నీటి నుంచి ఫ్లోరైడ్ తొలగించే ప్రభావవంతమైన విధానం కనుగొనబడింది

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ పెద్దవాళ్ళు తరచూ నీళ్ళలో ఫ్లోరైడ్ గురించి చింతించడం, అది మీ కుటుంబ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని బాధపడటం చూసే ఉంటారు. మీరు కూడా అలాంటి చర్చల్లో భాగమై ఉంటే మీకో శుభవార్త.

ఐఐటి హైదరాబాద్ కి చెందిన పరిశోధక బృందం భూగర్భ జలంలోంచి అధిక ఫ్లోరైడ్ ను తొలగించే కొత్త పద్ధతిని కనుక్కున్నారు.

పరిశోధక బృందం ప్రకారం నేరేడు విత్తనాలలో ఉండే యాక్టివేటడ్ కార్బన్ భూగర్భజలంలోని అధిక ఫ్లోరైడ్ ను తొలగిస్తుంది.

ఈ అధ్యయనం జరుగుతున్నప్పుడు, పరిశోధకులు నేరేడు విత్తనాల పొడిని తీసుకొని అధికమైన పోరస్ కార్బన్ పదార్థంగా మార్చారు. ఈ కార్బన్ పదార్థాన్ని అధిక ఉష్ణోగ్రతలలో మరింతగా ప్రాసెస్ చేసి దాని ప్రభావాన్ని పెంచుతారు.

fluoride in water effects

ఫ్లోరైడ్

విచారణకి, ఈ పదార్థాన్ని మొదటగా ల్యాబ్ లో తయారుచేసిన సింథటిక్ ఫ్లోరైడ్ ద్రావణాలపై ప్రయోగించారు.తర్వాత దారుణంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణాలోని నల్గొండ జిల్లాలోని భూగర్భ జలాలపై ప్రయోగించారు, పరీక్షలు చేసారు.

ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఫ్లోరైడ్ గాఢత 1.5 మి.గ్రా/లీ కి తగ్గిపోయింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పరిధిలోనే ఉంది.

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన రమ్య అరగ మాట్లాడుతూ, వారి బృందం నేరేడు విత్తనాల కార్బన్ ను వాడి నీటి కలుషిత పదార్థాలను తొలగించే పద్ధతులు కూడా కనుగొంటున్నామని తెలిపారు.

ఈ అధ్యయనం ఇటీవల జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ కెమికల్ ఇంజినీరింగ్ లో ప్రచురితమైంది.

fluoride in water effects

ఫ్లోరైడ్

మీ నీళ్ళలో అధిక ఫ్లోరైడ్ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దాని ప్రభావం తక్కువ నుంచి తీవ్రంగా కూడా ఉండవచ్చు. అవేంటో కొన్ని ఇక్కడ చూడండి.

మీకు తెలియాల్సినది కొంచెం ఫ్లోరైడ్ తీసుకోవడం దంత సమస్యలను తీరుస్తుంది. కానీ అధిక ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగటం వలన ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది, ఇది పళ్లను, ఎముకలపై భారీగా ప్రభావం చూపిస్తుంది.

ఎక్కువ సమయం అధిక ఫ్లోరైడ్ తీసుకోవడం వలన ఎముకల ఫ్లూరోసిస్ వస్తుంది. స్కెలిటల్ ఫ్లోరోసిస్ విషయంలో ఎముకలో ఫ్లోరైడ్ ఏళ్ల తరబడి ఎక్కువ పేరుకుపోతుంది. స్కెలిటల్ ఫ్లూరోసిస్ మొదటి లక్షణం కీళ్లలో నొప్పి మరియు గట్టిదనం పెరిగిపోతుంది.

fluoride in water effects

తీవ్ర ఫ్లోరోసిస్ ఇతర పెద్ద లక్షణాలు ఎముకల ఆకారం మారిపోతుంది మరియు లిగమెంట్లు అధిక కాల్షియంతో నిండిపోతాయి. దీర్ఘకాలం ఇలా జరగటం వలన కండరాలు పనిచేయక, తీవ్రనొప్పికి గురవుతాయి.

ఫ్లోరైడ్ ఎక్కువ అవటం వలన వెనువెంటనే కన్పించే ప్రభావాలు - తీవ్ర కడుపు నొప్పి, అధిక లాలాజలం, వికారం మరియు వాంతులు. సీరియస్ కేసుల్లో సీజర్స్ మరియు కండరాల నొప్పులు కూడా రావచ్చు.

English summary

Effective Way To Remove Fluoride From Water Found

A team of researchers from the Indian Institute of Technology (IIT), Hyderabad has come up with a new way to remove excess fluoride from groundwater. According to the researchers, the activated carbon' obtained from jamun seeds can help to remove excess fluoride from the groundwater.