For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ 8 డైలీ హేబిట్స్ వలన మీ ఆయుష్యు తగ్గిపోయే ప్రమాదం ఉంది!

  |

  ఆరోగ్యమే మహాభాగ్యమనే సూక్తిని మన పూర్వికుల ద్వారా మనం తెలుసుకున్నాం. అదే విధంగా, నిజమైన వైభవం, నిజమైన బహుమతి అనేది ఆరోగ్యంపైన అలాగే దీర్ఘాయువుపైన ఆధారపడి ఉంటుందని ఒక ప్రముఖ ఆంగ్ల నటుడు అలాగే ఫిట్నెస్ బోధకుడు ఒకప్పుడు చెప్పుకొచ్చారు.

  పైన చెప్పిన సూక్తులకు మనలో చాలా మంది మద్దతిస్తారు. దీర్ఘాయువు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఏ జీవమైనా దీర్ఘాయువుని లేదా దీర్ఘ ఆయుర్ధాయాన్ని కోరుకుంటుంది.

  అన్ని రకాల జంతువులు అలాగే మనుషులు కూడా 'మనుగడ స్వభావా'న్ని సహజంగానే అలవరచుకున్నారు. ఈ స్వభావం చేత సహజంగానే మనం చేసే పనులు ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవనాన్ని దృష్టిలో పెట్టుకునే విధంగానే ఉంటాయి.

  Daily Habits Which Can Shorten Your Life Span

  చిన్నవయసునుంచే మనం మరణమనే అంశంపై ఒక అవగాహనను ఏర్పరచుకుంటాం. అలా మరణమనేది అనివార్యమని తెలిసినా మనలో మనకే తెలియకుండా మరణం విషయంపై ఒక రకమైన భయం దాగుంటుంది.

  యాక్సిడెంట్ల వలన అలాగే ప్రాణాంతక వ్యాధుల వలన కలిగే దుర్మరణాల వార్తలను మీడియా ద్వారా తెలుసుకోవడం ద్వారా మనకి మరణమంటే భయానకమైనదన్న భావన ఏర్పడుతుంది.

  సగటు మానవ జీవితకాలం 80 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ మధ్యలో ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసినదే.

  మనందరం సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితాన్నే ఆశిస్తాము.

  అయితే, నయం చేయలేని దీర్ఘకాల మానసిక లేదా శారీరక అనారోగ్యానికి గురయినప్పుడు జీవితం మీద మమకారం తగ్గి ఎక్కువకాలం జీవించాలన్న భావన తగ్గవచ్చు!

  మీరీపాటికే గమనించి ఉంటారు, అనారోగ్యసమస్యలతో సతమతమయ్యే ఎంతో మంది వయోవృద్ధులలో ఎక్కువ కాలం జీవించాలన్న కోరిక కనిపించదు. అందువలన, వారు భారంగా రోజులు గడుపుకోవడం మనం గమనించవచ్చు.

  కాబట్టి, ఆరోగ్యకరమైన జీవితమే దీర్గాయువుకి పునాది. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడమంటే ఆరోగ్యంగా జీవించడమని అర్థం.

  అయితే, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమంత సులభతరమైన విషయమేం కాదు. ఎంతో అంకితభావంతో మనం కొన్ని జాగ్రత్తలు పాటించి మన దైనందిన అలవాట్లను మార్చుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితం మన సొంతమవుతుంది.

  ఇప్పడు, మన జీవితకాలాన్ని తగ్గించే మన రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకుందాం...

  మన జీవితకాలంపై దుష్ప్రభావాన్ని చూపించే ఆయా అలవాట్ల గురించి తెలుసుకుని వాటిని నివారించడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిద్దాం.

  అలవాటు#1: అర్థరాత్రి అల్పాహారం:

  అలవాటు#1: అర్థరాత్రి అల్పాహారం:

  అర్థరాత్రి ఆకలి వేస్తె మీరు మీ ఫ్రిడ్జ్ ని మొత్తం గాలించి ఏదైనా స్నాక్ ను తినడం గుర్తుతెచ్చుకున్నారా? అర్థరాత్రి అల్పాహారాన్ని తినే అలవాటు మీకుందా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఈ అలవాటు మీ జీవితకాలాన్ని తగ్గించవచ్చు.అర్థరాత్రి పూట తీసుకునే అల్పాహారం మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ఈ అలవాటు వలన మీ శరీరంలోని జీవక్రియ పనితీరు దెబ్బతింటుంది. దాంతో, అనేక అనారోగ్యాలకు మీ శరీరం నిలయమవుతుంది.

  అలవాటు#2. అమితంగా టీవీ చూడడం:

  అలవాటు#2. అమితంగా టీవీ చూడడం:

  మీరు టీవీ షోలను కానీ లేదా ఏవైనా ప్రోగ్రామ్స్ ని కానీ గంటలకొద్దీ చూస్తూ ఉంటారా? అయితే, మీరు టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఈ అలవాటు లైఫ్ స్పాన్ పై దుష్ప్రభావం కలిగిస్తుంది. అంతే కాకుండా, గంటలతరబడి టీవీ లేదా కంప్యూటర్ ని చూడడం వలన మీరు ప్రతికూల రేడియేషన్స్ కు గురవుతారు. దాంతో, కళ్ళు, మెదడుతో పాటు మొత్తం ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి, మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ వంద ఉన్నా కూడా మీరు టీవీ చూసే సమయానికి పరిమితులు విధించుకోవాలి. అలా ఈ అలవాటును మార్చుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.

