Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
అలర్ట్: పురుషుల్లో నిద్ర ఎక్కువైనా,తక్కువైనా వీర్యం నాణ్యతకు చేటే!
తిండి లేకుండా అయినా కొన్ని రోజులు బ్రతకగలమేమో కాని, నిద్ర లేకుండా బ్రతకలేము. మనిషి జీవితంలో నిద్రకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామనేది చూస్తే, జీవితంలో మూడు వంతుల భాగం నిద్రలోనే ఉంటున్నాము.
నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయాన్నే లేవాలని మన పెద్దలు చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. తర్వాత 6, 8, 9గంటలు నిద్రపోయిన వారి వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు.
అందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం.

ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్ (యాంటీస్పెర్మ్ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. నిద్రించడానికి 2గంటల ముందే :
కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం..

2. నిద్రించడానికి 45 నిముషాల ముందు :
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం..

3. స్నానం :
నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం..

4. గదిలో ఎక్కువ లైటింగ్ లేకుండా చూసుకోవాలి:
గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం..

5. సంగీతం వినడం :
నిద్రించడానికి ముందు మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం..

6. రాత్రుల్లో వదులు దుస్తులు వేసుకోవడం :
వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.



Click it and Unblock the Notifications