దగ్గుని అరికట్టే స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ను తయారుచేసుకోవడమెలా + ఈ రెసిపీలో వాడిన పదార్థాల వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు కూడా అంతుచిక్కని ఫ్లూ ని అరికట్టడానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, వివిధరకాల లక్షలాది వైరస్ లు, బ్యాక్తీరియా అలాగే అలర్జీ కారకాల వంటి మిగతా మైక్రోబయాల్ పదార్థాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఫ్లూ అనబడే ఈ శ్వాసకోశ సమస్య. వీటన్నిటికై వాక్సిన్ ని తయారుచేయడం సులభం కాదు. అంతమాత్రాన, మీరు తరచూ దగ్గూ జలుబుతో సతమతమవ్వాలని లేదు.

spiced turmeric milk for cough

ఈ ఆర్టికల్ లో చాలా సులభంగా తయారుచేసుకోగలిగిన స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ రెసిపీని అందించాము. ఈ రెమెడీతో మీ రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందుతుంది. తద్వారా, తరచూ వేధించే దగ్గూ జలుబుని కొంతవరకూ కంట్రోల్ చేయవచ్చు. అలాగే, మిగతా ఆరోగ్యసమస్యల నుంచి కూడా మీకు రక్షణ ఏర్పడుతుంది...

స్టెప్ 1 - పాలు , తేనె పదార్థాలను సాస్ ప్యాన్ లో వేయడం

స్టెప్ 1 - పాలు , తేనె పదార్థాలను సాస్ ప్యాన్ లో వేయడం

ముందు చెప్పుకోబడిన పదార్థాలన్నిటినీ అంటే ఒక ఇలాచీని, 3 నల్ల మిరియాలను అలాగే ఒక కప్పుడు పాలను సాస్ ప్యాన్ లో వేసి మీడియం ఫ్లేమ్ ను ఆన్ చేయండి.

స్టెప్ 2 -టర్మరిక్ పౌడర్ ను కలపండి

స్టెప్ 2 -టర్మరిక్ పౌడర్ ను కలపండి

ఇప్పుడు అర టీస్పూన్ టర్మరిక్ పౌడర్ ను ప్యాన్ లో జతచేసి మిశ్రమం మొత్తం బంగారు పసుపువర్ణంలోకి మారే వరకూ బాగా కలపండి.

స్టెప్ 3 - పాలు మరిగే వరకు వేడి చేయాలి

స్టెప్ 3 - పాలు మరిగే వరకు వేడి చేయాలి

మీడియం ఫ్లేమ్ లో ఈ పదార్థాలన్నీ మరిగే వరకు వేడి చేయాలి. ఇందుకు సుమారు మూడు నుంచి అయిదు నిమిషాల సమయం పడుతుంది.

 స్టెప్ 4 - పాలను వడగట్టి

స్టెప్ 4 - పాలను వడగట్టి

ఇప్పుడు, ప్యాన్ లోంచి ఒక పాత్రలోకి పాలను వడగట్టండి. అంతే, స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ తయారయిపోయింది. ఇప్పుడు ఈ సొల్యూషన్ ను కాసేపు అలాగే ఉంచండి. తాగేంత వేడి వచ్చేవరకు వేచి ఉండండి.

వెచ్చగా ఉన్నప్పుడు ఈ సొల్యూషన్ ను త్రాగండి.గమనిక -

పిల్లలకు స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ని సర్వ్ చేసేటప్పుడు ఒక స్పూన్ తేనెని ఈ మిశ్రమంలో కలిపి వారికిస్తే వారు ఆనందంగా దీనిని త్రాగుతారు. అలాగే, ఒకవేళ మీకు కూడా ఈ సొల్యూషన్ యొక్క ఒరిజినల్ టేస్ట్ నచ్చకపోతే కాస్తంత తేనెని ఈ మిశ్రమంలో కలిపి తీసుకోండి.

స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఈ కారణాల ద్వారా తెలుస్తుంది...స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఈ కారణాల ద్వారా తెలుస్తుంది...

స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఈ కారణాల ద్వారా తెలుస్తుంది...స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో ఈ కారణాల ద్వారా తెలుస్తుంది...

