Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
సర్ ప్రైజ్ : వైధ్యానికి లొంగని వ్యాధులెంటికో..ఒక వేలితో చికిత్స..!
ఈ సాంకేతికత పేరు జిన్ షిన్ జ్యూట్సు. ఒక టెక్నిక్ అని చెప్పేకన్నా, దీనిని శక్తిని స్వీకరించే పద్ధతిగా పరిగణిస్తున్నారు. ఇది జీవశక్తిని మరియు దాని ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచుతుందని చెపుతారు.
ప్రధానంగా మెడిసిన్ అన్నది ప్రాచుర్యంలోకి రాకముందే, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక ఇతర వైద్యపద్ధతులు ఉన్నాయి.
ఈ సాంకేతికత పేరు జిన్ షిన్ జ్యూట్సు. ఒక టెక్నిక్ అని చెప్పేకన్నా, దీనిని శక్తిని స్వీకరించే పద్ధతిగా పరిగణిస్తున్నారు. ఇది జీవశక్తిని మరియు దాని ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచుతుందని చెపుతారు.

ఈ పద్ధతిని డిప్రెషన్, ఆందోళన, వెన్నునొప్పి, మెడనొప్పి మరియు PTSD కు చికిత్సగా చెపుతున్నారు. ఈ చికిత్సలో కేవలం వేళ్ళను మృదువుగా నొక్కడం లేదా వేళ్లు నిదానంగా పట్టుకుని ఉండటం జరుగుతుంది. ఆశ్చర్యపోతున్నారా? మరింత తెలుసుకోవాలంటే చదవండి ...

ఫాక్ట్ # 1
మీ చేతిలోని ప్రతి వేలు మీ శరీరంలోని ఇతర భాగాలకు అనుసంధానించబడినట్లు చెప్పబడింది. బొటన వ్రేలు - కడుపు, చూపుడు వ్రేలు - కిడ్నీలు, మూత్రాశయం; మధ్య వ్రేలు - పిత్తాశయము, లివర్; ఉంగరపు వ్రేలు - కోలన్, ఊపిరితిత్తులు; చిటికిన వ్రేలు - చిన్న ప్రేగు, గుండె మీ పామ్ మధ్యలో - బొడ్డు

ఫాక్ట్ #2
ప్రతి వేలు కూడా కొన్ని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది. బొటన వేలు - విచారం, చూపుడు వేలు - భయం, డిప్రెషన్, మధ్య వేలు - కోపం, విసుగు, ఉంగరపు వేలు - విషాదం, న్యూనత, దుఃఖం, చిటికెన వేలు - గర్వం, మీ అరచేయి మధ్యలో - సంతోషం

పద్ధతి
మీరు ఒక ప్రత్యేక భావోద్వేగానికి లోనయినప్పుడు, మొదట దానిని గుర్తించండి. 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని, లోతుగా శ్వాస తీసుకోండి . అది మిమ్మలిని ఒత్తిడికి గురి చేసే ఏ పరిస్థితి అయినా కావచ్చు.

స్టెప్ # 2
ప్రతి వేలు కూడా కొన్ని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఒక్కొక్క వేలును వేరే చేతితో సున్నితంగా నొక్కి పట్టుకోండి. ఉదాహరణకి మీరు చాలా నిరాశలో లేదా భయంతో ఉన్నప్పుడు చూపుడు వేలును పట్టుకోండి. మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూకిగాని, ఏదైనా విషయాన్ని అందరి ముందు వివరించవలసివొచ్చినప్పుడు, మీరు భయపడుతున్నట్లయితే సున్నితంగా మీ చిటికినవేలును పట్టి ఉంచండి.

స్టెప్ # 3
3-5 నిమిషాలపాటు సున్నితంగా వేలు పట్టుకోండి. లోతుగా శ్వాసను తీసుకోండి. మీరు స్ఫుటమైన సంచలనాన్ని అనుభవించే వరకు నొక్కి ఉంచండి. వేరే చేతి వేళ్లతో కూడా ఇదే పధ్ధతి పునరావృతం చేయండి.

ఫాక్ట్ # 3
ఇలా చేసిన తరువాత, మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు.

ఫాక్ట్ # 4
మన శరీరంలో రక్తప్రసరణ ఎలా జరుగుతుందో, అలానే మనకు కావలసిన శక్తి కూడా శరీరం అంతటా వ్యాపింపజేయబడింది. భారతీయ
యోగాలో కూడా 'ప్రాణ' లేదా 'జీవశక్తి' 'నాడుల' ద్వారా శరీరమంతా ప్రయాణం చేస్తుందని చెప్పబడింది. మనం జీవించటానికి, శ్వాస పీల్చటానికి, కదలటానికి ఇంధనం లేదా జీవశక్తి అవసరం. ఈ పధ్ధతి ద్వారా ఆ అడ్డంకిలను తొలగించే శక్తి కలుగుతుంది.



Click it and Unblock the Notifications
