For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పిని.. మటుమాయం చేద్దామిలా

By Y. Bharath Kumar Reddy
|

మైగ్రేన్‌ (పార్శ్వపు తలనొప్పి) వచ్చిదంటే నరకమే. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాపు ఏర్పడటం వల్ల ఇది వస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పి చాలా వరకు తలకు ఒక్క భాగంలో వస్తుంది. ఈ సమయంలో వికారం, వాంతులూ రావచ్చు. పార్శ్వపు తలనొప్పికి చాలా కారణాలున్నాయి. మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి ప్రధాన కారణాలు.

అనవసరమైన ఆలోచనలు, గతించిపోయిన కష్టనష్టాల గురించి తరుచూ మదన పడటం వల్ల కూడా మైగ్రేన్‌ వస్తుంది. నిద్రలేమి, డిప్రెషన్‌ కూడా ఈ వ్యాధికి కారణం అవుతుంది. అలాగే ఎక్కువ గంటలు సూర్యరశ్మిలో గడపడం వల్ల కూడా మైగ్రేన్‌ రావచ్చు. నిరంతరంగా ప్రయాణాలు చేయడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. అలాగే మహిళల్లో హార్మోన్‌ సమస్యలు తలెత్తినప్పుడు బహిష్టుకు ముందుగానీ, తర్వాత గానీ మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. రుతుక్రమం ఆగిపోయినప్పుడు, గర్భధారణ సమయంలోనూ ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చు. అలాగే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతాయి.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే పసుపుమైగ్రేన్ తలనొప్పిని తగ్గించే పసుపు

అయితే ఇది వచ్చినప్పడు తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వీలుంటుంది.

పుదీనా

పుదీనా

పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్, మెంథోన్ మైగ్రేన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను రుబ్బి, దాని నుంచి రసం తీయాలి. దాన్ని మీ నుదురుపై ఆ రసాన్ని పూసుకోవాలి. అలాగే ఒక కప్పు వేడి వేడి బ్లాక్ టీ లో కొన్ని పుదీనా ఆకులు వేసి 10నిముషాలు నానిన తర్వాత తీసుకుంటే మీకు మైగ్రేన్ నుంచి విముక్తి లభిస్తుంది. త్వరితగతిన ఉపశమనం పొందొచ్చు. అలాగే పుదీనా ఆయియి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఉండే వాసన రక్త నాళాలకు ప్రశాంతంత చేకూరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వాటర్ లేదా బాదం నూనెలో మూడు టేబుల్ స్పూన్ల పిప్పర్ మింట్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేయండి. అలాగే పుదీనా ఆకులతో నేరుగా కూడా మర్ధన చేసుకోవొచ్చు. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది.

కారెన్ పెప్పర్

కారెన్ పెప్పర్

క్యేన్నె మిరియాలు తలనొప్పికి ఉపశమనం కలిగించే క్యాప్సైసిన్ అని పిలిచే సక్రియాత్మక పదార్ధాన్ని కలిగి ఉంటుంది. ఇది పదార్ధం P, నొప్పి సంకేతాలు పంపుతుంది ఒక న్యూరోట్రాన్స్మిటర్ క్షీణించడం ద్వారా అలా చేస్తుంది.

అల్లం

అల్లం

అల్లంలో ఉండే జింజెరోల్స్ అని పిలిచే రసాయనం మైగ్రేన్ ను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. అల్లం, నిమ్మ రసాలను సమాన మోతాదుల్లో కలుపుకుని, రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి. తాజా నీటిలో అల్లం ముక్కలు లేదా అల్లం ముక్కల పొడిని వేయాలి. ఆ ఆవిరిని పీల్చాలి. అలాగే జింజర్ జ్యూస్ ను తలనొప్పిని ఇన్ స్టాంట్ గా నివారిస్తుంది. ఇది, తలకు సంబంధించిన రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గస్తుంది. దాంతో పెయిన్ తగ్గుతుంది. దీన్ని రోజూ తాగుతూ ఉంటే మైగ్రేన్ కు గురికాకుండా ఉండొచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం రసానికి , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి వాటర్ లో మిక్స్ చేసి, గోరువెచ్చగా చేసి, రోజులో ఒకటి రెండు సార్లు దాన్ని తాగాలి.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్