సులభంగా చేసుకునే ప్లెయిన్ టర్మరిక్ మిల్క్ కూడా జలుబూ, దగ్గులను అరికట్టడానికి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులోనున్న శక్తివంతమైన యాంటి-ఇంఫ్లమేటరీ ప్రాపర్టీలే ఇందుకు కారణం. ఇవి గొంతు నొప్పిని తగ్గించి మ్యూకస్ ఫ్లో ని పెంపొందించడం ద్వారా ఫారీన్ మైక్రోబ్స్ ని అలాగే ఇతర పార్టికల్స్ ని రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి తొలగించేందుకు సహాయపడతాయి.

అయితే, స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ యొక్క గుణాలు ఇంకా ప్రత్యేకమైనవి. ఈ హెల్త్ డ్రింక్ కి మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పెంపొందించే గుణాలున్నాయి. ఇందులో నల్లమిరియాల సుగుణాలు అలాగే ఇలాచీ యొక్క ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. వీటిని టర్మరిక్ తో కలపడం ద్వారా ఇవి శక్తివంతంగా పనిచేసి హానికర బాక్టీరియాను ఎదుర్కొంటాయి.

పసుపు + నల్లమిరియాలు = శక్తివంతమైన కలయిక

పసుపు + నల్లమిరియాలు = శక్తివంతమైన కలయిక

పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. అందువలన ఆయుర్వేద వైద్యశాస్త్రంలో పసుపు ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. పసుపులోనున్న కుర్కుమిన్ అనే పదార్థమే ఔషధ గుణాలకు నిలయంగా మారింది.

అసలు సమస్యేంటంటే, మన శరీరానికి పసుపులో లభించే కుర్కుమిన్ అనే పదార్థాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే యంత్రాంగం లేదు. ఇక్కడే మనకు నల్లమిరియాల వలన అద్భుతమైన ఉపయోగం కలుగుతుంది. నల్లమిరియాలలో నున్న పిపెరిన్ అనే పదార్ధం శరీరంలోని కుర్కుమిన్ శాతాన్ని పెంపొందించడానికి అమితంగా తోడ్పడుతుంది. అందుకే, పసుపు - మిరియాల కలయికని శక్తివంతమైన కలయికగా పేర్కొనడంతో అతిశయోక్తి లేదు. ఈ రెండిటినీ కలపడం ద్వారా శరీరంలో కుర్కుమిన్ యొక్క జీవలభ్యత దాదాపు 2000% వరకు పెరుగుతుంది.

స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ లో నున్న ఇలాచీ వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు......

స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ లో నున్న ఇలాచీ వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు......

ఇలాచీ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పైస్ లలో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మొదటి స్థానంలో సాఫ్రాన్ ఉండగా రెండవ స్థానంలో వెనిల్లా ఉంది. ఇలాచీ ప్రత్యేకమైన ఫ్లేవర్ ని కలిగి ఉంటుంది.

స్పైస్డ్ టర్మరిక్ మిల్క్ లో ఇలాచీని జతచేయడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. గ్యాస్ట్రోఇంటస్టినల్ ట్రాక్ట్ పై ఇలాచీ అద్భుతమైన ప్రభావాలను కనబరుస్తుంది.

ఆకలిని పెంచి మెటబాలిజం రేట్ ను మెరుగుపరుస్తుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యల వలన ఆకలి మందగించడం జరుగుతుంది. అందువలన ఈ సమస్యకు ఇలాచీ చక్కని ఔషధంలా పనిచేస్తుంది.

అంతే కాదు, అనేక అధ్యయనాల ప్రకారం మీ మానసిక స్థితిని మెరుగుపరిచే శక్తి ఇలాచీకి లదు. అందువలన, ఇలాచీను అద్భుతమైన ఔషధంగా పేర్కొనవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా? అయితే, వెంటనే షేర్ చేయండి.

మీరు తెలుసుకున్న ఈ అద్భుతమైన సమాచారాన్ని మీ వద్దనే ఉంచుకోకుండా ప్రపంచంతో పంచుకోండి

English summary

How To Make Spiced Turmeric Milk For Cough + Benefits Of Drinking It

Plain and simple turmeric milk might be good enough for curing cough and cold, but spiced turmeric milk (made with black peppercorns and cardamom) is even better! Why? Because black pepper increases the bioavailability of curcumin in turmeric by 2000% (yes, that's right), while cardamom gets rid of loss of appetite and improves your mood.