For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవల్సిన కొన్ని వాస్తవాలు..!

అన్ని అలవాట్లకు మంచి లేదా చెడు కలగలిపి ఉంటాయి. పెఅతిరోజూ తులసి ఆకు తింటే అది కాన్సర్ ని నిరోధిస్తుంది. మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగిస్తే అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది.

By Lekhaka
|

అన్ని అలవాట్లకు మంచి లేదా చెడు కలగలిపి ఉంటాయి. పెఅతిరోజూ తులసి ఆకు తింటే అది కాన్సర్ ని నిరోధిస్తుంది. మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగిస్తే అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే యూరిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది!

కొన్ని ఆరోగ్య చిట్కాలు వెర్రిగా అనిపిస్తాయి కానీ దీర్ఘకాలంలో అవి బాగా పనిచేస్తాయి. కొన్ని అలవాట్లలో మంచి లేదా చెడు రెండూ కలగలిపి ఉంటాయి. అవి వాటి ప్రయోజనాలను దీర్ఘకాలంలో చూపిస్తాయి.

Health Facts You Don't Know

ఉదాహరణకు, ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కొన్ని రోజులు లేదా ఒకరోజు లేదా కొన్ని వారాలు మాత్రమే యాపిల్ తిని ఆపేస్తే దాని ప్రయోజనాలు పొందుతారని దానర్ధం కాదు.

అలాగే, ఎల్లప్పుడూ మొబైల్స్ ఎక్కువగా ఉపయోగించడం అనేది చాలా ప్రమాదకరం. కానీ దాని ప్రభావం ఒకరోజు లేదా రెండు రోజులకు కనిపించదు. దాని ప్రభావం తరువాత దశలో అనుభవిస్తాము. ఇక్కడ మీరు తప్పక తెలుసుకోవాల్సిన మరిన్ని ఆరోగ్య అంశాలు ఇవ్వబడ్డాయి...

యదార్ధం #1

యదార్ధం #1

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే, మీరు కాల్ వచ్చినపుడు ఎడమ చెవిని ఉపయోగించడం మంచిది ఎందుకంటే మెదడు కుడిచెవికి ఒక బిట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి.

అంతేకాకుండా, బ్యాటరీ తక్కువగా ఉన్నపుడు (10% కంటే తక్కువ) ఏ కాల్ ను తీసుకోవద్దు ఎందుకంటే ఆసమయంలో రేడియేషన్ 1000 రెట్లు అధికంగా ఉంటుంది.

యదార్ధం #2

యదార్ధం #2

మీరు ఒక పిల్ లేదా టాబ్లెట్ తీసుకునేటపుడు, వేసుకుని, కదలండి. కానీ టాబ్లెట్ తీసుకున్న తరువాత కూర్చోడం లేదా పడుకోవడం మంచిది కాదు. మందు తీసుకున్న తరువాత నడవడం లేదా ఏదైనా శారీరిక శ్రమ (ఆరోగ్యం సహకరిస్తే) చేయడం మంచిది.

యదార్ధం #3

యదార్ధం #3

స్ట్రాబెర్రీలు చాలా రుచికరమైనవి, కానీ అవి యూరిక్ ఆమ్లాన్ని తటస్ధం చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని చాలామందికి తెలీదు. వారానికి మూడుసార్లు ఒక గ్లాసు జ్యూస్ తీసుకుంటే చాలా సహాయపడుతుంది.

యదార్ధం #4

యదార్ధం #4

మనం కాఫీకి ప్రాధాన్యతను ఇస్తాం. కానీ వయసులో ఉన్నపుడు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగితే ముసలితనంలో ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించ వచ్చు!

యదార్ధం #5

యదార్ధం #5

మనం మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాము. అందుకని, ఏ సమయంలోనైనా మంచినీళ్ళు తాగొచ్చు. కానీ పగలు ఎక్కువ నీరు తాగి, రాత్రి తక్కువ నీరు తాగితే అరుగుదలకు చాలా మంచిది.

యదార్ధం #6

యదార్ధం #6

రోజుకొక యాపిల్ తింటే వైద్యునికి దూరంగా ఉండొచ్చు అంటాము. కానీ రోజుకు ఒక తులసి ఆకు తింటే కొన్ని రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా, రోజుకొక నిమ్మకాయ తీసుకుంటే కొవ్వు సముదాయాన్ని దూరం చేయవచ్చు. కానీ ఇలాంటి చిట్కాలు నిజంగా పనిచేయాలి అంటే, ప్రతి ఒక్కరూ అతి చిన్న వయసు నుండే వీటిని అలవాటుగా మార్చుకోవడం అవసరం.

యదార్ధం #7

యదార్ధం #7

ఏ ఆహరం మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది? సరే, చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ మీద దాడిచేసి వయసుని తగ్గిస్తుంది. అంతేకాకుండా, అది మీ నరాల మీద కూడా తేలిక ప్రభావం కలిగి ఉంటుంది.

యదార్ధం #8

యదార్ధం #8

ప్రతిరోజూ ఆకుకూరలు తింటే అది మీ రక్తపోటును తగ్గించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, చిగుళ్ళు, పళ్ళు ఆరోగ్యంగా ఉండేట్టు కూడా చేస్తుంది.

యదార్ధం #9

యదార్ధం #9

చీజ్ ట్రిప్టోఫాన్ అనే పదార్ధాన్ని కలిగి ఉండడం వల్ల అది వత్తిడిని తగ్గించి,

ఇన్సొమ్నియా కి చికిత్సగా పనిచేస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

యదార్ధం #10

యదార్ధం #10

నిద్రపోవడానికి మంచి సమయం ఏది? సరే, రాత్రి 10 నుండి తెల్లవారి 4 మధ్య అని చాలా అధ్యయనాలు చెప్పాయి. కానీ చాలామంది రాత్రి 12 వరకు ఉండి ఉదయం 8 లేదా 9 కి లేస్తారు! ఈ అలవాటు ప్రభావం దీర్ఘకాలంలో చూపిస్తుంది!

English summary

Health Facts You Don't Know

Health Facts You Don't Know,All habits whether good or bad have a cumulative effect. Eating a basil leaf daily prevents cancer. Using mobile phones too much affects the brain. Eating strawberries everyday can reduce uric acid!
Desktop Bottom Promotion