క్రమరహిత హృదయ స్పందనకు ఇదే కారణం కావచ్చు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

సాధారణ శరీర పనితీరు కోసం ఒక స్థిరమైన హృదయ స్పందన అనేది చాలా ముఖ్యం. హృదయ స్పందనలో ఏదైనా అసమానతలు గాని తలెత్తుతే అది తీవ్రమైన హృదయ సమస్యకు దారితీస్తుంది, అంతేకాకుండా, ఇది ఇతర ప్రధానమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఒక కొత్త పరిశోధన ప్రకారం, రక్తంలో అధిక మోతాదులో థైరాయిడ్ హార్మోన్ను కలిగి ఉండటం వలన, హృదయ స్పందన దారి తప్పే ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడైంది.

to regulate thyroid hormone

కాబట్టి, క్రమరహిత హృదయ స్పందనకు దారితీసే పరిస్థితులు అయితే మరేవి ? గుండెలో పై రెండు గదులను, అట్రియా అని పిలుస్తారు, ఇది క్రమరహితంగా మరియు సాధారణమైన కన్నా వేగవంతంగా పని చేస్తే "సక్రమంగాలేని హృదయ స్పందనకు" సంభవించడానికి ప్రధాన కారణమవుతుంది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యూరప్, యూఎస్, ఆస్ట్రేలియా నుండి, 11 రకాల అధ్యయనాలతో కూడిన తగిన సమాచారాన్ని విశ్లేషించడం కోసం, 30,085 వ్యక్తుల యొక్క థైరాయిడ్ పనితీరును అంచనా వేయడంతో పాటు, సక్రమంగాలేని హృదయ స్పందనను పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోబడ్డాయి.

ఈ అధ్యయనం తర్వాత, అధిక రక్తపోటుతో థైరాయిడ్ హార్మోన్ ఫ్రీ థైరాక్సిన్ (లేదా) FT4 ఉన్న వ్యక్తులను - తక్కువ రక్తపోటును కలిగి ఉన్న వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు 45 శాతం సక్రమంగాలేని హృదయ స్పందనతో బాధపడుతుందని అంచనా వేశారు.

to regulate thyroid hormone

ఈ అధ్యయనంలో భాగంగా, ఏ వ్యక్తిలో అయితే థైరాయిడ్ హార్మోన్లో స్వల్పమైన పెరుగుదలను కలిగి ఉంటాయో, వారిలో కూడా క్రమరహితమైన హృదయ స్పందనను పెంచే ప్రమాదముందని అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధన గూర్చి జర్నల్ సర్క్యులేషన్లో ఇటీవలే గుర్తించబడింది.

"థైరాయిడ్ హార్మోన్, స్వేచ్ఛగా విహరించే థైరాక్సిన్, రక్తంలో ప్రసరిస్తూ ఉండటంవల్ల, 'ఎట్రియాల్ ఫిబ్రిలేషన్' అనే ఒక అదనపు ప్రమాదానికి కారకం కావచ్చని మేము చేసిన పరిశోధనల్లో సూచిస్తున్నాయి" అని శాన్ఫ్రాన్సిస్కోలోని, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక పోస్ట్-డాక్టోరల్, మరియు ప్రధాన రచయిత అయిన "క్రిస్టీన్ బాముగార్ట్నే" తెలిపారు.

"స్వేచ్ఛగా విహరించే థైరాక్సిన్ యొక్క హార్మోన్ స్థాయిలు - అధిక ముప్పును కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించడానికి సహాయపడవచ్చు," అని బౌగార్ట్నేర్ మరింతగా జోడించి చెప్పారు. ఎలివేటెడ్ FT4 స్థాయిలు అనేవి హైపర్ థైరాయిడిజం, మరియు ఇతర థైరాయిడ్ సమస్యలు అయిన థైరాయిరైటిస్ (లేదా) టాక్సిక్ మల్టీనోడలర్ గోల్టెర్ వంటి వాటిని కూడా సూచిస్తాయి.

సక్రమంగాలేని హృదయ స్పందన వల్ల కలిగే ఇతర ప్రధాన లక్షణాలు గురించి ఇక్కడ తెలుసుకొందాం. అవేంటో మీరు కూడా చూడండి.

1. హార్ట్ పాల్పిటేషన్స్ :

1. హార్ట్ పాల్పిటేషన్స్ :

మన గుండె సాధారణ స్థితిలో ఉన్నప్పుడు సగటున రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటూ, 2,000 గ్యాలన్ల రక్తాన్ని మన శరీరానికి పంపు చేస్తాయి. కానీ మన హృదయ స్పందన ఈ స్థాయి కన్నా ఎక్కువగా (లేదా) తక్కువగా ఉన్నప్పుడు, మెదడు, మూత్రపిండము మరియు ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలను ప్రభావితం చేయగలదు.

2. అసాధారణమైన నొప్పిని కలుగచేస్తుంది :

2. అసాధారణమైన నొప్పిని కలుగచేస్తుంది :

హృదయ స్పందన అసాధారణంగా ఉన్నప్పుడు, అది ఛాతీ మరియు మెడ భాగంలో నొప్పిని కలుగచేసేదిగా ఉండవచ్చు. దీనివల్ల గుండె, మానవ శరీరానికి రక్తాన్ని సరఫరా చెయ్యడంలో గణనీయంగా ప్రభావితం కాగలదు మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

3. మైకము :

3. మైకము :

సక్రమంగాలేని హృదయ స్పందన యొక్క సాధారణ లక్షణాలలో ఇది ఒకటి. హృదయ స్పందన సక్రమంగా లేనప్పుడు, అది మెదడుకు సరిపడే ఆక్సిజన్ను అందించలేకపోవటానికి దారి తీస్తుంది, అందువల్ల ఇది మైకము సంభవించడానికి కారణమవుతుంది.

4. మూర్ఛ :

4. మూర్ఛ :

హృదయం రక్తాన్ని శరీరానికి సరైన క్రమంలో సరఫరా చేయలేకపోయినప్పుడు, అది శరీర సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది శరీర బలహీనతకు దారితీయడంతో పాటు, మూర్ఛకు కూడా దారితీస్తుంది. అలానే ఒక దురదృష్టకరమైన సందర్భంలో, మీ గుండె హఠాత్తుగా నిలిచిపోవడానికి మరియు గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు.

5. శ్వాస తగ్గిపోవడం :

5. శ్వాస తగ్గిపోవడం :

రక్త ప్రవాహం మరియు హృదయ స్పందన అసాధారణంగా ఉన్నప్పుడు, శ్వాస తగ్గిపోవడానికి మరియు శ్వాసలో గురక తీవ్రతను కలిగి ఉంటుంది. ఈ రకంగా వేగవంతమైన హృదయ స్పందన వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. మీరు సరైన సమయంలో జాగ్రత్తలను తీసుకోకపోతే, అది జీవితకాల వైకల్యానికి దారితీస్తుంది మరియు అలాగే అది ప్రాణాంతకం కూడా కావచ్చు.

English summary

Irregular Heartbeat Can Be Caused Due To This

Having a stable heartbeat is very important for the normal body functioning. Any irregularity in the heartbeat can cause serious heart problem, and in addition, it can also lead to other major health issues. According to a new research, higher levels of thyroid hormone in the blood has been found to increase the risk of having an irregular heartbeat..