ఇఫ్తార్ విందులో హెల్తీ డ్రింక్స్: ఇవి కళ్లు తిరగడం నివారించి, ఇన్ స్టాంట్ ఎనర్జీనిస్తాయి

Posted By:
Subscribe to Boldsky

ఇఫ్తార్ విందులో హెల్తీ డ్రింక్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి..పవిత్ర రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులు ప్రత్యేకత ను చాటుకుంటాయి. ఉపవాసానికి ముందు సహెర్‌ చేయడాన్ని సున్నత్‌ అంటారు. మగ్రిబ్‌ నమాజ్‌కు ముందు ఉపవాసాన్ని విరమిస్తు తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్‌ అంటారు. పవిత్ర రంజాన్‌లో ఇఫ్తార్‌ విందులు ప్రత్యేకతను చాటుకుంటాయి. ప్రేమ, అనురాగ అప్యాయతలతో ఈ మాసం మొదలు నుంచి నెలఖరు వరకు ఇఫ్తార్‌ విందులు నిర్వహించి హిందూ, ముస్లిం తేడా లేకుండా మిత్రులను, శ్రేయోభిలాషులను ఆహ్వానిస్తారు. ముస్లిం సోదరులు పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా తమకు ఉన్నదాంట్లోనే ఇఫ్తార్ విందును నిర్వహిస్తుంటారు.

రంజాన్ మాసంలో ఈ పొరపాట్లు చేసారంటే మీకే నష్టం

నిజాం దర్పణానికి నిదర్శనంగా, సంప్రాదాయంగా ప్రత్యేకంగా పసందైన వంటకాలతో విందు భోజనం ఇఫ్తార్‌ విందులో ఏర్పాటు చేస్తారు. ఈ విందుకు కాయగూరలు, మసాలా దినుసులతో వండిన పసందైన వంటకాలను ఆస్వాదించడం ప్రత్యే కత. అసఫ్‌జాహిలే కాదు అంతకు ముందు గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌షాహిల కాలంలో కూడా దినుసులు వేసి వండిన మాంసాహార వంటకాలతో విందు భోజనాలు చేయడం నవాబులకు సంప్రదాయం.

ఇఫ్తార్ విందులో హెల్తీ డ్రింక్స్

సాధారణ కుటుంబాల్లో కూడా శుభా కార్యాలు, పండుగల సమయంలో బంధు మిత్రులను విందులకు ఆహ్వానించడం ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇలా పూర్వకాలం నుంచి అతిథులు గుర్తుంచుకునేలా రుచికరమైన వంటకాలను కొసరి కొసరి వడ్డించడం హైదరాబాదీల ప్రత్యేకత. ఎలాంటి కుల, మత బేధాలు లేకుండా అందరినీ ఒకే వరుసలో కూర్చోబెట్టి వంటకాలు వడ్డించడం ఈ విందు ప్రత్యేకత.

రంజాన్ మాసంలో అ కఠోరమైన ఉపవాస దీక్షలు చేసే ముస్లీములు ఆరోగ్యాన్ని, మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ మాసంలో ఎంపిక చేసుకునే ప్రతి ఆహారపానీయాలను పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రంజాన్ మాసంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం, సమయపాలన లేకుండటం వల్ల చాలా మందిలో మలబద్దకం, అజీర్తి మొదలగు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇటువంటి పరిస్థితిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పైల్స్ సమస్యకు దారితీస్తుంది.

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

అందువల్ల, ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలుండే వారు తప్పనిసరిగా మంచి ఆహార పానియాలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వొచ్చు.

మరి ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సమయంలో శరీరంలో శక్తిని కోల్పోకుండా, ఎనర్జింటిక్ గా ఉంచడానికి సహాయపడే కొన్ని హెల్తీ డ్రింక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

పాలు-డేట్స్ :

పాలు-డేట్స్ :

కొన్ని ఖర్జూరాలను తీసుకుని పాలలో వేసి 12 గంటలు నానబెట్టాలి. 12 గంటల తర్వాత డేట్స్ మరియు పాలను రెండింటినీ తీసుకోవడం ద్వారా ఉపవాసం బ్రేక్ చేయవచ్చు. అదే సమయంలో శరీరానికి కావల్సిన ఎనర్జీని పొందుతారు . బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తాయి.

