For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ సమస్య గనుక అధికంగా ఉంటే, అది గుండె పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

By R Vishnu Vardhan Reddy
|

శరీరంలో జీవక్రియను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు సాధారణంగా థైరాయిడ్ చాలా అవసరం. ఇది శరీరంలోని అన్ని ప్రక్రియలను సాధారణంగా మరియు ఖచ్చితత్వంతో పని చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్లు ఎటువంటి ఒడిదొడుకులకు లోనైనా అది చాలా ప్రమాదకరంగా మారుతుంది మరియు శరీరం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం వయస్సు పైబడిన వృద్దులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో గనుక అవసరానికి మించి గనుక థైరాయిడ్ హార్మోన్ ఉన్నట్లయితే లేదా హైపర్ థైరాయిడిజం బాధితులైతే ధమని సంబంధిత(ఆర్టరీ) గోడలు మందంగా మరియు గట్టి పడటంతో గుండె సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అతి ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంధులలో థైరాయిడ్ గ్రంధి కూడా ఒకటి. ఈ గ్రంధి వల్ల జీవక్రియ పనులన్నీ సజావుగా జరుగుతాయి. ముఖ్యంగా ఆహరం అరుగుదల, నిద్రను సక్రమంగా నియంత్రించటం మరియు బరువు ని నిర్వహించటం లాంటి ముఖ్యమైన విషయాల్లో థైరాయిడ్ గ్రంధి ముఖ్యపాత్రను పోషిస్తుంది.

థైరాయిడ్ గ్రంధి గనుక అనారోగ్యం భారిన పడితే, అటువంటి సమయం లో అది దాని యొక్క పనితీరు ఫై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది,అంతే కాకుండా శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

High Thyroid Hormone Can Be Risky For Your Heart Says Research

" థైరాయిడ్ హార్మోన్ లో ఉన్న FT4 ని కొలవటం ద్వారా వ్యక్తుల్లో అథెరోస్క్లెరోసిస్(ధామలి కాఠిన్యం) భారిన పడే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని" నెథర్లాండ్స్ కు చెందిన ఒక ప్రముఖ నిపుణుడు చెప్పాడు.

విపరీతంగా చెమటలు పట్టడం, బరువు లో విపరీతమైన హెచ్చు తగ్గులు ఏర్పడటం,అలసట ఎక్కువగా కలగటం, తరచూ ఆలోచన ధోరణి మారటం మరియు తీవ్ర ఒత్తిడికి లోనవ్వటం లాంటి లక్షణాలు మరీ ఎక్కువగా గనుక ఉంటే థైరాయిడ్ సమస్య ఉందని అర్థం. ఇలాంటి లక్షణాలు గనుక కనపడితే వెంటనే వైద్యున్ని సంప్రదించి అందుకు సంబంధించిన చికిత్సను వెంటనే తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయటం ద్వారా థైరాయిడ్ సంబంధిత సమస్యలను అధికమించవచ్చు.

థైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలుథైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలు

అందుచేత, థైరాయిడ్ గ్రంధి ని ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవటం ఉత్తమం.థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచే విషయంలో మనం తీసుకునే ఆహరం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.ఈ క్రింద చెప్పబడిన చిట్కాల ద్వారా థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యవంతమగా ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఎప్పుడు చూద్దాం.

1 . మీరు తీసుకునేఆహారం లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

1 . మీరు తీసుకునేఆహారం లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

మీరు గనుక థైరాయిడ్ సమస్యలతో గనుక బాధ పడుతున్నట్లైతే, ముఖ్యంగా హైపోథైరాయిడిజం బాధితులైతే, మీరు తీసుకునే ఆహరం కచ్చితంగా పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీకు గనుక హైపోథైరాయిడిజం గనుక ఉంటే అజీర్తి మరియు మలబద్ధకం కూడా బాధిస్తుంది.ఇలాంటి సందర్భాల్లో పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది. మీ చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు కొద్దిగా బలహీనంగా గనుక ఉంటే థైరాయిడ్ సమస్యలను నివారించడం లోను మరియు చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు లను ఆరోగ్యవంతంగా ఉంచడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం.

2 . ఒమేగా ౩ కొవ్వు ఆమ్లం ఉండాలి

2 . ఒమేగా ౩ కొవ్వు ఆమ్లం ఉండాలి

ఒమేగా - ౩ కొవ్వు ఆమ్లం ని మంచి కొవ్వుగా పరిగణిస్తారు. గింజలు, విత్తనాలలో ఉండే సాధారణ కొవ్వు మరియు నూనెలు థైరాయిడ్ ని ఆరోగ్యంగా ఉంచడం లో ఎంతగానో దోహదపడుతాయి. సరిపడినంత ఆలివ్ నూనె ను తగినంత మోతాదులో తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ లక్షణాలు మీలో ఉన్నట్లైతే థైరాయిడ్ ఉండవచ్చు...! ఈ లక్షణాలు మీలో ఉన్నట్లైతే థైరాయిడ్ ఉండవచ్చు...!

౩)ఐయోడిన్ ఉప్పుని వాడండి

౩)ఐయోడిన్ ఉప్పుని వాడండి

మీ థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత ఐయోడిన్ చాలా అవసరం. ఐయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ గ్రంధి పెద్దగా అయిపోయే అవకాశం ఉంది, దీని వల్ల కణితులు కూడా ఏర్పడవచ్చు. మార్కెట్ లో సులభంగా దొరికే ఐయోడిన్ ఉప్పుని వాడటం వల్ల ఈ సమస్యను అధికమించి థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

4 ) పళ్ళు తినండి

4 ) పళ్ళు తినండి

పళ్ళను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. శరీరానికి కావాల్సిన విటమిన్లు, కాల్షియమ్, పీచుపదార్థం మరియు పోషకాలు పళ్లలో ఉంటాయి. అనామ్లజనకాలు అధికంగా ఉండే చెర్రీస్, బ్లూ బెర్రీస్, వైల్డ్ స్ట్రాబెర్రిస్ మరియు క్రేన్ బెర్రీస్ లాంటి పళ్ళను తినటం వల్ల అవి థైరాయిడ్ గ్రంథులను కాపాడటం లో ఎంతగానో చైతన్య వంతంగా పనిచేసి వాటిని ఉత్తేజ పరుస్తాయి.

5 )కాయగూరలను తినండి

5 )కాయగూరలను తినండి

పీచుపదార్థాలు, ఖనిజాలు మరియు పోషకాలు కాయగూరల్లో ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల కాయగూరలను ప్రతి రోజు తినటం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. కాల్షియమ్ మరియు పోషకాలు ఎక్కువగా ఉండే బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ లాంటి వాటిని తినటం వల్ల థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

English summary

High Thyroid Hormone Can Be Risky For Your Heart Says Research

A new study has found that older adults with high thyroid hormone or hyperthyroidism can be more susceptible to risk of developing heart disease involving thickening and hardening of arterial walls.
Desktop Bottom Promotion