For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పారాసైటిక్ ఇన్ఫెక్షన్లకు ఎలా గురవుతారు? లక్షణాలు ఏంటి..

పారాసిటిక్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా సంక్రమిస్తుందిడీహైడ్రేషన్, కడుపు నొప్పి, అతిసారం, గ్యాస్ సమస్య మరియు అతిసారం వంటి సమస్యలు గయాడయాసిస్ అనే సమస్య వల్ల కలుగుతాయి.

By Lekhaka
|

పారసైట్స్ అనేవి ఇతర సూక్ష్మజీవులలో అలాగే జీవులలో ఏర్పరచుకుంటాయి. కొన్ని పారసైట్స్ అనేవి ఆవాసం ఏర్పరచుకున్న జీవులలో గమనించదగ్గ ప్రభావం చూపించవు. మరికొన్నైతే ఆవాసం ఏర్పరచుకున్న శరీరంలో పెరిగి, విస్తరించి పారాసిటిక్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.

ఈ ప్రపంచంలో ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఈ పారాసిటిక్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువ. పారాసైటిస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఇన్ఫెక్షన్ బారిన పడిన జీవి శరీర స్థితిని బట్టి బయటపడతాయి. లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే ట్రైకోమోనియాసిస్ అనే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఎటువంటి లక్షణాలను చూపించదు.

Here Are Ways In Which You Might Get A Parasitic Infection

పారాసిటిక్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా సంక్రమిస్తుంది
డీహైడ్రేషన్, కడుపు నొప్పి, అతిసారం, గ్యాస్ సమస్య మరియు అతిసారం వంటి సమస్యలు గయాడయాసిస్ అనే సమస్య వల్ల కలుగుతాయి. టోక్సోప్లాస్మోసిస్ వల్ల ఫ్లూ వంటి లక్షణాలతో పాటు కండరాల నొప్పులు, లింఫ్ నోడ్స్ వాపు కలగవచ్చు. ఈ లక్షణాలు దాదాపు ఒక నెల పాటు కనిపిస్తాయి.

మీ శరీరంలోకి ప్రవేశించాక ప్రోటోజా అనే ఏక-కణ జీవి మీ శరీరంలో నివసిస్తూ విస్తరిస్తాయి. ప్రోటోజా వల్ల గయార్డయాసిస్ వంటి వ్యాధులు కలుగుతాయి. హెల్మీన్త్స్ అనేవి బహుళ కణ జీవులు. ఇవి మీ శరీరంలో ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఎక్టోపారసైట్స్ అనేవి బహుకణ జీవులు. ఇవి మీ చర్మంపై నివసిస్తూ చర్మాన్ని భుజిస్తాయి.

అనేక మార్గాల ద్వారా పారసైట్స్ మీ శరీరంలో ప్రవేశిస్తాయి.

కలుషిత ఆహారం అలాగే పానీయం త్రాగడం వలన:

కలుషిత ఆహారం అలాగే పానీయం త్రాగడం వలన:

ప్రయాణాలలో సాధారణంగా కలుషిత ఆహారాన్ని అలాగే పానీయాలను తీసుకోవడం జరుగుతుంది. కలుషిత ఆహారాన్ని అలాగే పానీయాలను సేవించడం ద్వారా పారసైట్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. శుభ్రమైన ఆహారాన్ని అలాగే శుభ్రమైన నీటిని తాగడానికే మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లి మలవిసర్జన వలన:

పిల్లి మలవిసర్జన వలన:

మీ ఇంట్లో పిల్లి ఉంటే మీరు పిల్లి మలవిసర్జన శుభ్రపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పారసైట్స్ వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గర్భస్థ శిశువు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

దోమల వలన:

దోమల వలన:

మిగతా దేశాలకన్నా ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాలలో దోమల వల్ల పారాసైటిక్ ఇన్ఫెక్షన్ల బారిన పడే రోగులు అధికం. మలేరియా అనేది దోమల వల్ల విస్తారంగా వ్యాపించే పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఎనాఫిలస్ దోమలు మలేరియా వ్యాప్తి చేసే దోమలు. ఈ దోమలు కుడితే మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువ.

తలలో పేలు:

తలలో పేలు:

స్కూల్ కెళ్లే పిల్లలు ఈ రకమైన పారాసైటిక్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తలలో పేలు అనేవి ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. స్కూల్ కెళ్లే పిల్లలు ఉన్నట్లయితే కుటుంబం మొత్తం ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.

English summary

Here Are Ways In Which You Might Get A Parasitic Infection

Parasites are organisms that live off other microorganisms or hosts. Some parasites do not noticeably affect their hosts. Others grow, multiply, or reside in the body of the host that makes their hosts sick, leading to a parasitic infection.
Desktop Bottom Promotion