యోగ డే: తలనొప్పి తగ్గించుకోవడానికి యోగ!

Posted By:
Subscribe to Boldsky

సహజంగా తలనొప్పి వచ్చినా...కడుపునొప్పి వచ్చినా...ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు,లక్షలు వదిలించుకుంటున్న మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడాలి. యోగశాస్త్రంలో ఏ ఆసనం వేస్తే ఏ రోగం తగ్గించుకోవచ్చో కూడా వివరంగా ఉంది. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ తలనొప్పిని ఎదుర్కొని ఉంటారు. తలనొప్పి తగ్గించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్, వివిధరకాల పిల్స్ ను ప్రయత్నించి ఉంటారు.

ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాలు కలిగించేవే. ఎప్పుడైతే తలనొప్పిని తగ్గించుకోవడంలో విఫలం అవుతారో అప్పుడు 90శాతం తలనొప్పి తిరిగి బాధిస్తుంది. కాబట్టి తలనొప్పికి అసలు కారణం ఏంటో తెలుసుకుని, దాని ప్రకారం తలనొప్పిని తగ్గించుకోవాలి. తలనొప్పి తగ్గించుకోవడానికి యోగ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

తలనొప్పి మరియు టెన్షన్ తగ్గించుకోవడానికి 15 హోం రెమెడీస్

ఈ రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా తలనొప్పి తగ్గించుకోవడానికి కొన్ని యోగాసనాలను మీకు పరిచయం చేయబోతున్నాము.

international yoga day

ఆమెకు 67 ఏళ్ళు, ఇప్పటి వరకూ..తన జీవిత కాలంలో ఆమె ఒక్క రోజు కూడా తలనొప్పితో బాధపడింది లేదు. ఆమె ఎవరంటే? Dr. విజయలక్ష్మీ బాలేకుండ్రి, ఈమె బెంగళూర్ లో పీడ్రియాటిక్ కార్డియాలజిస్ట్. ఆమె ఆరోగ్యంగా ఉండటానికి సీక్రెట్ యోగానే అంటుంది. ఆమె తన చిన్న నాటి నుండి యోగాను ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. అదే తన జీవితంలో తలనొప్పి అనే మాట లేకుండా చేసిందని అంటారు ఆవిడ.

తలనొప్పి తగ్గించుకోవడంలో యోగా ఎలా సహాయపడుతుంది?

తలనొప్పికి ముఖ్య కారణం ఐసైట్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడటం, టీవి, మొబైల్ ఫోన్ వంటివి ఎక్కువ చూడటం, స్ట్రెస్ మరియు హైపర్ టెన్షన్ కూడా తలనొప్పికి ముఖ్య కారణాలు. కాబట్టి, రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మందులు ఉపయోగించే అవసరం ఉండదు, తలనొప్పిని తగ్గిస్తుంది.

తలనొప్పి &మైగ్రేన్ తలనొప్పికి గురిచేసే ఆహారాలు

Dr విజయలక్ష్మీ ప్రకారం యోగాతో పాటు, లైఫ్ స్టైల్ మార్పులు కూడా చాలా అవసరం అంటుంది. డిసిప్లైన్ లైఫ్ పాజిటివ్ థాట్స్ వల్ల తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. యోగాతో పాటు మెడిటేషన్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

తలనొప్పిని తగ్గించుకోవడంలో యోగాసనాలు ఏవిధంగా సహాయపడుతాయో తెలుసుకుందాం..

1. సవాసనం:

1. సవాసనం:

ఉదయం, రాత్రి 5 నిముషాలు సవాసనం వేయడం ద్వారా శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతుంది, దాంతో తలనొప్పి నుండి ఉపమశనం కలుగుతుంది. Dr విజయలక్ష్మీ ఉదయం నిద్రలేవగానే 5 నిముషాలు, యోగా చేస్తుంది.

సవాసనం ఎలా వేయాలి?

