చింతపండు పులుపు అయినా, ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాంబార్, రసం, పులియోగరే.. రెసిపీ ఏదైనా.. కాస్తంత చింతపండు పులుపు తగాలాల్సిందే. ఎలాంటి వంటకానికైనా.. చింతపండు.. విభిన్నమైన రుచిని అందిస్తుంది. చట్నీలు, కూరలు, రకరకాల వంటకాల్లో చింతపండుని పులుపు, తీపి ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు.

చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్ గా మారింది. అలాగే చింతపండు వంటకాలను గొంతు నొప్పి, వాపు, సన్ స్ట్రోక్, దగ్గు, జ్వరం నివారించడానికి ఉపయోగిస్తారు.

Health Benefits Of Tamarind (Imli) Fruit, Juice & Seeds

అయితే ఈ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్న చింతపండుని డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. డైలీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్ ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది సిట్రిక్ యాసిడ్ వంటిది. హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ ను ఇతర మొక్కల్లో కూడా కనుగొనడం జరిగింది. ఇది శరీరంలో ఎంజైమ్స్ ను గ్రహిస్తుంది. ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

చింతపండు గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ ని నివారిస్తుంది. అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. డయేరియాను కూడా నివారిస్తుంది.

పెప్పటిక్ అలర్స్ మరియు కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది

పెప్పటిక్ అలర్స్ మరియు కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది

చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. అలాగే హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు. అలాగే.. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉంటాయి. అలాగే పొట్టలో, ప్రేగుల్లో చిన్న పుండ్లు ఏర్పడి బాద కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది

హార్ట్ హెల్త్ కు మంచిది

చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.చెడు కొలెస్ట్రాల్ ఎల్ డిల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్ డిఎల్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఫ్యాట్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

క్యాన్సర్ నివారిణి

క్యాన్సర్ నివారిణి

చింతపండు ముఖ్యంగా చింత గింజల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ మరియు కిడ్నీ క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంది.

గాయాలను మాన్పుతుంది:

గాయాలను మాన్పుతుంది:

చింత పండులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు గాయాలను మాన్పడంలో సహాయపడుతుంది. అలాగే చింత గింజలను గాయాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. కేవలం పది రోజుల్లో ఉపశమనం కలుగుతుంది

 జలుబు, దగ్గు నివారిస్తుంది:

జలుబు, దగ్గు నివారిస్తుంది:

చింత పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల , వ్యాధినిరోధకతను పెంచుతుంది. దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. టామరిండ్ వాటర్ టీ రూపంలో తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుతుంది. మంచి ఫలితాల కోసం, అందులో పెప్పర్ జోడించాలి.

ఆస్త్మా నివారిస్తుంది:

ఆస్త్మా నివారిస్తుంది:

చింతపండులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు ఆస్త్మా నివారిస్తుందని రీసెంట్ గా ఒక పరిశోధనల్లో కనుగొన్నారు. ముఖ్యంగా అలర్జీక్ ఆస్త్మాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కాలేయానికి రక్షణ కల్పిస్తుంది:

కాలేయానికి రక్షణ కల్పిస్తుంది:

చింత పండు కాలేయ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. ఎవరైతే డ్యామేజింగ్ లివర్ తో బాధపడుతుంటారో వారికి చింత చిగురు బాగా సహాయపడుతుంది. రెగ్యులర్ డైట్ లో చింతచిగురును ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

క్యాలరీ రిచ్ డైట్ వల్ల ఫ్యాటీ లివర్ కు కారణం అవుతుంది. చింతచిగురు ఉడికించిన నీటి వల్ల కండీషన్ రివర్స్ అవుతుంది.

డయాబెటిస్ నివారిస్తుంది:

డయాబెటిస్ నివారిస్తుంది:

చింత గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఇవి ప్యాక్రియాటిక్ టిష్యులను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దాంతో డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో ఉండే ఆల్ఫా ఎమలైజ్ ఎంజైమ్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

English summary

Health Benefits Of Tamarind (Imli) Fruit, Juice & Seeds

Tamarind is packed with vitamins, especially vitamins B & C, antioxidants, carotene and minerals, such as magnesium and potassium. Hence, this mushy fruit is considered the storehouse of nutrients and has plenty of health benefits. Tamarind should be consumed in appropriate limits, else it could have some side effects as well.