెడ్డ విషయం ఏమిటంటే దీన్ని ప్రాధమిక దశలో కనిపెట్టలేకపోవడం, ఐదు సంవత్సరాల మనుగడ రెట్లు ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 25 శాతం వరకు ఉంటాయి.

ఎసోఫగల్ క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్. ఎసోఫగల్ క్యాన్సర్ లలో ఎసోఫగల్ అదేనో కార్సినోమా (EAC), ఎసోఫల్ స్క్వామస్ సెల్ కార్సినోమా (ESCC) అనేవి అత్యంత సాధారణ రకాలు.

అధిక స్థాయి కల టన్నెరెల్లా ఫోర్సీతియా బాక్టీరియా 21 శాతం EAC ప్రమాద పెరుగుదలతో సంబంధం కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. పోర్ఫిరోమోనాస్ జింజివలిస్ బాక్టీరియా ESCC అధిక ప్రమాదంతో సంబంధం కలిగి ఉంది.

ఈ రెండు జాతుల బాక్టీరియా కు సాధారణ చిగురు వ్యాధితో సంబంధం ఉంది. కొన్ని రకాల ఓరల్ బాక్టీరియాలు ఎసోఫగల్ క్యాన్సర్ తక్కువ ప్రమాదానికి కారణమయ్యాయని అధ్యయనాలు నిరూపించాయి కూడా.

ఉదాహరణకు, నీసేరియా బాక్టీరియా EAC ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నీసేరియా పరిశీలనలో రక్షిత ప్రభావం కలిగిన కొన్ని బాక్టీరియాలు ఉన్నట్లు సూచిస్తుంది, ఈ బాక్టీరియా ఎసోఫగల్ క్యాన్సర్ అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశీలించడానికి భవిష్యత్తులో పరిశోధనలు జరుగుతాయని ఆన్ తెలిపారు.

ఈ అధ్యయనం క్యాన్సర్ పరిశోధనా జర్నల్ లో ఈమధ్యనే వెల్లడించింది.

gum disease health risk

ఎసోఫగల్ క్యాన్సర్ లక్షణాలు & సంకేతాలు:

ఎసోఫగల్ క్యాన్సర్ కి అనేక లక్షణాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైనది పొగత్రాగడం. దీనితోపాటు, నియంత్రణ లేని ఆసిడ్ రేఫ్లక్స్ ఎసోఫగల్ క్యాన్సర్ కి మరో అసాధారణమైన ప్రమాద కారకంగా ఉద్భవించింది.

ఎసోఫగల్ క్యాన్సర్ చాలా తాంత్రికమైనది, ప్రారంభ దశలో దీని లక్షణాలు, సంకేతాలు ప్రమాదకరంగా కనిపించవు. అయితే, సమస్య నియంత్రణ, అనుకోకుండా బరువు తగ్గడం, గుండేనొప్పి, అజీర్ణం లేదా గుండెలో మంట, దగ్గు లేదా గొంతు బొంగురు పోవడం వంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఇవి ఇసోఫగల్ క్యాన్సర్ కు ఉండే కొన్ని సాధారణ లక్షణాలు.

English summary

Gum Disease Can Cause Esophageal Cancer

Failing to maintain a good oral hygiene can also lead to other serious health issues as well. A new study has found that some bacteria that lead to gum disease may also increase the risk of esophageal cancer that affects the tube running from the throat to the stomach..
Story first published: Saturday, December 9, 2017, 15:00 [IST]
Subscribe Newsletter