ఈ అలవాట్లు ఉంటే కిడ్నీ వ్యాధులు తప్పవు

Written By: Bharath
Subscribe to Boldsky

కిడ్నీ సంబంధించి వ్యాధులు చాలా వైలెంట్ గా ఉంటాయి. కానీ ఇవి సైలెంట్ వస్తాయి. రోజూ మనం తీసుకునే ఆహారాలు, మన అలవాట్లు మూత్రపిండాలకు సంబంధించిన రోగాలకు కారణం అవుతాయి. అసలు ఆ అలవాట్లు ఏమిటో ముందు తెలుసుకోవాలి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు గురయ్యాం అని తెలుసుకునేందుకు చాలామందికి చాలా టైమ్ పడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, కిడ్నీ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే మీరు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.

1. ఆల్కహాల్స్ తీసుకోవడం

1. ఆల్కహాల్స్ తీసుకోవడం

ఆల్కహాల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి. మద్యం మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీరు ఒకవేళ ఆల్కహాల్స్ తీసుకుంటూ ఉండే వాటిని వెంటనే తగ్గించండి. వీలైతే పూర్తిగా మానేయండి.

2. మూత్రానికి వెళ్లకుండా ఉండడం

2. మూత్రానికి వెళ్లకుండా ఉండడం

కొందరు వ్యక్తులు యూరిన్ వస్తూ ఉంటే కూడా బాత్రూమ్ కు వెళ్లరు. పనిలో నిమగ్నమై ఉంటారు. ఇలా మూత్రాన్ని బిగపట్టుకుని కూర్చొంటే ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. దీంతో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. అలాగే కిడ్నీల్లో రాళ్ళు కలిగించే ఒత్తిడిని రాళ్లు ఏర్పడుతాయి.

3. తగినంత నీటిని తాగకపోవడం

3. తగినంత నీటిని తాగకపోవడం

చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో వ్యర్థాలు శరీరంలో ఉండిపోతాయి. అవన్నీ మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల రెగ్యులర్ గా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

4. చక్కెర ఎక్కువగా తీసుకోవడం

4. చక్కెర ఎక్కువగా తీసుకోవడం

కొందరు రోజూ చక్కెర పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా మూత్రపిండాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందువల్ల చక్కెరను ఉపయోగించి తయారు చేసే పానీయాలు అంటే టీ, కాఫీ తదితర వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మేలు.

5. అధిక ఉప్పు తీసుకోవడం

5. అధిక ఉప్పు తీసుకోవడం

మనం తీసుకునే ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే అది కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరగడం వల్ల ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఈ ప్రభావం ఇతర అవయవాలపై పడి రక్తపోటు వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి.

6. నిద్రలేమి

6. నిద్రలేమి

దీర్ఘకాలిక నిద్ర లేమి సమస్య కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. సరైన సమయానికి సక్రమంగా నిద్రపోవాలి. లేదంటే కిడ్నీలకు ఆ ప్రభావం పడుతుంది.

7. విటమిన్స్, మినరల్ తక్కువగా తీసుకోవడం

7. విటమిన్స్, మినరల్ తక్కువగా తీసుకోవడం

మీరు రెగ్యులర్ గా తినే ఆహారాలు కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. విటమిన్లు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. విటమిన్లు, మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

8. కాఫీ ఎక్కువగా తీసుకోవడం

8. కాఫీ ఎక్కువగా తీసుకోవడం

కాఫీలోని కెఫిన్ కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కెఫెన్ ఒత్తిడిని పెంచుతుంది. అలాగే రక్తపోటును కూడా పెంచుతుంది. అలాగే కెఫెన్ అధికంగా తీసుకోవడం వల్ల కొంతకాలం తర్వార మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి.

9. పెయిన్ కిల్లర్

9. పెయిన్ కిల్లర్

కొందరుఎక్కువగా పెయిన్ కిల్లర్ ఉపయోగిస్తుంటారు. వీటిలో చాలా కెమికల్స్ ఉపయోగిస్తారు. ఇవి చాలా ప్రమాదకరం. పెయిన్ కిల్లర్ వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు ఉంటాయి. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అందువల్ల పెయిన్ కిల్లర్ ను ఎక్కువగా ఉపయోగించకండి.

10. మాసం ఎక్కువగా తినడం

10. మాసం ఎక్కువగా తినడం

కొందరు ఎక్కువగా రెడ్ మీట్ తింటుంటారు. అంటే బీఫ్, పోర్క్ వంటివి తింటూ ఉంటారు. మాసం కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. అందువల్ల రెండ్ మీట్ తక్కువగా తీసుకోవడం మంచిది.

English summary

habits that can seriously damage your kidneys

Here, we have listed some of the habits that can damage the kidneys. Read further to know about the common habits that damage your kidneys.