ఈగలు ఈ వ్యాధులను వ్యాప్తి చేయవచ్చు, జాగ్రత్తగా ఉండండి!

Subscribe to Boldsky

మీరు ఈ సారి రోడ్డు పక్కన లభించే తినుబండారాలు ప్రయత్నించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. తిను బండారాలపై ఈగలు ముసురుతున్నట్లు గనక మీరు గమనించినట్లయితే మీరు ఆ పదార్థాలను దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే, అటువంటి పదార్థాలను తినడం ద్వారా మీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు.

ఇటీవల జరిగిన ఒక అధ్యాయనంలో, పరిశోధకులు ఈగలద్వారా వ్యాప్తి చెందే అనేకరకములైన బాక్టీరియాల గురించి తెలుసుకున్నారు. యూఎస్ లోని పెన్స్లేవియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 116 రకాల ఈగల ద్వారా వ్యాప్తి చెందే వివిధ సూక్ష్మజీవజాలం గురించి తెలుసుకున్నారు.

ఈ ఈగలు రోగాలను కలిగించే వివిధ రకాల హానికర బాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. అందువల్ల, వనభోజనములప్పుడు కానీ లేదా ఎప్పుడైనా రోడ్డు పక్కన లభించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అటువంటి ఆహారపదార్థాలను భుజించడం ద్వారా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని ఈ విషయాన్ని ప్రజారోగ్య అధికారులు ఉపేక్షించారని, తద్వారా ఈ అనారోగ్య సమస్యలు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని పెన్స్లేవియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డోనాల్డ్ బ్రియాట్ అభిప్రాయపడ్డారు.

Houseflies Can Spread These Diseases, Be Careful!

అధ్యయనంలో భాగంగా హానికర బాక్టీరియాకి సంబంధించిన విషయాల కోసం పరిశోధకులు ఈగకు చెందిన శరీరభాగాలపై పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనలో తేలిన విషయాల ప్రకారం ఈగ కాళ్ల ద్వారా సూక్ష్మక్రిములు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సులభంగా విస్తరిస్తాయి. ఈ విషయాన్ని పెన్స్లేవియా స్టేట్ యూనివర్సిటీ కి చెందిన స్టీఫెన్ షుస్టర్ వివరించారు.

ఈగ యొక్క కాళ్ళు అలాగే రెక్కలపై అత్యధికంగా వివిధ రకాల హానికర బాక్టీరియా చేరుతుంది. తద్వారా ఈ బాక్టీరియా వివిధ ప్రదేశాలకు చేరుతుంది. ఈ బాక్టీరియా ఈగలను గాలిలో ఎగిరే ప్రయాణ సాధనంగా వాడుకుని వివిధ ప్రదేశాలకు సులభంగా విస్తరిస్తాని షుస్టర్ అంటున్నారు.

నిజానికి, ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే వందల కొద్దీ ఈగల ద్వారా వ్యాప్తి చెందే బాక్టీరియా విస్తరిస్తున్న కొద్దీ బాక్టీరియా అధికంగా విస్తరించి ఆరోగ్య సమస్యలను కలిగిస్తోంది.

ఈగలు అలాగే ఈగ జాతికి చెందిన బ్లోఫ్లైస్ వంటివి అనారోగ్యకరమైన ప్రదేశాలకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. అటువంటి ప్రదేశాలలో ఇవి నివాసం ఏర్పరచుకుని వీటి సంఖ్యను మరింత వృద్ధిపరచుకుంటాయి. ఆ విధంగా ఇవి మానవులకు, జంతువులకు అలాగే మొక్కలకు అనారోగ్యసమస్యలు తెచ్చిపెడతాయి.

ఈ అధ్యయనంలో ద్వారా తేటతెల్లమైంది మరో విషయం ఏంటంటే ఈ ఈగలు మైక్రోబయోమ్లో దాదాపు 50 శాతం వాటాను కలిగిఉంటాయి. అవి హోస్ట్-రిలేటెడ్ మైక్రోబయోమ్ తో పాటు నివసిస్తున్న పరిసరాల నుండి కొన్ని పొందినవి.

ఆశ్చర్యకరంగా, స్టేబిల్స్ కి చెందిన ఈగలలో అతి తక్కువ బాక్టీరియా ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. పట్టణ ప్రాంతాలకి చెందిన ఈగలు అత్యధిక బాక్టీరియాను చేరవేస్తాయట. దాదాపు పదిహేను సందర్భాలలో పరిశోధకులు మానవ రోగకారక హెలికాబాక్టర్ పైలోరీ అనే రోగకారక బాక్టీరియా మానవులలో అల్సర్ ను కలిగిస్తాయని తెలుసుకున్నారు. ఇటీవలే ఈ అధ్యయనం జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించబడింది.

ఈగల ద్వారా వ్యాప్తి చెందే రోగాలనుండి రక్షించుకునేందుకు ఈ క్రింది జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.

Houseflies Can Spread These Diseases, Be Careful!

1. ఆహార పరిశుభ్రత:

వండే ముందు కూరగాయాలని శుభ్రంగా కడగాలి. ఆహారాన్ని జాగ్రత్తగా మూత పెట్టి భద్రపరచాలి. పాడైపోయిన ఆహార పదార్థాలని పారవేయాలి. ఆహార పరిశుభ్రతకు సంబంధించి ఇవి ముఖ్యమైన పద్ధతులు. ఈగల ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధులను అరికట్టడానికి ఇవి ప్రధానమైన మార్గాలు.

Houseflies Can Spread These Diseases, Be Careful!

2. పరిసరాల పరిశుభ్రత:

ఈగల యొక్క వ్యాప్తిని అరికట్టడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా ఈగల వ్యాప్తిని అరికట్టి రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చు.

Houseflies Can Spread These Diseases, Be Careful!

3. సరైన వ్యర్థ నిర్వహణని పాటించడం:

సరైన వ్యర్థ నిర్వహణ విధానాలని పాటించడం ద్వారా ఈగల వ్యాప్తిని అరికట్టవచ్చు. తద్వారా ఈగల ద్వారా వ్యాప్తి చెందే వివిధ రకాల అనారోగ్య సమస్యలని నివారించవచ్చు. చెత్తబుట్టలని సరిగ్గా కప్పి ఉంచాలి. మూసి వేయని చెత్తబుట్టలు వివిధ రకాల ఈగలని ఆకర్షిస్తాయి.

(ఏజెన్సీ ఇన్పుట్స్ ద్వారా)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Houseflies Can Spread These Diseases, Be Careful!

    In a new study, researchers have found that flies carry hundreds of different species of bacteria, many of which are harmful to humans. The researchers from the Pennsylvania State University in the US had taken into account microbiomes of 116 houseflies and blowflies for the study.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more