 • యోగా మ్యాట్ లేదా చాపమీద నిటారుగా వెళ్లకిలా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి.
 • ఈ సమయంలో శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతుంది.
 • 15 నిముషాలు అలాగే పడుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. అవసరం అనిపిస్తే అలాగే నిద్రలోకి జారుకోవచ్చు.
2. సూర్య నమస్కారం:

2. సూర్య నమస్కారం:

నడకతో కూడా సూర్య నమస్కారం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం కొద్దిగా వామ్ అప్ అవుతుంది. Dr. విజయలక్ష్మీ సూర్య నమస్కారంతో పాటు ఇతర యోగాసనాలు కూడా అరగంట పాటు రోజూ ప్రాక్టీస్ చేస్తుంది.

సూర్య నమస్కారం ఎలా చేయాలి:

 • నిద్ర లేచిన వెంటనే అరగంట పాటు నడవాలి.
 • సూర్య నమస్కారం చేయడానికి అరగంట ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
 • శరీరం మీద నేరుగా సూర్య కిరణాలు పడే ప్రదేశంను ఎంపిక చేసుకోవాలి.
 • ఈ ప్రదేశంలో మ్యాట్ లేదా షీట్ వేసుకుని, సూర్యనమస్కారాలు చేయడం ప్రారంభించాలి.
 • సూర్య నమస్కారంలో దాదాపు 12 యోగా భంగిమలున్నాయి.
3. కపాలబాతీ ప్రాణాయం:

3. కపాలబాతీ ప్రాణాయం:

రోజుకు 5 నిముషాలు కపాలబాతీ ప్రాణాయం చేయడం వల్ల శరీరం, మైండ్ రెండూ ప్రశాంతంగా ఉంటాయి . దాంతో తలనొప్పి సులభంగా తగ్గుతుంది. ఎప్పుడైతే బలహీనంగా అనిపిస్తుందో వెంటనే ఈ ఆసనం వేస్తే వెంటనే శక్తిని పుంజుకుంటారు.

కపాలబాతీ ప్రాణాయం ఎలా చేయాలి:

 • మీకు సౌకర్యంగా క్రింద కూర్చొని , వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. తర్వాత డీప్ గా శ్వాస తీసుకుని వదలాలి.
 • శ్వాస తీసుకున్నప్పుడు పొట్టలోనికి బిగబట్టాలి, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కూడా వదులు చేయాలి. ఈ బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ పొట్టకండరాలను వదులు చేయడం మాత్రమే కాదు, తలనొప్పి కూడా తగ్గిస్తుంది.
 • ఈ కపాలబాతీ ప్రాణాయం 20 నిముషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిద్రలేవడంతోటే తలనొప్పి ఉంటే నివారించే మార్గలు

4. అష్టాంగ యోగం

4. అష్టాంగ యోగం

అష్టాంగ యోగ 8 రకాలున్నాయి. వాటిలో యమ -మోరల్ కోడ్, నియమ-సెల్ఫ్ ఫ్యూరిఫికేషన్, ఆసన-భంగిమ, ప్రాణాయమం-బ్రీత్ కంట్రోల్ , ప్రత్యాహార-సెన్స్ కంట్రోల్, ధారణ-ఏకాగ్రత, ధ్యానం-మెడిటేషన్ మరియు సమాధి-ఆత్మ-పరమాత్మను అధికగమించడం.

5. మెడిటేషన్ :

5. మెడిటేషన్ :

ప్రతి రోజూ బిజీగా గడపడం వల్ల ఒక చోటో కూర్చొని ఎక్కువ సమయం మెడీటేషన్ చేయలేరు. మెడీటేషన్ అనేది రోజులో ఎప్పుడైనా , ఎక్కడైనా చేయవచ్చు. ప్రయాణించే సమయంలో కూడా మెడీటేషన్ చేసుకోవచ్చు. ఓమ్ అని చదివితే చాలు మైండ్ రిలాక్స్ అవుతుంది. దాంతో మైండ్ కాలీగా లేకుండా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. తలనొప్పి, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

English summary

How Yoga Helps To Keep Headaches Away

International Yoga Day around we bring to you a case study that will reveal the startling fact about how yoga has helped in preventing a headache.
Subscribe Newsletter