రోజూ రాగి బాల్ లేదా రాగి సంగటి తింటే అనారోగ్యాలకు బాయ్.. బాయ్ ...

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మిల్లెట్ లేదా రాగులు అని సాధారణంగా రెగ్యులర్‌గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది . ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది మరియు బంక అనిపించదు. ఎవరైతే గ్లూటెన్ లోపంతో బాధపడుతున్నారో వారు ఈ ధాన్యాహారాన్ని తీసుకోవచ్చు. రాగులను అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో ఒకటిగా ఉంది. రాగులు చాలా పుష్టికరమైన ధాన్యం మరియు ఒక మంచి ఆరోగ్య నిర్వహణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

health benefits of ragi balls

రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వృద్ధులు, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు రాగులతో చేసిన వంటకాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు రాగులు బలాన్నిస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడంతో బరువు పెరగరు. ఆకలిని సక్రమంగా ఉంచే శక్తి రాగులకు ఉంది.

బియ్యం కంటే రాగుల్లో కార్పొహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికమే. అందుకే రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఏమాత్రం పెరగవు. రాగులను అంబలిగానూ, సంగటిగానూ, రొట్టెలుగానూ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేకూరుతుంది. రాగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెట్టే రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమంగా ఉంచుతుంది. వీటితో పాటు రాగులతో మరొకొన్ని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

#1 బరువు తగ్గడానికి :

#1 బరువు తగ్గడానికి :

రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. మరియు రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

#2 ఎముకల ఆరోగ్యం కోసం రాగి:

#2 ఎముకల ఆరోగ్యం కోసం రాగి:

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.

#3 మధుమేహగ్రస్తులకు:

#3 మధుమేహగ్రస్తులకు:

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

#4 హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి :

#4 హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి :

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాయపడుతుంది. దాంతో బ్లడ్ మరియు హార్ట్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడం వల్ల వివిధ రకాల హార్ట్ సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. రాగుల్లో ఉండే అమినో యాసిడ్స్ కారణంగా కాలేయంలో ఫ్యాట్ చేరకుండా నివారించడంతో పాటు, హైబ్లడ్ ప్రెజర్ ను , హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది.

#5 ప్రోటీన్ కు మంచి మూలం

#5 ప్రోటీన్ కు మంచి మూలం

రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

#6 అనీమియా(రక్తహీనత) ను నయం చేస్తుంది:

#6 అనీమియా(రక్తహీనత) ను నయం చేస్తుంది:

రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మూలకం. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది. రక్తహీనత వల్ల బలహీనంగా ఉన్న వారికి బలాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి బ్లడ్ లెవల్స్ ను నార్మల్ చేస్తుంది. శరీరంలో ఐరన్ లెవల్స్ ను పెంచుతుంది.

#7 జీర్ణశక్తిని పెంచుతుంది

#7 జీర్ణశక్తిని పెంచుతుంది

రాగుల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బౌల్ మూమెంట్ సాఫీగా జరుగుతుంది. అలాగే సోలబుల్, ఇన్ సోలబుల్ ఫైబర్ శరీరంలో రక్తప్రసరణకు సహాయపడుతుంది. రాగి ముద్దలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్దకం నివారించడానికి సహాయపడుతుంది. అయితే, పైల్స్, హెమరాయిడ్స్ కలిగిన వారు రాగి ముద్దను ఎక్కువగా తీసుకోకూడదు.

#8 కొత్తగా తల్లైన వారిలో పాల ఉత్పత్తికి సహాయపడుతుంది

#8 కొత్తగా తల్లైన వారిలో పాల ఉత్పత్తికి సహాయపడుతుంది

వీటిలో న్యూట్రీషియన్ అధికంగా ఉండటం వల్ల బాలింతల్లో పాలఉత్పత్తికి సహాయపడుతుంది. మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న స్త్రీల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్నంధించే టానిక్ వంటింది. అంతే కాదు కొత్తగా తల్లైన వారికి కావల్సిన ఐరన్, క్యాల్షియం, మరియు ఇతర అమినో యాసిడ్స్ ను అందిస్తుంది. ఇవి బేబీకి చాలా అసవరం.

#9 వయస్సును తగ్గిస్తుంది :

#9 వయస్సును తగ్గిస్తుంది :

మిల్లెట్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు మరియు పరిణతి వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. రాగి ముద్దను రోజూ తినడం వల్ల యంగ్ అండ్ యూత్ ఫుల్ గా కనబడుతారు. చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడకుండా చేస్తుంది. ఇది కణాల రిపేర్ కు సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా కనబడేలా చేస్తుంది.

#10 శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది

#10 శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది

రాగి ముద్ద వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు వేసవిలో వేడికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రాగుల్లో ఉండే ట్రెప్టోఫోన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది.

English summary

10 Incredible Health Benefits Of Ragi Balls/Mudde

Ragi balls are consumed with curry or just like that depending on your preferences. It is rich in carbohydrates and proteins that makes it a great weight loss food. It is a staple food of south India.Let's find out the benefits of Ragi balls and embrace it in our daily diet!
Story first published: Friday, December 29, 2017, 18:00 [IST]