For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజర్ : స్మార్ట్ ఫోన్ లైట్ బ్రెయిన్ & బాడీ మీద ఎలాంటి దుష్ప్రభావం చూపుతుంది!

స్మార్ట్ ఫోన్స్ నుండి వెలువడే బ్లూలైట్ వల్ల బ్రెయిన్ మరియు బాడీలో ఎలాంటి దుష్ప్రభావాలకు గురిచేస్తుందో ఈ ఆర్టికల్లో తెలపడం జరిగింది. మరి ఆ దుష్ప్రభావాలేంటో తెలుసుకుని, రాత్రుల్లో స్మార్ట్ ఫోన్స్ కు రెస

|

ప్రస్తుత ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫోన్స్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఫోన్స్ లో వివిధ రకాలున్నా స్మార్ట్ ఫోన్స్ కున్న క్రేజ్ మరే ఇతర ఫోన్స్ కు ఉండవు. స్మార్ట్ ఫోన్స్ లో ఫీచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటికి మంచి క్రేజ్ . ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఒక బ్లూ లైట్ ఉంటుంది. ఈ లైట్ వల్లే ఎండలో కూడా క్లియర్ గా టెక్ట్స్ కానీ, నెంబర్స్ కానీ చదువుతాము. ఇటువంటి లైట్స్ కేవలం స్మార్ట్ ఫోన్స్ కు మాత్రమే కాదు, లాప్ టాప్, టివి, ఇతర గ్యాడ్జెట్స్ కు కూడా అమర్చబడి ఉంటాయి.

ఈ లైట్స్ వల్ల మన బ్రెయిన్ కు ఒక సంకేతం పంపుతుంది. రాత్రి అయినా పగలులాగే అనిపిస్తుంది. అందుకు కారణం ఈ లైట్ వెలుతుర్లో బ్రెయిన్ లో మెలటోనిన్ అనే కెమికల్ ఉత్పత్తి అవ్వడం మానేస్తుంది. దాంతో రాత్రుల్లో సరిగా నిద్రపోలేరు.

How Smartphone's Light Affects The Brain And Body

కాబట్టి, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ట్స్ అయినా సరే , రాత్రి నిద్రించడానికి రెండు మూడు గంటల ముందు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ మెదడులోని పీనల్ గ్లాండ్ ప్రభావం వల్ల ఉత్పత్తి అవుతుందని కనుగొన్నారు.

ఈ బ్లూ లైట్ కారణంగా నిద్రలేమికి గురి అవుతారని సూచిస్తున్నారు. అందుకు కారణం ఫోటోరిస్ప్టిర్ మెలోనోస్పిన్ . దీన్ని కళ్లు (రెటీనా గ్యాంగ్లిన్ సెల్స్)లో కనుగొనడం జరిగింది. ఇది బ్లూ లైట్ కు రియాక్ట్ అవుతుంది.

కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్స్ నుండి వెలువడే బ్లూలైట్ వల్ల బ్రెయిన్ మరియు బాడీలో ఎలాంటి దుష్ప్రభావాలకు గురిచేస్తుందో ఈ ఆర్టికల్లో తెలపడం జరిగింది. మరి ఆ దుష్ప్రభావాలేంటో తెలుసుకుని, రాత్రుల్లో స్మార్ట్ ఫోన్స్ కు రెస్ట్ ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

#1

#1

టీనేజర్స్ లో స్మార్ట్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్ లో కంటే వీరిలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఎందుకంటే సర్కాడియం రిథమ్ అడోలసెంట్ ఏజ్ లో షిఫ్ట్ అవుతుంది. దాంతో వారు ఎక్కువ సేపు నిద్రమేల్కొనేలా చేస్తుంది. అది ఇంటర్నల్ గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

#2

#2

తర్వాత, ఫోన్స్ లేదా వైఫై ద్వార వచ్చే లైట్ వల్ల డేంజరెస్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ కారణంగా పిల్లల ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది.

#3

#3

రాత్రుల్లో నిద్రించడానికి ముందు స్మార్ట్ ఫోన్స్ లేదా ఇతర గ్యాడ్జెట్స్ యొక్క లైట్స్ ను పూర్తిగా ఆఫ్ చేయాలని నిపుణులు స్ట్రాంగ్ గా హెచ్చరిస్తున్నారు.

#4

#4

ఇంకా ఫ్లక్స్ డౌన్ లోడ్ చేయడం వల్ల స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్ వేడిగా ఉంటుంది. పగటి పూట బ్రైట్ గా కనబడుతుంది.

#5

#5

స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల మీ స్లీప్ సైకిల్ ను డిస్టర్బ్ చేస్తుంది. నిద్రపోవడం చాలా కష్టంగా భావిస్తారు. అలాగే రాత్రుల్లో ఫోన్స్ వినియోగించడం వల్ల ఉదయం నిద్రలేవడానికి కష్టంగా భావిస్తారు.

#6

#6

రాత్రుల్లో లైట్ ఎక్సఫోజర్ వల్ల , బ్రెయిన్ లోని నిద్రకు ఉపక్రమింపచేసే నరాల మీద రియాక్ట్ అయ్యి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఇది ఇలా దీర్ఘకాలం కొనసాగితే బ్రెస్ట్ అండ్ ప్రొస్టేట్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

#7

#7

నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. అలాగే నిద్ర నుండి డిస్ట్రాక్ట్ అవుతుంటారు. ఏకాగ్రతను కోల్పోవడం , నిద్రలేమి వల్ల మరుసటి రోజు ఉదయం ఏకాగ్రత లెవల్స్ తగ్గిపోతాయి.

English summary

How Smartphone's Light Affects The Brain And Body

Experts advice to stop using any electronic device at least 2-3 hours before bedtime. Melatonin is released in the body through the pineal gland, which is located in the brain.
Story first published: Saturday, April 1, 2017, 17:03 [IST]
Desktop Bottom Promotion