అలర్ట్ : మీ కిడ్నీ ప్రమాధకర స్థితిలో ఉన్నాయని హెచ్చరించే సంకేతాలు

Posted By:
Subscribe to Boldsky

చాలా మందికి కిడ్నీ వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ అన్న విషయం తెలియదు. కిడ్నీ వ్యాధులున్నప్పుడు, పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేంతవరకూ వ్యాధి యొక్క ఎటువంటి లక్షణాలు బయటపడవు.

కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే, వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే కొన్ని ఇటువంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవచ్చు. అలా కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించడానికి ఈ క్రింది తెలుపబడిన లక్షణాల్లో ఒకటి లేదా రెండు లక్షణాలను గుర్తించినట్లైతే వెంటనే డాక్టర్ సంప్రదించడం వల్ల మూత్రపిండాల సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.

క్రిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించినట్లైతే వెంటనే ఈ వ్యాధికి చాలా సమర్థవంతంగా చికిత్సను అందించవచ్చు. మరి కిడ్నీవ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి...

వెన్నులో లేదా సైడ్ లో నొప్పి ఉండవచ్చు:

వెన్నులో లేదా సైడ్ లో నొప్పి ఉండవచ్చు:

కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వ్యాధి వల్ల నొప్పికి కారణం కావచ్చు, కిడ్నీలో రాయి ఉందనుకోండి లోయర్ బ్యాక్ పెయిన్ నుండి గజ్జదిగువల భాగం లోకిని వ్యాప్తిం చెంది ఒక తీవ్రమైన తిమ్మరి నొప్పికి గురిచేస్తుంది . అలాగే పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ , వారసత్వ మూత్రపిండాల లోపంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు.

అలసట మరియు సాధారణీకరించిన బలహీనత:

అలసట మరియు సాధారణీకరించిన బలహీనత:

ఎరిత్రోపోయిటిన్ అనే హార్మోన్ ను కిడ్నీలు ఉత్పత్తి చేస్తాయి, ఇది ఎర్రరక్తకణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి సహాయపడుతాయి. కిడ్నీల్లో ఎరిత్రోపోయిటిన్ తక్కువగా ఉన్నప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తహీనతకు గురిచేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు నీరసం మరియు తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది.

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు:

కిడ్నీ వ్యాధుల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుటకు కారణమవుతుంది. మరియు రక్తహీనత కిడ్నీ వ్యాధులకు ఒక సాధారణ సైడ్ ఎఫెక్ట్. ఈ కారణాల వల్ల మీ శ్వాసలో ఇబ్బందులు ఉండవచ్చు .

కాళ్ళు చేతుల్లో వాపులు: వాపు:

కాళ్ళు చేతుల్లో వాపులు: వాపు:

కిడ్నీలు మన శరీరంలో వ్యర్థాలను మరియు అదనపు నీటిని తొలగిస్తుంది. అలా సమయానికి వాటిని తొలగించలేనప్పుడు, ఈ అదనపు నీరు మీ చేతులు, పాదాలు మరియు ముఖంకు చేరి వాపుకు గురిచేస్తుంది.

యూరినరీ ఫంక్షన్ లో మార్పులు:

యూరినరీ ఫంక్షన్ లో మార్పులు:

మూత్రపిండాల వ్యాధి యొక్క మొదటి లక్షణం మూత్రంలో హెచ్చతగ్గులు, తరచూ మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడం లేదా అసలు మూత్రవిసర్జన చేయకుండుట. అదే విధంగా మూత్రం ఎక్కువగా పోవడం లేదా చాలా తక్కువగా పోవడం. అలాగే రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు పోవాల్సి రావడం. మూత్రం డార్క్ కలర్లో ఉండటం. మీకు మూత్రవిసర్జనకు వెళ్లాలినిపిస్తుంది కానీ, వెళ్ళరు.

అమ్మోనియా శ్వాస మరియు మెటాలిక్ టేస్ట్:

అమ్మోనియా శ్వాస మరియు మెటాలిక్ టేస్ట్:

మూత్రపిండాలు విఫలం చెందినప్పుడు రక్తంలో యూరియా ను పెంచుతుంది. ఈ యూరియా లాలాజంలోని అమ్మోనియాను విచ్ఛిన్నం చేస్తుంది, దాని కారణంగా చెడు శ్వాసకు( దీన్నే అమ్మోనియా బ్రీత్ అనికూడా పిలుస్తారు) కారణం అవుతుంది. అలాగే మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉంటుంది.

చర్మం దద్దర్లు మరియు దురద:

చర్మం దద్దర్లు మరియు దురద:

కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మీ రక్తంలో వ్యర్థాల ఏర్పాటుకు కారణం అవుతుంది. ఇది చర్మం దద్దుర్లకు మరియు దురదకు కారణం అవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    If Your Kidney Is In Danger, Your Body Will Show These Signs

    The kidneys are one of the most important human organs. Damage to any one of the kidneys could affect the entire functioning of the body. If diagnosed at the initial stage, kidney failure can be prevented. So how can we do this?
    Story first published: Friday, March 3, 2017, 14:50 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more