  అలవాటు#3: ఉప్పును అధికంగా తీసుకోవడం:

  అలవాటు#3: ఉప్పును అధికంగా తీసుకోవడం:

  మీరు భోజనప్రియులా? ఉప్పును అధికంగా తీసుకునే అలవాటుందా? అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని చిక్కుల్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీ లైఫ్ స్పాన్ తగ్గే ప్రమాదం ఉంది. వీటిని తీసుకోవడం వలన, అధిక రక్తపోటు సమస్య ఎదురవుతుంది. దాంతో, గుండె జబ్బులు వేధిస్తాయి. ఈ జబ్బులు ప్రాణాంతకమైనవి. అందువలన, ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

  అలవాటు#4: పరిశుభ్రతను పాటించకపోవడం:

  అలవాటు#4: పరిశుభ్రతను పాటించకపోవడం:

  జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత లేదా కలుషితమైన వీధుల నుంచి ఇంటికి వచ్చాక యాంటీబాక్టీరియల్ సోపులతో మీ చేతులను శుభ్రపరచుకోకపొతే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, సరిగ్గా స్నానం చేయకపోయినా, లేదా ఇతర వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను పాటించకపోయినా వేలకొద్దీ క్రిములు మీ శరీరంలోకి ప్రవేశించి మీకు అనేకరకాలైన అనారోగ్యసమస్యలను పరిచయం చేస్తాయి. తద్వారా, మీ లైఫ్ స్పాన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

  అలవాటు#5: దంతపరిశుభ్రత లేకపోవడం

  అలవాటు#5: దంతపరిశుభ్రత లేకపోవడం

  న్యూయార్క్ లోని ఇటీవల పరిశోధన అధ్యయనం ప్రకారం, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం కూడా అనారోగ్యాలకు దారితీస్తుంది. ఫ్లాసింగ్ ను తప్పనిసరిగా చేసుకునే ఒక వ్యక్తి యొక్కఆయుర్ధాయం 6 సంవత్సరాలు పెరిగిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. అందువలన, ఫ్లాసింగ్ అనే ప్రక్రియను కూడా మనం పాటించే దంత సంరక్షణ పద్దతులలో చేర్చుకోవాలి. ఫ్లాసింగ్ వలన చిగుర్లకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. చిగుర్లవ్యాధులకు గుండెజబ్బులకు దగ్గరి సంబంధం ఉంది. అందువలన, చిగుర్లవ్యాధులు కూడా ప్రాణాంతకమైన గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదాన్ని సరైన దంత సంరక్షణ ద్వారా అరికట్టవచ్చు.

  అలవాటు#6: అసురక్షిత శృంగారం

  అలవాటు#6: అసురక్షిత శృంగారం

  ఎక్కువమందితో అసురక్షిత శృంగారాన్ని చేసేవారు తమ జీవితానికి అపాయం కొనితెచ్చుకున్న వారవుతారు. వారు హెపటైటిస్, హెచ్ ఐ వీ వంటి అనేకరకాలైన లైంగిక వ్యాధులకు గురయ్యే అవకాశం కలదు. అసురక్షిత శృంగారం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

  అలవాటు#7: గోళ్లు కొరకడం

  అలవాటు#7: గోళ్లు కొరకడం

  గోళ్లు కొరకడమనేది ప్రాణానికి ప్రమాదం తెచ్చేటటువంటి అలవాటులా కనిపించకపోయినా ఈ అలవాటుకి ఒక వ్యక్తి జీవితకాలాన్ని తగ్గించే గుణం ఉంది. గ్రోళ్ల మధ్యలో దాగున్న హానికరమైన బాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని పలచనచేయడం వంటి ప్రాణాంతక వ్యాధులకు గురిచేస్తుంది.

  అలవాటు#8: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం

  అలవాటు#8: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం

  బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వలన శరీరంలోని జీవక్రియ అలాగే రోగనిరోధక శక్తి మందగిస్తుంది. ఈ విషయం అనేక శాస్త్రీయ పరిశోధనలలో తేలింది. రోగనిరోధకశక్తితో పాటు జీవక్రియ మందగించినప్పుడు మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. ఆ విధంగా మీరు త్వరగా అస్వస్థతకు గురవుతారు. ఈ అలవాటు మీ లైఫ్ స్పాన్ పై దుష్ప్రభావం చూపుతుంది.

  English summary

  Daily Habits Which Can Shorten Your Life Span

  Wanting to live a long and healthy life is one of the main desires of all human beings. There are a few habits that we may be following on a daily basis, which we may think are harmless. However, these habits could reduce our life span. Have a look at what they are, here.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more