 ఆప్రికాట్ జ్యూస్ :

ఆప్రికాట్ జ్యూస్ :

ఆప్రికాట్ జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ మరియు విటమిన్ ఎ' లు పుష్కలంగా ఉన్నాయి. ఆప్రికాట్ ఫ్రూట్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో అతి సులభంగా కరుగుతుంది. పోషకాలు చాలా సులభంగా శరీరానికి అందుతాయి. ఇవి జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

మింట్ లెమనేడ్ :

మింట్ లెమనేడ్ :

ఒక గ్లాసు నీళ్లు తీసుకుని, అందులో ఒక పుదీనా ఆకులను గుప్పెడు వేయాలి. తర్వాత నిమ్మరసం జోడించాలి. వీటిని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ అమేజింగ్ హెల్త్ డ్రింక్ ను ఇఫ్తార్ సమయంలో తీసుకోవాలి. ఈ హెల్త్ డ్రింక్ లో విటమిన్ సి, ఫైబర్, మింట్ , లెమనేడ్ బాడీ రిఫ్రెష్ చేస్తుంది. ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది.

రంజాన్ స్పెషల్ నాన్ వెజ్ రిసిపిలు

 బనానా మిల్క్ షేక్ :

బనానా మిల్క్ షేక్ :

అరటి పండ్లలో పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్ సి మరియు బి6లు అధికంగా ఉన్నాయి. ఇందులో కొలెస్ట్రాల్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకు మీరు రెండు అరటి పండ్లు తీసుకుని, ముక్కలుగా చేసి జ్యూసర్ లో వేయాలి. అలాగే ఒక గ్లాసు పాలు కూడా వేసి బ్లెండ్ చేయాలి. అంతే బనానా మిల్క్ షేక్ రెడీ. ఇఫ్తార్ సమయంలో ఈ మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

బాదం షేక్ :

బాదం షేక్ :

5-10బాదంలను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం పైపొట్టు తీసి, ఒక గ్లాసు పాలను మిక్సీ జార్ లో వేసి, బాదం, తేనె వేసి గ్రైండ్ చేయాలి. మరింత రుచికరంగా ఉండాలంటే ఒకటి రెండు యాలకలను కూడా వేసి బ్లెండ్ చేయాలి. అంతే బాదం మిల్క్ షేక్ రెడీ. ఇఫ్తార్ సమయంలో దీన్ని సేవిస్తే ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు.

ఆపిల్ మరియు టమోటో జ్యూస్ :

ఆపిల్ మరియు టమోటో జ్యూస్ :

ఆపిల్-టమోటో జ్యూస్ లో విటమిన్స్, ఐరన్, మరియు ఫైబర్ కంటెంట్ అధిక ఉంటుంది. టమోటో మరియు ఆపిల్ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి, నిమ్మరసం , తేనె మిక్స్ చేసి బ్లెండ్ చేయాలి. ఇఫ్తార్ సమయంలో దీన్ని తీసుకోవాలి.

వాటర్ :

వాటర్ :

ఉపవాసం విరమించుకోవడానికి ఒక గ్లాసు వాటర్ ను మించిన డ్రింక్ మరొకటి లేదు. నీరు తాగిన వెంటనే రిఫ్రెషింగ్ అవ్వడం మాత్రమే కాదు, శరీరానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది. ఇది ఎనర్జీని కూడా అందిస్తుంది.

English summary

Healthy Drinks For Iftar That Will Help Prevent Dizziness & Energize You in Telugu

Healthy Drinks For Iftar That Will Help Prevent Dizziness & Energize You,The holy month of ramzan or ramadan is here. During this holy month Muslims all across the world observe intermittent fasting. They observe fast the whole day and eat only before dawn and after sunset.
Subscribe Newsletter