For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణంలో వికారం, వాంతులను ఎలా ఆపాలి

By Deepti
|

మీకు ప్రయాణం సమయంలో వాంతులు, వికారంగా అన్పిస్తున్నట్లయితే ఇది తప్పక చదవండి. కొంతమందిలో, ఈ వికారానికి కారణం బస్సు పరిశుభ్రంగా లేకపోవటం, అందులో వచ్చే ఇంధన వాసన.

మరికొంతమందికి, కదలిక వల్ల వచ్చే అనారోగ్యం కూడా ఈ వికారానికి కారణమై ఉండొచ్చు. బస్సు, కారు, విమానం లేదా పడవ ఏదైనా కదలిక వల్ల వచ్చే వికారం చాలా చికాకును కలిగిస్తుంది.

ప్రయాణంలో వాంతులు-వికారంకు చెక్ పెట్టే సులభ చిట్కాలు ప్రయాణంలో వాంతులు-వికారంకు చెక్ పెట్టే సులభ చిట్కాలు

మీ మిత్రులతో రోడ్డు ప్రయాణం పెట్టుకుని, వాంతుల గురించి భయపడుతున్నారా, ఇదిగో మీ సమస్యకి సులువైన చిట్కాలు. ప్రయత్నించండి.

మిరియాలు

మిరియాలు

ఒక కప్పు నిమ్మరసంలో, చిటికెడు మిరియాల పొడిని కలిపి తాగండి. ఈ మిశ్రమం తలనొప్పి, తల తిరగటం వంటి కదలిక వల్ల వచ్చే సమస్యలను నిరోధిస్తుంది.

పుదీనా టీ

పుదీనా టీ

మీ ప్రయాణం మొదలుపెట్టేముందు, ఒక కప్పు పుదీనా టీ తాగండి. లేదా కొన్ని పుదీనా ఆకులను మీతో ఉంచుకుని, బస్సు లేదా కారు కదిలి మీ ప్రయాణం మొదలవగానే నమలండి. ఇది వికారం తగ్గిస్తుంది.

గర్భాధారణ సమయంలో వేవిళ్ళు..వికారానికి చెక్ చెప్పండిలా గర్భాధారణ సమయంలో వేవిళ్ళు..వికారానికి చెక్ చెప్పండిలా

అల్లం టీ

అల్లం టీ

అల్లం టీ ప్రయాణంలో వచ్చే వికారానికి మంచి మందు. ఇది అరుగుదలను పెంచుతుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

కొంత నీటిని మరిగించి అందులో ఒక చెంచాడు దాల్చిన చెక్క పౌడర్ ను వేయండి. ఒక చెంచా తేనె వేసి కలిపి తాగండి. ఇది ప్రయాణపు అనారోగ్య లక్షణాలను తగ్గిస్తుంది.

లవంగాలు

లవంగాలు

బస్సు ఎక్కుతున్నప్పుడు ఒక లవంగాన్ని చప్పరించండి. ఈ లవంగాన్ని ఒక చెంచాడు తేనెలో కూడా ముంచి నమలచ్చు. ఇది వికారాన్ని తగ్గిస్తుంది.

యాలకులు

యాలకులు

ఏలక్కాయ కూడా చప్పరించటం వల్ల వెనువెంటనే ప్రయాణంలో వచ్చే వికారం మటుమాయమవుతుంది.

ప్రయాణాల్లో సిక్ నెస్ ని తగ్గించే పవర్ ఫుల్ టిప్స్ ప్రయాణాల్లో సిక్ నెస్ ని తగ్గించే పవర్ ఫుల్ టిప్స్

సోంపు

సోంపు

సోపు/ సోంపు గింజలు నోట్లో వేసుకోవడం కూడా ఉపయోగకరం. సోంపు నోట్లో ఉండగానే ఆ లాలాజలాన్ని మింగివేయండి. వాంతి వస్తున్న భావన లేకుండా చేస్తుంది.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం

ప్రయాణం ముందు ఒక కప్పు ఉల్లిపాయ రసం తాగండి. వికారాన్ని అది చూసుకుంటుంది.

English summary

ప్రయాణంలో వికారం, వాంతులను ఎలా ఆపాలి

If you have experienced nausea or vomiting during travel then you may need to read this. There are some simple remedies for it.
Desktop Bottom Promotion