నల్లులు మీ ఆరోగ్యాన్ని ఎంతలా హాని చేస్తాయో తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

నల్లులు(బెడ్ బగ్స్) వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. ఎలుకలు మనల్ని ఎంత బాధపెడతాయో అందుకు సమానంగా మనల్ని బాధపెట్టే పురుగులు నల్లులు. నల్లుల శాస్త్రీయ పేరు "సీమెక్స్ లెక్చలరీస్ ". ఈ పురుగులు రాత్రిపూట మనిషి శరీరం నుండి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి మనం పడుకునే పరుపుల లోపల ఎక్కువగా కనపడుతుంటాయి.

ఒక నల్లి రక్తాన్ని పీల్చిన తర్వాత దాని శరీరం పరిమాణం ఎన్నో రేట్లు పెద్దది అవుతుంది. అది ఇంట్లో ఎక్కడైనా దాక్కొని వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోగలవు. ఎలాగైనా అవి బ్రతక గలవు. పరుపులలో, అరల లోపల, గోడల సందులో, ఇంటి మూలల్లో ఉండటానికి అవి ఎక్కువగా ఇష్టపడుతుంటాయి.

నల్లుల బెడదను వదిలించుకోవడానికి ఉత్తమ మార్గాలు

ఇల్లు పరిశ్రుభంగా లేకపోవడం వల్ల నల్లులు ఇంట్లోకి వస్తుంటాయని మనలో చాలా మంది భావిస్తుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. మీ ఇంటిని నల్లులు కేంద్రం గా మార్చడానికి అవి ఎక్కడ నుండైనా రావొచ్చు. ఉదాహరణకు, మీరు ఒక హోటల్ కు వెళ్లారు మీరు తీసుకున్న గదిలో నల్లులు ఉన్నాయి. అవి మీ బట్టలలో దూరి, లేదా మీ బ్యాగ్ లలో చేరి మీ ఇంట్లో చేరిపోయే అవకాశం ఉంది.

మీరు రైలు, విమానం లేదా బస్సు లో ప్రయాణించి మీ ఇంటికి చేరుకున్నారు. ఆ ప్రయాణ సమయంలో మీరు కూర్చున్న సీట్ లో నల్లులు ఉంటే, అవి మీతో పాటు మీకు తెలియకుండానే మీ ఇంటికి వస్తాయి. కాబట్టి మీ ఇంటి పరిశ్రుభ్రత గురించి మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సిన అవసరం లేదు.

బెడ్ బగ్స్(నల్లులు) నివారించడానికి 7 హోం రెమిడీస్

నల్లులు మరీ అంత ప్రమాదకరమైనవి కాకపోయినా వాటివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం....

ప్రతికూల ప్రభావం:

ప్రతికూల ప్రభావం:

నల్లులు మన శరీర ప్రక్రియ పై ప్రతికూల ప్రభావం చూపి మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంది. నల్లులను చూడగానే భయబ్రాంతులకు గురయ్యే అతి సున్నిత మనస్కులు, ఒక విపరీతమైన షాక్ కి లోనయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల రక్త పోటు అనూహ్యంగా పడిపోయి, గాలి పీల్చే ద్వారాలు సన్న పడి, ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతుంది.

అంటురోగం :

అంటురోగం :

నల్లులు కుట్టినప్పుడు విపరీతంగా దురద వేస్తుంది. మీరు ఆ ప్రాంతాన్ని మీ చేతులతో మరింత ఎక్కువగా గోకినప్పుడు మీ చర్మానికి ఉన్న రంద్రాల ద్వారా క్రిమికీటకాలు మీ శరీరంలోకి ప్రవేశించి అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మాములుగా నల్లులు మనం పడుకున్నప్పుడు కుడుతుంటాయి. అలాంటి సమయంలో మనకు తెలియకుండానే మనం ఆ ప్రాంతాన్ని గోకుతుంటాం.

శ్వాసకోశ సంబంధిత సమస్యలు :

శ్వాసకోశ సంబంధిత సమస్యలు :

నల్లులు వల్ల కలిగే అతి ముఖ్యమైన సమస్యల్లో ఇది ఒకటి. నల్లులు వాటి చర్మాన్ని, విసర్జకాలను, మిగతా క్రిములను ఇంటిలోనే వదిలి వేస్తుంటాయి. దీని వల్ల ఇంట్లో ఉన్న గాలి విషతుల్యమవుతుంది.

దీంతో కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆస్త్మా తో పాటు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిమల్ని అందరూ దూరంగా పెడతారు :

మిమల్ని అందరూ దూరంగా పెడతారు :

నల్లులు ఇంట్లో ఎక్కువ అవ్వడం వల్ల కలిగే విపరీత పరిణామం ఇది. మిమ్మల్ని సమాజంలో దూరంగా పెడతారు. దీంతో మీలో మీరే కుమిలిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో నల్లులు ఉన్నాయనే విషయం తెలిస్తే కాఫీ తాగడానికి కూడా మీ ఇంటికి రావడానికి ఎవ్వరు ఇష్టపడరు. దీనివల్ల మీరు సామాజిక జీవితాన్ని నష్టపోయే ఆస్కారం ఉంది.

ఇన్సోమ్నియా :

ఇన్సోమ్నియా :

మీ గదిలో గనుక ఎక్కువ నల్లులు ఉంటే, అవి మిమ్మల్ని నిద్రపోనియ్యవు. దీంతో మీరు నిద్రను కోల్పోతారు, రాత్రంతా మేల్కోవాల్సిన అవసరం పడుతుంది. నిద్రలేమితో బాధపడతారు. నల్లులు వల్ల మీరు ఇన్సోమ్నియా భారిన పడే ప్రమాదం ఉంది.

అనీమియా :

అనీమియా :

నల్లులు వల్ల అనీమియా రాదు, కానీ ఒక మనిషి సంవత్సరాల కొద్దీ నల్లుల భారిన పడితే అప్పుడు, అనీమియా లక్షణాలు ఆ వ్యక్తిలో పెరిగే అవకాశాలు ఎక్కువ.

ఆతురత :

ఆతురత :

నల్లుల వల్ల ఆతురత కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎప్పుడైతే మీ ఇల్లు నల్లులకు కేంద్రంగా మారుతుందో మీకు తెలియకుండానే మీలో ఆతురత, మానసిక ఒత్తిడి, ఆకలి సరిగ్గా కాకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం మరియు విసుగు చెందడం లాంటి శారీరిక, మానసిక అవలక్షణాలు మీలో పెరిగిపోతాయి.

అంతే కాకుండా నల్లులు మీ నిద్ర కి భంగం కలిగిస్తాయి, మీ చర్మం పై ఎక్కువ దురదను కలిగిస్తుంటాయి. మీలో ఒత్తిడిని పెంచి మీ వ్యాధి నిరోధక శక్తి పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాబట్టి నల్లులను మీ ఇంటి నుండి తరిమేయండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

English summary

How Bed Bugs Harm Your Health!

Are you aware of the harmful effects of bed bugs? Bed bug infestation is another scary thing after rat infestation. Read this!
Story first published: Friday, August 11, 2017, 8:00 [IST]
Subscribe Newsletter