ఐస్ మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మీ మెడ పై ఐస్ ప్యాక్ ఉంచుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మీరు చల్లని ఐస్ నీటిలో గుడ్డను ముంచి, దానిని కొన్ని నిమిషాలపాటు మీ తలపై ఉంచుకోవాలి. ఈ విధంగా అర గంటపాటు చేయాలి. దీంతో మీరు బాగా ఉపశమనం పొందుతారు. మెడ, భుజాలు, నుదిటి మీద ఐస్ ప్యాక్ తో మసాజ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ ఈజీగా తగ్గుతుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్

కెఫెన్‌

కెఫెన్‌

కెఫెన్‌ మైగ్రేన్‌ ను నివారించడంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి మైగ్రేన్‌ సమస్య ఉన్న వారు కెఫెన్‌ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. పార్శ్వపు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వారంలో రెండు రోజుల పాటు కెఫెన్ తీసుకోవొచ్చు. అయితే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కెఫెన్ తీసుకున్నట్లయితే, అది మైగ్రేన్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారం

మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారం

మెగ్నీషియంలో అధిక స్థాయిలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని రకాల పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి. అలాగే రుతుక్రమం సరిగ్గా లేకపోవడంతో వచ్చే మైగ్రేన్ కూడా ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. పాలకూర, చిలకడదుంపు, క్వినోవా, పొద్దుతిరుగుడు విత్తనాలు, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నిషియం అధికస్థాయిలో ఉంటుంది.

చీకటి గది లో విశ్రాంతి తీసుకోండి

చీకటి గది లో విశ్రాంతి తీసుకోండి

మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయం లో ఒక ప్రశాంతమైన, చీకటి గది లో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. లేదా నిద్ర పోతే ఇంకా మేలు. దీంతోనొప్పి తగ్గుముఖం పడుతుంది. కొంత మంది కి కడుపులో వికారం గా అనిపించి వాంతి చేసుకుంటారు. అలా వాంతి అయినాక , వారి తలనొప్పి కూడా తగ్గి పోతుంది . నిశ్శబ్దంగా ఉండి వెలుతురు ప్రసరించిన గదిలో విశ్రాంతి ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవడం వల్లే ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు.

విటమిన్ బీ-2 ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకోండి

విటమిన్ బీ-2 ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకోండి

విటమిన్ బీ2 కలిగివున్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మైగ్రేన్ ను ఈజీగా తగ్గించుకోవొచ్చు. మీరు రోజుకు 400 మిగ్రా రిబోఫ్లావిన్ (విటమిన్ B2) తీసుకోవచ్చు. అయితే ఇది మైగ్రేన్ వచ్చినప్పడు తీసుకుంటే ఫలితం అంతం మాత్రంగానే ఉంటుంది. దీన్ని దీర్ఘకాలం ఉపయోగించాలి. మీరు కనీసం మూడు నెలలు పాటు విటమిన్ బీ - 2 ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటే మీకు మైగ్రేన్ వచ్చే సమస్య చాలా తక్కువ.

బాగా నిద్రపోండి

బాగా నిద్రపోండి

నిద్ర లేమి వల్ల మైగ్రెన్ వస్తూ ఉంటుంది. అందువల్ల మీరు నిద్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజూ 8 గంటల సమయం మీరు నిద్రకు కేటాయించాలి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ ను మీరు కొంత మేరకు ఎదుర్కోవొచ్చు.

తల, మెడపై మసాజ్

తల, మెడపై మసాజ్

మీ తల, మెడ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందుతారు. తలను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. ఇలా చేయడం వల్ల మెడ, భుజాల కండరాలు రిలాక్స్ అవుతాయి. మైగ్రేన్ నివారణకు ఒది ఒక సహజపద్ధతి.

