For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంజూర రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి 10 ఖచ్చితమైనకారణాలు ..!!

By Lekhaka
|

సీజన్‌లో దొరికే ఏ పండు అయినా మంచిదే! కాని అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాలగని. బజార్లలో తోపుడుబండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి.

రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. అత్తిపండునే హిందీలో అంజీర్‌ అని ఇంగ్లీష్‌లో పిగ్‌ అనీ పిలుస్తారు. ఆకర్షణీయమైన రంగూ రూపంగానీ, ఆహా అనిపించే రుచిగానీ అంజీర్‌కు లేవు. అందుకే అవి మార్కెట్లో కనిపించినా పెద్దగా పట్టించుకోం. డ్రైఫ్రూట్స్‌ డబ్బాలోనూ అది తప్ప మిగిలినవన్నీ ఖాళీ చేస్తాం. రూపం నచ్చకోలేక నిండా గింజల వల్లో చాలామంది వీటిని ఇష్టపడరు.

కానీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. పాలు కలిపి చేసే జ్యూస్‌కి అంజీర్‌ని (ఎండుదయినా, పండుదయినా సరే) మించిన కాంబినేషన్‌ మరొకటి లేదు. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలూ అందుతాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అంజీర్‌ను ఎండురూపంలో గానీ, పండుగా గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. జ్వరం వచ్చి తగ్గిన వెంటనే రెండు అంజీర్‌లు తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి రెండూ వస్తాయి.

వ్యాధుల్ని నిరోధించడమే కాదు, నివారించేందుకూ దోహదపడతాయి. శారీరక, మానసిక సమస్యల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్‌ తరహా గడ్డల నివారణకి కూడా ఇవి మందుగా పనిచేస్తాయి. వీటితో పాటు మరికొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది మరి అవేంటో ఒక సారి చూద్దాం...

కాన్సర్:-

కాన్సర్:-

ఇందులో లభ్యమయ్యే పీచుపదర్ధం వలన హానికారక టాక్సిన్స్ ను వ్యర్ధ పదార్ధాలుగా బయటకు పంపివేయబడతాయి. దీనివలన ప్రేగులలో ఏర్పడే కొలోన్ కాన్సర్ ను నియంత్రించవచ్చు.

నోటిలో పుండ్లు, ఇన్ఫెక్షన్స్ :

నోటిలో పుండ్లు, ఇన్ఫెక్షన్స్ :

అత్తిపండ్లనుంచీ కారే పాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి. శరీరంలో వేడి: బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలిని సూచిస్తుంటారు. అజీర పండులో పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది .

పొట్ట సమస్యలు తగ్గుతాయి

పొట్ట సమస్యలు తగ్గుతాయి

అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.

లో కొలెస్ట్రాల్:-

లో కొలెస్ట్రాల్:-

అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:-

షుగరు పేషెంట్లకు దివ్యౌషధం:-

అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు. ఫిగ్స్ ఆకులు ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరించుటలో వీటి పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యడంలో ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఆకులలో లభిస్తుంది.

బలహీనత:

బలహీనత:

చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది: ఇందులోని ట్రిప్టోఫాన్‌ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ రాత్రిపూట రెండు, మూడు అత్తిపండ్లు తిని పాలు తాగితే మంచి నిద్రపడుతుంది.

అర్శమొలలు:

అర్శమొలలు:

అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది

 బరువును తగ్గిస్తుంది:

బరువును తగ్గిస్తుంది:

బరువు తగ్గడంలో పీచుపదార్థాలు చేసే మేలు అంతాఇంతా కాదు. అంజీర్‌లో అలాంటి పీచు ఎక్కువ. పేవుల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థపదార్థాల్ని పీచుపదార్థం శుభ్రం చేస్తుంది. బరవుతగ్గడం తేలికవుతుంది.

ఎముకలు పటిష్టం:-

ఎముకలు పటిష్టం:-

ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీరలో అధిక మోతాదులో ఉంది.

English summary

Here Are Top 10 Reasons To Include Fig Into Your Diet

Here Are Top 10 Reasons To Include Fig Into Your Diet,This juicy and nutritious fruit which is also delicious, is a repository of several health benefits. It is an incredible source of energy and can be consumed fresh and dry. So, if your question is, are figs healthy or not, read further to find out.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more