For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సాధారణ జలుబు, దగ్గును నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

  By Sindhu
  |

  సంవత్సరంతా ఒకే విధంగా ఉండదు. ప్రతి మూడు నెలలకొక సారి వాతావరణంలో మార్పులు సహజం, ఎండాకాలం, వర్షకాలం, ఆకురాలే కాలం, శీతాకాలం ఇలా వివిధ రకాలా సీజన్స్ ఉన్నాయి. వాతావరణంలో మార్పులను బట్టి, శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా వేగంగా మార్పులు కనబడుతాయి. ఎక్కువ చలి వల్ల శరీరం తట్టుకోలేని విధంగా చలి, జలుబు, దగ్గు వంటి సమస్యల కనబడుతాయి. జలుబు, దగ్గు అత్యంత సాధారణ సమస్య. జలుబు దగ్గు ఉన్నప్పుడు, చీకాకు , గొంతులో నొప్పి, అసౌకర్యం , మింగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

  Herbs That Help Fight Cold And Flu Instantly

  ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని వెంటనే తగ్గించుకోవాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవ్వడంతో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎన్ని మందులు వాడినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అసలు వదిలిపెట్టవు. పిల్లల విషయంలో ఇవి మరీ ఇబ్బంది పెడుతుంటాయి. స్కూల్లో ఒకరిని ఒకరు తాకడం, దగ్గరగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది. దాంతో పాటు సైనస్, కఫం, గొంతునొప్పి ఎక్కువగా వ్యాపిస్తాయి.

  ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయకపోతే... చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినా త్వరగా వదిలిపెట్టవు. కాబట్టి వీటికి ట్యాబ్లెట్ల కంటే.. వంటింట్లో ఉండే ఔషధాలు మంచి ఫలితాన్నిస్తాయి. త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. శీతాకాలంలో వచ్చే సాధరణ వ్యాధులైన జలుబు దగ్గు నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.

   తులసి:

  తులసి:

  తులసి హెర్బ్, ఈ మూలిక జలుబు దగ్గును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని తులిసి ఆకులను నోట్లో వేసుకుని తిడనం వల్ల కామన్ కోల్డ్, కఫ్ , ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుంది. బాడీ ఉష్ణోగ్రతను నార్మల్ గా ఉంచుతుంది. కాబట్టి రెగ్యులర్ గా తులసిని తినడం మంచిది.

   మిరియాలు:

  మిరియాలు:

  బ్లాక్ పెప్పర్ దగ్గు, జలుబును నివారించడంలో గ్రేట్ రెమెడీ. ఒక టీస్పూన్ తేనె ఉదయం, రాత్రి నిద్రించే ముందు తింటే గొప్ప రిలీఫ్ ఉంటుంది.

  దాల్చిన చెక్క:

  దాల్చిన చెక్క:

  కొద్దిగా దాల్చిన చెక్క నూనెను తేనెలో మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇది గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.దాల్చిన చెక్క శరీరంను వెచ్చగా ఉంచుతుంది. మరియు మ్యూకస్ ఏర్పడకుండా చేస్తుంది.

  యూకలిప్టస్ ఆయిల్ :

  యూకలిప్టస్ ఆయిల్ :

  యూకలిప్టస్ ఆయిల్ దగ్గు , జబులు నివారించడంలో ఎఫెక్టివ్ రెమెడీ, బ్రొంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్స్ ను నివారిచండంలో కూడా గొప్పగా సమాయపడుతుంది. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను హాట్ వాటర్ లో మిక్స్ చేసి ఆవిరి పట్టాలి. ఇది సైనస్ ను క్లియర్ చేస్తుంది. అలాగే కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ ను ముక్కు, ఫోర్ హెడ్ , గొంతుకు అప్లై చేసి మర్ధ చేయాలి. నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

  అల్లం:

  అల్లం:

  ఈ అల్లంలో ఔషద విలువలు అపరిమితంగా ఉంటాయి. అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి,. అల్లం గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చాలా మంది సాధరణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వాటి నివారణకు ఈ అల్లం రూట్ ను ఔషదంగా తయారు చేసుకొని లేదా టీలో అల్లం చేర్చి బాగా మరింగించి సేవిస్తుంటారు.

  చికెన్ సూప్:

  చికెన్ సూప్:

  చాలా మంది దీన్ని నేచర్ పెన్సిలిన్ అంటుంటారు. వ్యాధి నివారణ శక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. వేడిగా ఉండే చికెన్ సూప్ శ్వాసనాళాల్లో గాలిపోవడానికి అడ్డుపడుకుండా సహాయపడుతుంది. అదనపు శక్తిని పొందడానికి మరియు మంచి టేస్ట్ కోసం ఈ సూప్ లో కొద్దిగా వెజిటేబుల్ ముక్కలను మరియు వెల్లుల్లి ముక్కలను చేర్చాలి.

  వెల్లుల్లి:

  వెల్లుల్లి:

  వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, ప్లూ, కోల్డ్ వంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైలీ డైయట్ లిస్ట్ లో ఈ వెల్లుల్లిని చేర్చుకోవచ్చు.

  తేనె:

  తేనె:

  తేనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. సీజనల్ గా వచ్చే వ్యాదుల నివారణకు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఒక కప్పు వేడి నీళ్ళలో తేనె మిక్స్ చేసి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. లేదా రాత్రి నిద్రించడానికి ముందు ఒక టీస్పూన్ తేనె తినాలి.

  English summary

  Herbs That Help Fight Cold And Flu Instantly

  Cold and flu come visiting us during seasonal changes and sometimes come without any warning. These leave us with dampened spirits, body ache, little energy to carry on with our day to day work and leave us drained out.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more