మైగ్రేన్ తలనొప్పిని నివారించే 9 సూపర్ ఫుడ్స్మైగ్రేన్ తలనొప్పిని నివారించే 9 సూపర్ ఫుడ్స్

బటర్బర్గ్ హెర్బ్

బటర్బర్గ్ హెర్బ్

బటర్బర్గ్ దీర్ఘకాలంగా మైగ్రెన్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. బటర్ ఆకులు మైగ్రేన్ తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి.

ఫీవర్ ప్యూ హెర్బ్

ఫీవర్ ప్యూ హెర్బ్

ఈ ఆకులు పార్శ్వపు నొప్పిని నివారించడానికి ఉపయోగిస్తారు. వీటిని తీసుకుంటే ఈజీగా మైగ్రేన్ నుంచి తప్పించుకోవొచ్చు. చాలామంది మైగ్రేన్ తో బాధపడే సందర్భాల్లో ఈ ఆకులను ఉపయోగించి ఉపశమనం పొందుతుంటారు.

గ్లూటెన్ ఫ్రీ డైట్

గ్లూటెన్ ఫ్రీ డైట్

గ్లూటెన్ ఫ్రీ డైట్ ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. గోధుమ, బార్లీ, వోట్స్, జొన్న వంటి ఆహారాలు ఈ కోవకు చెందినవి. అందువల్ల వీలైనంత వరకు గ్లూటెన్ ఫ్రీ ఉండే ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ మెడ వెనుక భాగంలో తలనొప్పి ఉండే ప్రాంతంలో అప్లై చేయండి. దీంతో మీరు వెంటనే ఉపశమనం పొందగలుగుతారు. 6 కప్పుల నీటిని మరిగించి అందులో సుమారుగా 8 చుక్కల లావెండర్ ఆయిల్ పోసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఆవిరి పట్టించాలి. అలా చేయడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు.

హైడ్రేటెడ్ గా ఉండండి

హైడ్రేటెడ్ గా ఉండండి

డీ హైడ్రేషన్ అనేది మైగ్రేన్ రావాడానికి ఒక ట్రిగ్గర్. శరీర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే నీరు చాలా అవసరం. అందువల్ల మీరు వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగండి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. దీంతో మీరు మైగ్రేన్ కు దూరంగా ఉండొచ్చు.

డిటాక్స్ బాత్

డిటాక్స్ బాత్

డిటాక్స్ అంటే నిర్విషీకరణ (విషాలను తొలగించటం లేదా విషాలకు గురికాకుండా చేయటం). డిటాక్స్ బాత్ మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఆయిల్స్ కలుపుకోవడం వల్ల ఈ ప్రయోజనం పొందుతారు. ఆపిల్ సైడర్ వినెగార్ ను మీరు స్నానం చేసే నీటిలో కలపండి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ ను కూడా మీరు స్నానం చేసే వాటర్ లో కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్

పార్శ్వపు నొప్పి చికిత్సకు ఆక్యుపంక్చర్ బాగా పని చేస్తుంది. మైగ్రేన్లు నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే ఆక్యుపంక్చర్ విధానాన్ని అవలంభించాలని కొన్ని అధ్యాయనాల్లో వెల్లడైంది. ఆక్యుపంక్చర్‌ విధానంలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

యోగా

యోగా

యోగా ఒక ఫర్ఫెక్ట్ హెడ్ ఎక్ రెమెడీ. యోగాలోని కొన్ని ఆసనాలు మీరు వెంటనే ప్రయోజనం పొందేలా చేస్తాయి. మైగ్రేన్ ను వెంటనే తగ్గించే యోగా ఆసనాలను రోజూ వేయడం వల్ల మీరు ఉపశమన పొందుతారు.

వ్యాయామం

వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే మైగ్రెన్ తీవత్రను తగ్గుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు, శరీరం నుంచి సహజంగా నొప్పి నివారణ కోసం ఎండోర్ఫిన్లు విడుదల అవుతాయి. అవి మైగ్రేన్ తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.

English summary

Home Remedies To Treat Migraine Headache

Try these effective home remedies to treat migraine headache. Read to know about the best home remedies for migraine headache.
Desktop Bottom Promotion