Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
మనకు దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదా ?
కొన్ని అధ్యయనాలు దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని చెబుతున్నాయి. చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్దతి అయిన ఐస్ ప్యాక్ ని విరుగుడుగా భావించి వాడేస్తుంటారు. అలా వాడటం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. అందుకనే ఇప్పటికీ వాడుతున్నారు. కానీ ఐస్ అనేది దెబ్బను త్వరగా నయం కాకుండా అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు నిపుణులు.
అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ? దెబ్బ తగిలిన ప్రదేశంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల మంట మరియు వాపు ఆ ప్రదేశంలో వచ్చే అవకాశం తక్కువ. ఆ ప్రదేశాన్ని కొద్దిసేపు మొద్దుబారిపోయేలా చేసి మనకు నొప్పి కలగకుండా చేస్తుంది.
మన చుట్టుప్రక్కల మందుల షాపులు గనుక లేకపోతే అలాంటి సమయం లో ఐస్ ని వైద్యం చేయడానికి వాడటంలో తప్పు లేదు, కానీ అది అంత తెలివైన పని కాదు. ఎందుకు ? దెబ్బ తగిలిన చోట అసలు ఐస్ ఏమి చేస్తుంది ? ఎందుకు ఐస్ అనేది గాయాలకు వాడటం అంత మంచి పద్దతి కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

గాయం నయమయ్యే ప్రక్రియలో ఐస్ జ్యోక్యం చేసుకుంటుంది :
ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది, సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో జోక్యం చేసుకుంటుంది. ఆ ప్రాంతాన్ని కొద్దీ సేపు తిమ్మిరెక్కిస్తుంది. .

మండటం మంచిది కాదా ? :
మనమందరం దెబ్బ తగిలినప్పుడు మంట రావడం అనేది చెడు సంకేతంగా భావించి అలానే అవగతం చేసుకుంటాం. కానీ అది తప్పు, ఎందుకంటే మంట మనకు ఎలాంటి చెడు చేయదు. దెబ్బ తగిలినప్పుడు నిజానికి మంట రావడం అనేది, ఆ దెబ్బ నయమయ్యే భాగంలో మొదలయ్యే మొదటి ప్రక్రియ. దెబ్బ తగిలిన చోట కణజాలాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే మంట అనేది ఖచ్చితంగా రావాలి. కానీ మనం ఎప్పుడైతే ఐస్ ని వాడతామో అప్పుడు అది మంటను రాకుండా అడ్డుకుంటుంది.

మరి శోషరస ద్రవాల సంగతేంటి ? :
అసలు ఐస్ అనేది గాయానికి ఏమి చేస్తుంది ? శోషరస ద్రవాలు ప్రవాహాన్ని ఐస్ అడ్డుకుంటుంది. దీని వల్ల మనకు దెబ్బ నయమయ్యే సమయం మరింత పెరుగుతుంది.

ఐస్ అనేది ఇంకా ఎలా ప్రభావం చూపిస్తుందంటే :
కండరాల మధ్య సమన్వయాన్ని, వేగంతో కూడిన బలాన్ని ఐస్ తగ్గిస్తుంది. ఇందు వల్ల మన కండరాల కదలిక తగ్గిపోతుంది.

కణాల సంకేతవ్యవస్థ :
కణాల సంకేతవ్యవస్థ లో ఐస్ జ్యోక్యం చేసుకుంటుంది. ఇందు వల్ల దెబ్బ తగిలిన భాగంలో కణాలు అంత త్వరగా వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. ఇందు వల్ల ఆ భాగం నయం అవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఎందుకు రక్త ప్రసరణ చాలా ముఖ్యం :
ఎప్పుడు అయితే మనకు దెబ్బ తగులుతుందో అప్పుడు ఆ ప్రదేశంలో రక్త నాళాలను పెద్దవిగా చేస్తుంది మన శరీరం. అందువల్లనే ఆ ప్రదేశం లో వాపు వస్తుంది.ఆ సమయంలో ఆ ప్రాంతంలో రథ ప్రసరణ అధికమవుతుంది. రక్త ప్రసరణ ఎక్కువైనప్పుడు కొన్ని ప్రొటీన్ల తో పాటు, కొన్ని రసాయనాలు దెబ్బ తగిలిన ప్రాంతానికి చేరుకుంటాయి. దీనితో అక్కడ నయం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఐస్ వాడతామో ఈ మొత్తం ప్రక్రియకు విఘాతం కలుగుతుంది.

మంట అనేది ఎలా ఉపయోగ పడుతుందంటే :
ఎప్పుడైతే దెబ్బ తగిలిన చోట మంట వస్తుందో అప్పుడు అక్కడ కణజాలాన్ని మేల్కొల్పడంలో మంట ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నిద్రావస్థలో ఉన్న కణాలు కూడా దెబ్బను నయం చేయడానికి పని మొదలు పెడతాయి. సాధారణంగా జరిగిపోయే ఈ నయమయ్యే ప్రక్రియకు ఐస్ వాడకం అనేది పెద్ద అవరోధం గా నిలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు తాత్కాలికం గా నొప్పిని తాగ్గించుకోవడానికి ఐస్ ని వాడండి. ఆ తర్వాత ఖచ్చితంగా వైద్య సహాయాన్ని తీనుకోండి.



Click it and Unblock the Notifications
