అలర్ట్ : ప్రాణహాని కలిగించే ఆస్త్మా అటాక్ నివారించే అద్భుతమైన హోం రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.

కారణాలు: చల్లగాలి(చల్లటి వాతావరణం), దుమ్ము, ధూళి, పొగ, అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం), రసాయనాలు(ఘాటు వాసనలు), శారీరక శ్రమ, వైరల్ ఇన్‌ఫెక్షన్, పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు, శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్స్ వంటివి ఆస్తమాకు కారణమవుతున్నాయి.

ఆస్తమాను కంట్రోల్ చేయడానికి కొన్ని ఉత్తమ హోం రెమడీస్ ఉన్నాయి. ఉదాహరణకు, వేడినీటి ఆవిరిని పీల్చడం మరియు ఆస్తమాను నయం చేయడంలో తేనె కూడా ఒక బెస్ట్ పాపులర్ హోం రెమెడీ. మరియు మీరు తేనె మరియు నిమ్మరసంతో కూడా ఆస్తమాను నివారించుకోవచ్చు. ఇంకా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, తర్వాత ఉదయం తీసుకోవడం వల్ల ఆస్తమాను కంట్రోల్ చేయవచ్చు.

ఆస్తమాతో బాధపడే వారు క్రోనిక్ డిజార్డన్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సరైన ఆహారనియమాలను పాటించాలి. ఆరోగ్యకరమైన విటమిన్స్ ఎ, ఇ, సి మరియు బీటాకెరోటిన్ వంటివి గొప్పసహాయకారిగా పనిచేస్తాయి. ఆస్త్మాతో బాధపడే వారు ఈ క్రింది సూచించిన కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఫాలో అయినట్లైతే ఎంటనే ఉపవమనం కలుగుతుంది..

అల్లం:

అల్లం:

శ్వాస సమస్యలను నివారించడానికి బెస్ట్ హోం రెమెడీ అల్లం. ఇది ఆస్తమాను నివారిస్తుంది . అల్లం కఫంను స్రవించడాన్ని అరికట్టి , శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో అల్లంను కొద్ది కొద్దిగా తీసుకోవాలి . అల్లంతో పాటు కొద్దిగా ఉప్పు కూడా చేర్చి తీసుకోవచ్చు.

మస్టర్డ్ ఆయిల్:

మస్టర్డ్ ఆయిల్:

ఆవనూనె శ్వాస సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించి, శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది . ఇది నార్మల్ బ్రీతింగ్ కు సహాయపడుతుంది . ఆవనూనెలో ఉండే ఔషధ గుణాల వల్ల శ్వాస సమస్యలకు ఒక ఉత్తమ ఔషధిగా పనిచేసి, నివారిస్తుంది.

కాఫీ:

కాఫీ:

కాఫీలు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇది శ్వాస సమస్యలను కంట్రోల్ చేయడానికి మరియు శ్వాస సమస్యలను తగ్గించడానికి అవసరం అయ్యే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . కెఫిన్ లో ఉండే బ్రోకోడిలేటర్ లక్షణం శ్వాస సమస్యలను నివారిస్తుంది. హాట్ కాఫీ త్రాగడం వల్ల శ్వాసనాళం ఉపశమనం పొందుతుంది. మరింత ఎఫెక్టివ్ గా ఫలితం చూపెడుతుంది.

లెమన్ :

లెమన్ :

బ్రీతింగ్ సమస్య ఉన్నప్పుడు శరీరంలో విటమిన్ సి లెవల్స్ తగ్గుతాయి. ఆస్తమా ఉన్నవారు లోలెవల్ విటమిన్ సి కలిగి ఉంటారు . నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంది ఆస్తమా లక్షణాలను నివారిస్తుంది.

తేనె:

తేనె:

శ్వాస సమస్యలకు ఒక పురాతన మరియు నేచురల్ రెమెడీ ఇది. తేనెలో ఆల్కహాల్ మరియు ఇతర నూనెలుండటం వల్ల ఇది బ్రీతింగ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . తేనె యొక్క వాసన చూడటం వల్ల కూడా కొన్ని ప్రతికూల ప్రభావం చూపుతుంది . ఒక గ్లాస్ హాట్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ మూడు సార్లు త్రాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. గొంతులో కఫంను నివారించి, బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధగుణాల వల్ల, బ్రీతింగ్ డిజార్డర్స్ ను బ్రోంకైటిస్ మరియు ఆస్త్మా వంటివి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వెల్లుల్లి శ్వాసనాళంలో ఇబ్బందులను మరియు ఇతర సమస్యలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆనియన్:

ఆనియన్:

శ్వాసనాళలంలో సమస్యలను మరియు ఆస్తమాను నివారించడంలో ఒక గొప్ప నివారిణి ఉల్లిపాయ . శ్వాస సమస్యలను నివారించడంలో ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . సింపుల్ గా లంచ్ అండ్ డిన్నర్లో ఉల్లిపాయలను చేర్చుకోవాలి. పచ్చివి తినలేనప్పుడు ఉడికించి తీసుకోవచ్చు.

రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం:

ఆస్త్మా కారణంగా బలహీనపడిపోకూడదు. ఆస్త్మా శరీరానికి సంబంధించిన ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వ్యాధిమాత్రమే కాబట్టి, సమస్య నుండి బయట పడటానికి రెగ్యురల్ గా వ్యాయామాలు చేయడం , యోగ లేదా నడక లేదా స్విమ్మింగ్ వంటవి ఆస్త్మా నుండి బయటపడటానికి సహాయపడుతాయి . రన్నింగ్ చేయలేని వారు సింపుల్ గా సైకిల్ తొక్కడం లేదా వాక్ చేయడం మంచిది.

ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్:

ఫిష్ ఆయిల్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శ్వాససంబంధిత సమస్యలకు చాలా మంచిది. కాబట్టి ఆరోగ్యరకమైన ఫిష్ ఆయిల్ ను తీసుకోవడ ఉత్తమం.

హెల్తీ డైట్

హెల్తీ డైట్

హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలుండవు. రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ గా ఉండే ఆర్గానికి్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చేర్చుకోవడం చాలా అవసరం . ఆహారంలో జంక్ ఫుడ్ మరియు ఫ్యాటీ ఫుడ్స్ ను నివారించాలి . హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆస్త్మా అటాక్ కాకుండా నివారించుకోవచ్చు..

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Home Remedies To Manage Asthma Attack

    A total cure for asthma is impossible; but it can be prevented and managed with home remedies. Listed here are a few of the best remedies.
    Story first published: Saturday, May 13, 2017, 13:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more